Thursday, August 27, 2020

కాళీ రూపాలు - గుహ్యకాళి :

కాళీ రూపాలు - గుహ్యకాళి :


తంత్ర శాస్త్రాలను అనుసరించి, 9 రకాల కాళీ రూపాలు కలవు. 1) దక్షిణ కాళి 2) భద్ర కాళి 3) గుహ్య కాళి 4)  కామ కలా కాళి 5) కాల కాళి 6) శ్మశాన కాళి 7) సిద్ధి కాళి 8) చండ కాళి 9) ధన కాళి.

ఈ నవ కాళికల గురించి, మహాకాల సంహిత సవిస్తరంగా వర్ణించింది. ఈ మహాకాల సంహిత 50,000 మంత్రాలతో ఉండేది. అయితే ఈ 50000 లో, ప్రస్తుతం మనకు 1. గుహ్య కాళి ఖండము 2. కామకలా కాళి ఖండము మాత్రమే లభ్యమగుచున్నవి.

"వామకేశ్వర తంత్రం"లో భాగమైన "హిరణ్యపుర విజయం"లోగల "కామ కలాఖండంలో, కామకలా కాళికి చెందిన రావణ కృత స్తోత్రము కలదు.(అయితే ఈ రోజు వామకేశ్వర తంత్రము పూర్తి భాగము లభ్యం అగుట లేదు). ఈ 50,000 మంత్రాలలో కేవలం 7 నుండి 8 వేల మంత్రాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఈ రోజు "దక్షిణ కాళిక" కు చెందిన సాహిత్యం , ఇతోధికంగా లభ్యం అవుతోంది. సాధారణంగా  జనావళిలో చాలామంది "దక్షిణ కాళికయే" కాళికగా భావిస్తారు.

   మన ప్రాచీన సాహిత్యంలో "హహరవ తంత్రము", "అథర్వ వేద సంహిత"నుండి తీసుకోబడింది. ఈ "హహరవ తంత్రం" లో "గుహ్యకాళి" ఉపాసన కలదు.

ఆసక్తి కరమైన విశేషమేమిటంటే, హహరవ తంత్రంలో ప్రారంభ పాఠంలో "సుమేరు పృష్ఠ స్థితి", అనేది మనం సాధారణంగా చెప్పుకొనే, "కైలాస శిఖరే రమ్యే" కు దగ్గరగా ఉంటుంది. మేధావులు, పరిశోధకులు ఏమంటారంటే, ఇది "సుమేరియన్ నాగరికత" కు సంబంధం ఉందా....అని ఆశ్చర్యపోతారు.


    "సో-హం" అనేది, జీవుల యొక్క శ్వాస మూల తత్వం, హంస తత్వం. ఈ "హంస" మంత్రం, శ్వాస-నిశ్వాసలలో బంధితమైనది. గాలి లేకుండా మేఘాలు ఎలా లేవో, ఆకాశం సంకుచితంగా ఎన్నడూ ఉండలేదో, అలాగే హంస లేకుండా విశ్వం లేదు. ఈ హంస మంత్రము నుండే విశ్వంలో గల స్థావర-జంగమాదులు ఏర్పడ్డాయి. కాశ్మీరీ శైవం కాళీ రూపాలను 12 గా పేర్కొంటుంది.


     54చేతులతో, 10 ముఖములతో చెప్పబడ్డ "గుహ్య కాళి"కి , షోషశ బీజాక్షర మంత్రం చెప్పబడినది. "శ్రీమద్రామాయణం"లో ఈమె "భరతుని" చే ఉపాశించబడినది. దక్షిణ కాళికలా కాకుండా, ఈ గుహ్య కాళి...సృష్టి-సంహార కృత్యాలను  చేస్తుంది. అయితే "గుహ్య కాళి" ఉపాసన, సాధన...ఒక సిద్ధి పొందిన గురువు ద్వారా మాత్రమే తీసుకోవాలి.

 మహా కాల సంహిత : మహాకాలునికి , మహాకాళికి జరిగిన సంవాద రూపంలో ఉంటుంది...ఈ తాంత్రిక గ్రంథం. ఇందులో అమ్మ కాళిక , మహా కాలుణ్ణి అనేక ప్రశ్నలు వేయగా...అతనిచ్చిన జవాబులే, గుహ్యకాళి యొక్క చిత్రణ. ఈ గ్రంథంలో గుహ్యకాళి ఉపాసనా విధానాలు, మహాకాలుడు చెప్పిన 18 మంత్రాలు, యంత్రాలు పేర్కొనబడ్డాయి.


 గుహ్యకాళి ముఖములు...100, 60, 36, 30, 20,10, 5, 3, 2, 1.....గా ఈ తంత్రములో చెప్పబడినది. వివిధ ముఖములు, వివిధ మంత్రములు...వివిధ రూపాలకు ప్రతిబింబించేవిగా ఉంటాయి.

భట్టాచార్య

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS