Friday, August 28, 2020

మన పండుగల గొప్పతనం

మన పండుగల గొప్పతనం 



*ఉగాది:*- కష్టము,సుఖము,సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.


*శ్రీరామ నవమి*:- భార్య - భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.


*అక్షయ తృతీయ*:- విలువైన వాటిని  కూడబెట్టుకోమని.


*వ్యాస (గురు)పౌర్ణమి* :-  జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.


*వరలక్ష్మి వ్రతం* :-  నీకున్న ఐశ్వర్యమును అందరికి పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.


*రాఖీ పౌర్ణమి*:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.


*వినాయక చవితి* ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.


*పితృ అమావాస్య* :-   చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ.


*బతుకమ్మ*:- ఊళ్లోని వాళ్లంతా ఆట పాటలతో కలిసిపోతూ సంతోషంగా గడపమని.


*దసరా ( ఆయుధ పూజ)*  :- ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.


*దీపావళి* :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.


*నాగుల చవితి*;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.



*కార్తీక పౌర్ణమి* :-  చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమనెడి.


*సంక్రాంతి*:-  మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.


*మహా శివరాత్రి* :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.


*కామదహనం*:-  కోరికలు తగ్గించమని.


*హోళీ* :-  వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు ,వివిధ అనుభూతులను పిల్లా పెద్ధ అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని మన పండుగల అంతరార్దం🙏

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS