Wednesday, August 26, 2020

కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలి?

💐💐కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలి?💐💐


కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చునని, ఒకవేళ అది కష్టమైతే దగ్గర్లోని ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చు. లేదంటే నోములు - వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ వుంటారు గనుక, వాటితో పాటు కొబ్బరికాయను కూడా ఇవ్వడం వలన ఎలాంటి దోషం ఉండదని పండితులు చెబుతున్నారు. నోములు - వ్రతాలు వంటి పూజా కార్యక్రమాల్లోనూ, దేవాలయాల్లో జరిగే దైవ కార్యాలలోను కలశారాధన జరుగుతూ వుంటుంది. రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపు - కుంకుమలు పెడతారు. ఆ కలశంలో కొంత నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు. కొబ్బరికాయకు వస్త్రం చుట్టి పూజిస్తారు. ఇక పూజ అయిన తరువాత ఈ కొబ్బరికాయను ఏం చేయాలనే సందేహం చాలా మందికి కలుగుతూ వుంటుంది. అదే దేవాలయాల్లో అయితే ఇలా కలశానికి ఉపయోగించిన కొబ్బరి కాయలను 'పూర్ణాహుతి'కి వాడుతుంటారు. ఇళ్లలో వాడిన కొబ్బరిని బ్రాహ్మణులకు ఇవ్వడం నీళ్ళల్లో నిమజ్జనం చేయడం చేయాలని పండితులు చెబుతున్నారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS