Wednesday, August 26, 2020

అర్ధనారీశ్వరస్తోత్రమ్

 శంకరస్తోత్రాలు : అర్ధనారీశ్వరస్తోత్రమ్



చామ్పేయగౌరార్ధశరీరకాయై
కర్పూరగౌరార్ధశరీరకాయ ।
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 1 ॥

సంపెంగపువ్వువలే ఎర్రనైన అర్ధశరీరము కలదీ -  కొప్పు ధరించినది అగు పార్వతికి, కర్పూరము వలే తెల్లనైన అర్ధశరీరము కలవాడు - జటాజూటము ధరించిన వాడు అగు శివునకు నమస్కారము.

కస్తూరికాకుఙ్కుమచర్చితాయై
చితారజఃపుఞ్జవిచర్చితాయ ।
కృతస్మరాయై వికృతస్మరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 2 ॥

కస్తూరీ - కుంకుమలను శరీరముపై పూసుకున్నది - మన్మథుని బ్రతికించునది అగు పార్వతికి, చితిలో భస్మను పూసుకున్నవాడు - మన్మథుని సంహరించినవాడు అగు శివునకు నమస్కారము.

ఝణత్క్వణత్కఙ్కణనూపురాయై
పాదాబ్జరాజత్ఫణినూపురాయ ।
హేమాఙ్గదాయై భుజగాఙ్గదాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 3 ॥

ఝణ ఝణమని మ్రోగు కంకణములు - అందెలు, బంగారు భుజకీర్తులు ధరించిన పార్వతికి, పాములను పాదములందు కడియములుగానూ - చేతులందు కేయూరములుగానూ ధరించిన శివునకు నమస్కారము.

విశాలనీలోత్పలలోచనాయై
వికాసిపఙ్కేరుహలోచనాయ ।
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 4 ॥

విశాలమైన నల్లకలువలవంటి కన్నులు కలది - రెండు కన్నులున్నదగు పార్వతికి, వికసించిన ఎర్రతామరల వంటి కన్నులు కలవాడు - మూడు కన్నులు కలవాడు  అగు శివునకు నమస్కారము.

మన్దారమాలాకలితాలకాయై
కపాలమాలాఙ్కితకన్ధరాయ ।
దివ్యామ్బరాయై చ దిగమ్బరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 5 ॥

మందారమాలను కురులలో అలంకరించుకున్నది - దివ్య వస్త్రములను ధరించినది అగు పార్వతికి, మెడలో కపాలమాలను అలంకరించుకున్నవాడు - దిగంబరుడగు శివునకు నమస్కారము.

అమ్భోధరశ్యామలకున్తలాయై
తడిత్ప్రభాతామ్రజటాధరాయ ।
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 6 ॥

మబ్బువంటి నల్లని కేశములు కలది - తనకంటే గొప్పవారు లేనిది అగు పార్వతికి, మెరుస్తున్న రాగిరంగు జటాజూటము కలవాడు - అందరికంటే గొప్పవాడు అగు శివునకు నమస్కారము.

ప్రపఞ్చసృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్తసంహారకతాణ్డవాయ ।
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయై చ నమః శివాయ ॥ 7 ॥

ప్రపంచమును సృష్టించుటకు ఉన్ముఖమైన లలిత నృత్యము చేయు జగన్మాతయగు పార్వతికి, సమస్తమును సంహరించు ప్రచండ తాండవము చేయు జగత్పితయగు శివునకు నమస్కారము.

ప్రదీప్తరత్నోజ్జ్వలకుణ్డలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ ।
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 8 ॥

ప్రకాశించు రత్నకుండలములు ధరించినది - శివునితో కలసినది అగు పార్వతికి, శోభిల్లు మహాసర్పములను అలంకరించుకున్నవాడు - పార్వతితో కలసినవాడు అగు శివునకు నమస్కారము.

ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా
స మాన్యో భువి దీర్ఘజీవీ ।
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం
భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః ॥ 9 ॥

కోరికలు తీర్చు ఈఎనిమిదిశ్లోకముల స్తోత్రమును భక్తితో పఠించువాడు, ఆదరణీయుడై భూలోకమునందు చిరకాలము జీవించును. అనంతకాలము సౌభాగ్యమును పొందును. అతనికి ఎల్లప్పుడూ అన్నీ సిద్ధించును.

॥ ఇతి శ్రీశఙ్కరభగవత్పాదాచార్య కృతం అర్ధనారీశ్వరస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS