Wednesday, August 26, 2020

జీవితం లో రాజయోగం అష్ట అశ్వర్యములు లభించుటకు నిత్యం ఆచారించు విధి విధానములు.......!

జీవితం లో రాజయోగం అష్ట అశ్వర్యములు లభించుటకు నిత్యం ఆచారించు విధి విధానములు.......!!


1.ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన..విరిగిన..
వస్తువులు పడేయండి.
బూజు దులపడం..శుభ్రం చేయడం చేయండి.

2.ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ.. అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి.
గృహ స్త్రీలు..ఎప్పుడు కంటి తడి పెట్టకూడదు.

3.ప్రతిరోజూ పూజలో శ్రీ సూక్తం తప్పని సరి చదవండి.

4.పూజగదిలో తప్పని సరి ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడంవల్ల ధనప్రాప్తి జరుగుతుంది.

5.ఉదయం లేవగానే రెండు అరచేతులు చూసి నాలుగైదు సార్లు ముఖంపై తిప్పడంవల్ల లక్ష్మి ప్రాప్తి జరుగుతుంది.

6.మీరు పొదుపు చేయదలచుకుంటే భరణీ నక్షత్రం లో చేయండి,

7.మీరు డబ్బు పెట్టేచోట కొన్ని అక్షితలు..
నాలుగు లక్ష్మీ గవ్వలు..
నాలుగు శ్రీ ఫలాలు..
నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు..
శ్రీ సూక్తం చదివి పెట్టండి.

8.మీ చేతిలో డబ్బు నిలవడం లేదా? 
మీకు వచ్చిన లాభంలో పదిశాతం దాన ధర్మాలకు కెటాయించండి,

9.అవసరాన్ని మించి డబ్బు రానపుడు..
మీ కుల దైవానికి మొక్కులు చెల్లించంచండి,

10.ఎపుడూ డబ్బుకు ఇబ్బంది అయితే వీలయినంత చిన్న పిల్లలకు స్వీట్లు చాక్లెట్లు పంచండి.

11.పిల్లలకు ఎప్పుడైనా వికారంగా ఉండి సరిగ్గా తినకుంటే ఒక కొబ్బరికాయ లేదా గుడ్డుని వారిపైనుండి తిప్పి కూడలి లో వేసిరండి,

12.మీ దగ్గర ఎప్పుడూ రెండు లక్ష్మీ గవ్వలు,
గోమతి చక్రాలు,
జేబులో ఉంచడం వల్ల 
జేబు ఖాళీ ఉండదు.

13.ఉదయం లేవగానే మీ ఎదురుగా చూడటానికి పసుపు,ఆకుపచ్చ రంగును కలిగిన ఏదైనా వస్తువు ఉంచండి,

14.మీరు వాడే పర్సు వీలైనంత ఎరుపు రంగులో 
ఉండేట్టు చూడండి.

15.సుహాసినులు వీలైనంత ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరించే ప్రయత్నం చేయండి.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS