Wednesday, May 31, 2023

నరకం నుండి తప్పించుకోవడానికి శివుడు కార్తీకేయకు చెప్పిన రహస్యాలేంటో తెలుసా....!!

నరకం నుండి తప్పించుకోవడానికి శివుడు కార్తీకేయకు చెప్పిన రహస్యాలేంటో తెలుసా....!!




🌿మనలో ఎక్కువ మంది పూజించే దేవుళ్లలో శివుడు ఒకరు. ఈ దేవుడికి భోళా శంకరుడు  అమరేశ్వరస్వామి, దక్షిణామూర్తితో పాటు ఇంకా ఎన్నో రకాల పేర్లతో ఈ దేవుడిని పూజిస్తారు.

🌸ఈ స్వామి అనుమతి లేనిదే చీమ అయినా కుట్టదు అని పురాణాల్లో పేర్కొనబడింది. అందరికీ రెండు కళ్లు ఉంటే శివుడికి మాత్రం మూడు కళ్లు ఉంటాయి. 

🌿కానీ ఆ దేవుడు ఆ కన్నును ఇప్పటివరకు తెరవలేదని పురాణాల ద్వారా తెలిసింది. కానీ ఒకవేళ ఆ కన్ను తెరిస్తే మొత్తం భస్మం అవుతుందని పండితులు చెబుతారు.

🌸ఇక విషయానికొస్తే శివపార్వతీ దేవి చిన్న కుమారుడైన సుబ్రమణ్యం స్వామికి అమర జీవితం యొక్క మోక్షం యొక్క రహస్యాలు చెప్పినట్టు చాలా మందికి తెలియదు. 

🌿కొద్దిమందికి మాత్రమే తెలుసు. సుబ్రమణ్యం స్వామికి కార్తీకేయ అని, మురుగన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. తమిళనాడులో మురుగన్ అని ఆ దేవుడిని కొలుస్తారు. 

🌸శివుడు తన రెండో కుమారుడు అయిన సుబ్రమణ్యం స్వామికి ఏమేమి రహస్యాలో చెప్పాడో.. ఎందుకు చెప్పాడో ఈ కథలో తెలుసుకుందాం.

🌿మోక్షం పొందాలంటే.. ప్రజలు తమ పనులను సక్రమంగా పూర్తిచేస్తే కైలాసానికి వచ్చి మోక్షాన్ని సాధించగలరా అని శివుడిని అడగగా, అప్పుడు శివుడు చెప్పిన విషయం వింటే చాలా మందికి ఆశ్చర్యమేస్తుంది.

🌸 ఇంతకీ శివుడు ఏమి చెప్పాడంటే స్వచ్ఛమైన భక్తితో పవిత్ర స్థలాలకు వెళ్లే వారంతా మోక్షాన్ని పొందవచ్చని శివుడు చెప్పాడు. 

🌿పాపాలను కడిగేయాలంటే.. ఏయే ప్రదేశాలు మంచివి. ఏ కోరికలు, ఆలోచనలు స్వచ్ఛమైనవి సుబ్రమ్మణ్యం స్వామి శివుడిని అడిగాడు.

🌸 ఇందుకు గాను శివుడు బదులిస్తూ ‘‘నదులన్నీ పవిత్ర గంగానదిలో పుట్టుకొచ్చాయి. కాబట్టి ప్రతి నది తీర్థయాత్ర ప్రదేశం మంచిది.

🌿 ఎవరైనా తమ పాపాలను కడిగేయాలంటే.. మొదట ఈ నదుల నీటిలో స్నానం చేయాలి. లేదా ఈత కొట్టాలి. తర్వాత పవిత్ర త్రిమూర్తుల ఆశ్రయాలను సందర్శించాలి‘‘ అని చెప్పాడు.

🌸 కష్టాల నుండి విముక్తి కావాలంటే లేదా ఏదైనా తప్పు చేసి ఒప్పుకొన్నప్పుడు కాశీ, అయోధ్య, ద్వారక, మధుర, రామ్ దీర్త్, పుష్కర్ లో బ్రహ్మ, విష్ణు, లవద్ద  వారి పాపాలను క్షమించడానికి  కోరుకుంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు. 

🌿ఈ ప్రదేశాలను సందర్శించడం వల్ల ప్రపంచంలోని అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారని శివుడు చెప్పాడు. ఇక్కడ తప్పుచేసిన వారంతా తమకు తాము లొంగిపోయి దేవుని ఆశ్రయం పొందవచ్చు. 

🌸ఎవరైనా బానిసత్వం నుండి విముక్తి కావాలంటే ఏమి చేయాలని సుబ్రహ్మణ్యస్వామి శివుడిని అడగగా ‘‘ ‘‘గోమతి నది పవిత్ర స్నానం, వారణాసిలో జనన, మరణ చక్రాల్లో స్మరించడం, విశ్వనాథ్ వందనం వంటి వాటిని సందర్శిస్తే బానిసత్వం నుండి విముక్తి లభిస్తుంది‘‘ అని శివుడు చెప్పాడు.

🌿నరకం నుండి తప్పించుకునే మార్గం.. మన పవిత్ర పుస్తకాల్లో చెప్పినట్టుగా, శివుడు మన పూర్వీకులకు నువ్వులు మరియు పవిత్ర నదిపై నీరు ఇస్తే నరకం యొక్క హింస నుండి మనల్ని కాపాడుతుందని శివుడు చెప్పారు.

🌸 మహాకాళేశ్వర్ ను ఆరాధించడం వల్ల మనిషి చేసి అన్ని పాపాలు తొలగిపోతాయని శివుడు చెప్పాడు.

🌷శ్రీ కృష్ణుడు చెప్పిన రహస్యం..🌷 

🌿ఒక వ్యక్తి తన జీవితంలో తీర్థయాత్రలు పూర్తి చేసినప్పుడు, అతను గంగోత్రి మరియు యమునోత్రికి వెళ్లాలి. 

🌸అక్కడ అతను పవిత్ర జలం తీసుకుని బద్రీనాథ్ కు వెళ్లి క్షమాపణ కోరి చివరకు కేదారానాథ్ లో ఆశీర్వాదం పొందాలి. 

🌿కృష్ణుడు చనిపోయే ముందు తీర్థయాత్రకు వెళ్లిన పాండవులకు 
ఈ రహస్యం చెప్పబడింది అని..పురాణ వచనం...🚩
🙏🌹🙏🚩
అరుణాచలశివ 🌹

తులసి పూజ ఎలా చేయాలి?

తులసి పూజ ఎలా చేయాలి?


తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాపప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.

ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.

నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!
నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!

ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్

అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం

అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.

"తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే"

అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.

👉పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.

తులసి చెట్టునుండి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి. సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు.

మన ఆలయాల విశిష్టతలు ...........!!

మన ఆలయాల విశిష్టతలు ...........!!

              *సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:* 
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.
7.సూర్యనారాయణ దేవాలయం జోగుళాంబ అలంపూరు గద్వాల జిల్లా 

💎 *నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు:* 
1. మహానంది
2. జంబుకేశ్వర్ 
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్ 
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా
9.అలంపురం

💎 *నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.* 
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  
3. మంజునాథ్.

*శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్

💎 *సముద్రమే వెనక్కివెళ్లే* 
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

💎 *స్త్రీవలె నెలసరి* అయ్యే 
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  
2. కేరళ దుర్గామాత.

💎 *బహ్మ పేరు తో ఏకైక శివాలయాలు*
అలంపూరులో నవఁబహ్మేశ్వర ఆలయాలు
9 రూపాలలో శివలింగాలు ఉంటాయి   

💎 *రంగులు మారే ఆలయం.* 
1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

💎 *నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 
1. కాణిపాకం,  
2. యాగంటి బసవన్న,  
3. కాశీ తిలభండేశ్వర్,  
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

💎 *స్వయంభువుగా* 
సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 
1. బదరీనాథ్,  
2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
3. గుహ్యకాళీమందిరం. 

💎*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 
హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

💎*12 ఏళ్లకు ఒకసారి*
పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్,  హిమాచల్ ప్రదేశ్.

💎*స్వయంగా ప్రసాదం తినే* 
1.  కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం

💎*ఒంటి స్తంభంతో*
యుగాంతానికి గుర్తుగా  ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

💎*రూపాలు మారే*
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

💎*నీటితో దీపం వెలిగించే* ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,  మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది,  ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

💎*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

💎*మనిషి వలె గుటకలు*  
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 

💎*ఛాయా విశేషం* 
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం

💎*నీటిలో తేలే* విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ),  నేపాల్

*పూరీ* 
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి,  దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే  పూరి ప్రసాదం.

Tuesday, May 30, 2023

చిట్టి తంత్రాలు మరియు ఆధ్యాత్మిక పరిష్కారాలు.....!

చిట్టి తంత్రాలు మరియు ఆధ్యాత్మిక పరిష్కారాలు.....!!

👉 బాలారిష్ట దోషాలు తొలగటానికి ప్రతీ మంగళవారం పచ్చిపాలను పదకొండు సార్లు దిగ దుడుస్తూ ఆ పాలను నల్లని కుక్కకు పోయాలి. ఇలా పదకొండు లేక 21 రోజులు పోస్తుంటే బిడ్డకు బాలారిష్ట దోషాలు పోయి ఆరోగ్యం గా ఉంటారు.

👉 ప్రేమ వివాహానికి ప్రేమ వివాహం కావాలంటే జన్మ నక్షత్రం రోజు లక్ష్మీనారాయణ పోటో ఒకటి తీసుకుని ఉదయాన్నే స్నానం చేసి పూజ మందిరంలో ఆ పోటో ఉంచి ఓం లక్ష్మీనారాయణ నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ ఆలా ప్రతీ రోజూ చేయాలి. ప్రతీ గురువారం దేవాలయం లో మాత్రం శనగపిండి తో చేసిన తీపి పదార్థాలు భక్తులకు పంచుతూ ఉండాలి.

👉 మీ ఇంట్లో పక్షులు త్రాగడానికి వీలుగా ఒక తొట్టెలో గానీ ఒక పాత్రలో గానీ నీటిని నింపండి. ఇలా రోజూ చేస్తుంటే కుటుంబం దినదినాభివృద్ధి చెందుతుంది.

👉 ఇంట్లో పెంచరాని వృక్షాలను పెంచినా దేవతా వృక్షాలను చెడు తిథి, నక్షత్రాలలో కొట్టేసినా ఆ ఇంట్లో నివశించే వారు మనఃశ్శాంతి కోల్పోతారు.

👉 నిత్యం భోజనం చేసే ముందు మీ పూర్వీకులను స్మరించడం వలన పితృదేవతల ఋణం తీర్చుకున్నట్లు అవుతుంది.

👉 ప్రతి రోజూ పక్షులకు పెసరు గుళ్ళను కొద్దిగా అన్నం వేయడం వలన విద్యార్థులకు విద్య అబ్బుతుంది. గృహస్తులు ఈ విధంగా చేయడం వలన సంతానంతో సఖ్యత కలుగుతుంది. సంతానం ఉన్నత స్థితి పొందుతారు.

👉 గోధుమ రంగు గోవుకు గరికె లేక నవధాన్యాలు పెడితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

👉 వేయి ఎకరాల భూదానం చేస్తే లభించే ఫలం ఒక్క గోదానం తో సిద్ధిస్తుంది. 

👉 గర్భవతులు అయిన స్త్రీలు ప్రతీ రోజూ షష్టీ దేవిని స్మరించడం మంచిది. 

👉 ఉపదేశం పొందిన మంత్రాలను ఎప్పుడూ తూర్పు అభిముఖంగా కూర్చుని జపం చేయడం మంచిది. 

👉 ప్రతీ అమావాస్య రోజు కాళీ, దుర్గా,భైరవి, చంఢి వంటి ఉగ్రదేవతలను దర్శించుకోవడం వలన ఇతరులు మీకు చాలా సులభంగా వశం అవుతారు.

👉 ప్రతీ రోజూ మీరు నివశించే గృహానికి దగ్గరలో ఏ దేవత దేవాలయం ఉన్నా ఆ దైవాన్ని దర్శించుకోవడం వలన మీకు స్థాన బలం ఏర్పడుతుంది.

👉 108 రోజులు ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత శివునికి అభిషేకం చేయించుకోవడం వలన విద్య, ఉద్యోగం, వ్యాపారం లో ఎటువంటి ఒత్తిడి గానీ సమస్యలు కానీ కలుగవు. కుటుంబ పరమైన, భాగస్వామ్య వ్యాపార సమస్యలు, ఇతరుల వలన వచ్చే ఇబ్బందులు నాశనం అవుతాయి.

👉 లక్ష్మి అనుగ్రహం కావాలంటే బుధవారం, గురువారం లలో అష్ట గణపతులను,అష్ట లక్ష్మీలను కలిపి పూజించడం వలన తొందరగా ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది.

నవ గ్రహా పారాయణాలు, పుణ్యతిథులు !

నవ గ్రహా పారాయణాలు, పుణ్యతిథులు !


నవగ్రహాల శాంతికి ఆ గ్రహానికి సంబంధిత పారాయణము, పుణ్యతిథుల్లో స్తుతిస్తే ఆ గ్రహ ప్రభావములచే ఏర్పడే ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా నవగ్రహాల పారాయణాలు, పుణ్యతిథులు ఏమిటో తెలుసుకుందాం..!

తొమ్మిది నవగ్రహాల్లో వరుస క్రమంలో సూర్యునికి రామాయణము, భవిష్య కల్కి పురాణము, సూర్యపురాణం.

చంద్రునికి శ్రీమద్భాగవతము, భవిష్య కల్కి పురాణము, వాయుపురాణము

కుజునికి- అగ్నిపురాణము, స్కాంధపురాణము, బ్రహ్మవైవర్తన పురాణాల్లో కుమారస్వామి చరిత్ర

బుధునికి- లింగపురాణంలో నరసింహావతారము, విష్ణుపురాణము, నారదపురాణము

గురునికి- బ్రహ్మణపురాణము, వామనపురాణం, లింగపురాణం

శుక్రునికి- బ్రహ్మండపురాణం, భవిష్యపురాణమునందు శ్రీమద్భాగవతంలోని పరశురామావతారం

శనీశ్వరునికి-మార్కండేయపురాణం, కూర్మపురాణం, భవిష్యపురాణం,

రాహువు-దేవీభాగవతం, వరాహపురాణం, గరుడపురాణం,

కేతువుకు- బ్రహ్మవైవర్తన పురాణం, మత్స్యపురాణం వంటివి పఠించాలి.

పుణ్యతిథుల విషయానికొస్తే..?

సూర్యునికి- కార్తిక శుద్ద పూర్ణిమ-కార్తిక మాసంలో రవిజపము ఆరువేల సార్లు చేసి గోధుమలు దానం చేయాలి.

చంద్రునికి- శ్రావణ పూర్ణిమ - శ్రావణ మాసంలో చంద్రజపమును పదివేలసార్లు చేసి తెల్లని వస్తాలతో బియ్యాన్ని దానం చేయాలి.

కుజునికి- చైత్రశుద్ద పూర్ణిమ చైత్రమాసంలో అంగారక జపము ఏడువేల సార్లు చేసి కందులు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి.

మార్గశిర శుద్ద షష్టి- మార్గశిర మాసంలో అంగారక జపమును ఏడువేల సార్లు చేసి కందులు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి.

బుధునికి-జ్యేష్ఠ పూర్ణిమ-జ్యేష్ఠ మాసంలో బుధజపాన్ని 17 వేల సార్లు చేసి పెసలు ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయాలి.

గురువు-వైశాఖ తదియ- భాద్రపదమాసంలో బృహస్పతి జపాన్ని 16 వేలసార్లు చేసి శెనగలు దానం చేయాలి.

శుక్రునికి- ఆషాఢశుద్దదశమి- ఆషాఢమాసంలో శుక్రజపమును 20వేల సార్లు చేసి అలచందలు, తెల్లని వస్త్రాలు దానం చేయాలి.

ఫాల్గుణ శుద్ద పూర్ణిమ - ఫాల్గుణమాసంలో శుక్రజపమును 20వేల సార్లు చేసి తెల్లని వస్త్రాలు దానం చేయాలి. 

శని భగవానునికి - శ్రావణ బహుళ అష్టమి- శ్రావణ మాసంలో శనిజపము చేసి నల్లనువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయాలి. రాహువుకు - ఆశ్వీజ బహుళ చతుర్దశి - ఆశ్వీజమాసంలో రాహుజపం 18 వేలసార్లు చేసి మినుములు కాఫీపొడి రంగుకు చెందిన వస్త్రాలను దానం చేయాలి. కేతువుకు- ఆశ్వీజశుద్ద పాడ్యమి- ఆశ్వీజమాసంలో కేతుజపాన్ని ఏడువేల సార్లు చేసి ఉలవలు నలుపు వస్త్రాలను దానం చేయాలి.

మాఘశుద్ద అష్టమి - మాఘమాసంలో ఏడువేల సార్లు కేతుజపాన్ని చేసి ఉలవలు నలుపు వస్త్రాలను దానం చేయడం ద్వారా నవగ్రహాల ప్రభావంచే కలిగే అశుభ ఫలితాలు దరిచేరవని పురోహితులు సూచిస్తున్నారు.

పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను పెడుతున్నారా… వెంటనే తీసేయండి!

 పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను పెడుతున్నారా… వెంటనే తీసేయండి!




💠 సాధారణంగా మనలో చాలామంది మరణించిన వారిని దేవుళ్లతో సమానంగా భావిస్తుంటారు.
ఆ విధంగానే వారికి ప్రతి రోజు పువ్వులు పెట్టడం, దీపం వెలిగించడం పూజ చేయడం వంటివి చేస్తుంటారు.

💠 మరికొందరు చనిపోయిన మన పూర్వీకులకు గౌరవం ఇస్తూ, అలాగే వారి పై ఉన్న ప్రేమతో వారి ఫోటోలను దేవుడి గదిలో ఉంచుకొని దేవుడితో పాటు సమానంగా పూజలు చేస్తుంటారు.
అయితే ఈ విధంగా పూజలు చేయడం సరికాదని, వెంటనే దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉంటే తీసేయమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


💠 మన పూర్వీకుల పై లేదా మన కుటుంబ సభ్యుల పై ఎంతో ప్రేమగా మనం వారి ఫోటోలను దేవుడి గదిలో ఉంచి పూజించడం వల్ల అవి మన దృష్టిని, ఆలోచనలను పక్కకు మరల్చడమే కాకుండా, వారితో మనకున్న జ్ఞాపకాలను గుర్తు చేస్తూ బాధ పెడతాయనీ వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అందుకోసమే చనిపోయిన వారి ఫోటోలను దేవుడి గదిలో ఉంచకూడదు.

💠 ఈ విధంగా చనిపోయిన వారి ఫోటోలను హాల్లో ఎత్తయిన ప్రదేశంలో ఉంచుకోవాలని చెబుతున్నారు.


💠 అదే విధంగా పూజ గదిలో గంటను ఏర్పాటు చేయడం సరికాదు.
పూజ గది అనేది మన వ్యక్తిగత ధ్యానం కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్నది, కాబట్టి పూజ గదిలో గంటను ఏర్పాటు చేయకూడదు.
అదే విధంగా పూజ గదిలో డబ్బులు, విలువైన వస్తువులను దాచి ఉంచడం సరికాదు.

💠 పూజగదికి ఎల్లప్పుడు రెండు తలుపులు, గడప తప్పనిసరిగా ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

💠 అదే విధంగా పూజ గదికి లేత రంగులే వేయాలి.అదేవిధంగా పూజ గది పైకప్పు ఎల్లప్పుడూ చాలా తక్కువ ఎత్తులో ఉండే విధంగా చూసుకోవాలి.

శుభం భూయాత్..

నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ క్షేత్రాలు

నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ క్షేత్రాలు

=================
హిరణ్యకశిపుడిని సంవరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి.

జ్వాల నరసింహ స్వామి
అహోబిల నరసింహ స్వామి
మాలోల నరసింహ స్వామి
వరాహ నరసింహస్వామి (క్రోడా)
కారంజ నరసింహస్వామి
భార్గవ నరసింహస్వామి
యోగానంద నరసింహస్వామి
చత్రవట నారసింహస్వామి
పావన నరసింహ స్వామి

జ్వాలా నరసింహ క్షేత్రము

నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉంది . పూర్వం యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు నరసిమ్హమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట. స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.

వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు, కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే కుజగ్రహ దోషాలు తొలుగుతాయి.

అహోబిల నరసింహ స్వామి
నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని స్థల పురాణం చెబుతుంది. హిరణ్యకశపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడరటా అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల నరసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు.

ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. ఈ అహోబిలానికి దేవతలు స్తుచించినందున అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు. ఈ నరసింహా స్వామిని పూజించిన వారికి గురుగ్రహా దోషాలు నివారణ అవుతాయి.

మాలోల నరసింహ స్వామి
వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా "మా" అనగ లక్ష్మిలోల యనగ "ప్రియుడు" అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఈ ఆలయం కలదు. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా యున్నది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక. ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది.

వరాహ నరసింహస్వామి (క్రోడా)
వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి.

కారంజ నరసింహస్వామి
కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.
గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.

భార్గవ నరసింహస్వామి
పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవువులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును.

యోగానంద నరసింహస్వామి
యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. యోగపట్టంతో, విలసిల్లినాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును.

చత్రవట నారసింహస్వామి
పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును.

పావన నరసింహ స్వామి
పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధమగుచున్నది. మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును.

దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతో పూజించండి.. అద్భుత ఫలితాలు పొందండి. అర్ధంతో దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి.

దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతో పూజించండి.. అద్భుత ఫలితాలు పొందండి.


అర్ధంతో దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి.

దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ
దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ
దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా
దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ
దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత
దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని
దుర్గమోహ & దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ
దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ
దుర్గమాంగీ, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరీ
దుర్గభీమా, దుర్గభామా, దుర్లభా, దుర్గధారిణీ.. 
ఇవి దుర్గాదేవి 32 నామాలు.

🌼🌿32 నామాలకు అర్ధం:🌼🌿

1.దుర్గా: భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం.
2.దుర్గార్తిశమణీ: కష్టాలను శమింపచేసేతల్లి నీకు వందనం.
3.దుర్గాపద్వినివారిణీ: ఆపదలను నివారించే తల్లీ నీకు వందనం.
4.దుర్గమచ్ఛేదినీ: కష్టాలను ఛేదించే తల్లీ నీకు వందనం.
5.దుర్గసాధినీ: దుర్గమమైనది సాధించే తల్లీ నీకు వందనం.
6.దుర్గనాశినీ: కష్టాలను నాశనం చేసే తల్లీ నీకు వందనం.
7.దుర్గతోద్దారిణీ: దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లీ నీకు వందనం.
8.దుర్గనిహంత్రీ: మనదెగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లీ నీకు వందనం.
9.దుర్గమాపహ: కష్టాలను వినాశనం చేసే తల్లీ నీకు వందనం.
10.దుర్గమదేజ్ఞానదా: రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లీ నీకు వందనం.
11.దుర్గదైత్యలోకదవానలా: కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లీ నీకు వందనం.
12.దుర్గమ: అమ్మను సాధించడానికి ఆశక్యమైన తల్లీ నీకు వందనం(తేలికగా దర్శనం ఇవ్వని తల్లి).
13.దుర్గమాలోక: చర్మచక్షువులు,పంచేంద్రియాలతో చూడలేని తల్లీ నీకు వందనం.
14.దుర్గమాత్మస్వరూపిణీ: మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన తల్లీ నీకు వందనం. అంటే మనలోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని, కళ్ళతో చూడలేని, తెలుసుకోలేని తల్లి స్వరూపంమని అర్ధం
15.దుర్గమార్గాప్రదా: రహస్య మార్గానికి త్రోవచూపేతల్లీ నీకు వందనం.
16.దుర్గమవిద్యా: రహస్యమైన విద్యాస్వరూపమైన తల్లీ నీకు వందనం(శ్రీవిధ్యా స్వరూపం).
17.దుర్గమాశ్రిత: దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లీ నాకు వందనం (శ్రీచక్రం).
18.దుర్గమజ్ఞానసంస్థాన: అలవికాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యంకాని జ్ఞానానికి తల్లీ నీకు వందనం.
19.దుర్గమధ్యానభాసిని: ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాసించే తల్లీ నీకు వందనం.
20.దుర్గమోహ: ఆపదలను లాగేసే తల్లీ నీకు వందనం.
21.దుర్గమగ: కష్టాలను పరిష్కరించే తల్లీ నీకు వందనం.
22.దుర్గమార్థస్వరూపిణీ: ఈ పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని.. రెండోది దుర్గమమైన అర్ధాలుగల తల్లీ నీకు వందనం.
23.దుర్గమాసురసంహంత్రీ: దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లీ నీకు వందనం.
24.దుర్గమాయుధదారిణీ: దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లీ నీకు వందనం.
25.దుర్గమాంగీ: ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లీ నీకు వందనం.
26.దుర్గమత: కల్మషాలను దూరం చేసే తల్లీ నీకు వందనం.
27.దుర్గమ్య: సాధించడానికి శక్యం కానీ తల్లీ నీకు వందనం.
28.దుర్గమేశ్వరి: విఘ్నాలకు అధినాయకురాలైన తల్లీ నీకు వందనం.
29.దుర్గభీమా: భీషణమైన పరాక్రమం కల తల్లీ నీకు వందనం.
30.దుర్గభామా: దుర్గ అనే స్త్రీ రూపం లోని తల్లీ నీకు వందనం.
31.దుర్గభా: ప్రకాశం గల తల్లీ నీకు వందనం.
32.దుర్గదారిణీ: రహస్యాన్ని ఛేదించే తల్లీ నీకు వందనం.

ఓం నమో దుర్గాయ నమః  అంటూ ఈ 32నామాల దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలగుతాయి అనేది  పురాణాల కథనం.. భక్తుల నమ్మకం..

🌼🌿శ్రీ మాత్రే నమః....🙏🌼🌿

బృహత్సంహిత ' లో ఏ నక్షత్రం వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు...........!!

బృహత్సంహిత ' లో ఏ నక్షత్రం వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు...........!!


1.అశ్విని : చక్కని రూపం, దక్షత కలిగిన వారు, నీతివంతులు, ప్రియభాషనులు.   
2.భరణి : దృడ నిశ్చయులు , సుఖవంతులు, సత్యవ్రతులు, ఆరోగ్యవంతులు.
౩. కృత్తిక : ప్రక్యతులు, తేజస్సులు.  
4. రోహిణి : సత్యవంతులు, శుభ్రత, ప్రియంవద, స్దిరమతి , సురూప.
5. మృగశిర : చపలులు, ఉత్సాహవంతులు, చతురులు, భోగులు, భీకరులు.   
6.ఆరుద్ర : గర్వితులు, కృతఘ్నులు, అయిన వారిని ప్రేమించే వారు. 
7. పునర్వసు : మంచి స్వభావం కలవారు, అల్ప సంతుష్టులు , రోగులు.
8.పుష్యమి : శాంతస్వభావం కలవారు. పండితులు, ధర్మ పరాయణులు.  
9. ఆశ్లేష : సర్వ భక్షకులు, కృతఘ్నులు,  అమాయకులు , సున్నితత్వం కలవారు. 
10. మాఘ : భోగులు, ధనవంతులు, పిత్రు భక్తులు, మహొద్యమ కారులు.   
11. పూర్వఫల్గుణి :  ఎప్పుడు ప్రియ వచనములు పలుకు వారు. దాతలు, ద్యుతిమానులు, రాజసేవకులు.  
12. ఉత్తరఫల్గుణి : భోగులు, సుఖములు కలవారు, విద్య ప్రాప్తి కలవారు.
1౩. హస్త :  ఉత్సాహవంతులు , చోర స్వభావం కలిగి ఉంటారు. 
14.చిత్త :  మీననేత్రులు. గడసరులు.
15.స్వాతి : కృపాళులు , ప్రియ వాక్కు కలవారు, ధర్మశ్రితులు . 
16. విశాఖ   :  ఈర్ష బుద్ధి కలవారు. ద్యుతులు, మాన్యవచనులు.
17. అనురాధ : విదేశీ యానం కలవారు, ధర్మాత్ములు. 
18. జ్యేష్ఠ : పలువురు మిత్రులు కలవారు, సంతృప్తి కలవారు, కోప స్వభావం కలవారు.   
19. మూల : లక్ష్మి పుత్రులు , సుఖపడువారు,  స్ధిర మనసు కలవారు. 
20. పూర్వషాడ : సౌహర్ర్ధ  హృదయం కలవారు, ఇష్ట పూర్వకంగా పని చేయువారు, కళలను ఇష్టపడు వారు.   
21. ఉత్తరాషాడ : ధార్మికులు, బహు మిత్రులు కలవారు,  కృతజ్ఞత కలిగిన వారు .   
22. శ్రవణం : ఉదార స్వభావం కలవారు, ఖ్యాతి   పొందేడివారు , ధనవంతులు.
2౩. ధనిష్ట : దాతలు, ధన లబ్దము కలిగిన వారు, సంగిత ప్రియులు.
24. శతభిషం : సాహసికులు, కోప స్వభావం కలవారు, వ్యసన పరులు.  
25. పూర్వాభాద్ర : సంతోషమును తృప్తిగా అనుభవించలేని వారు,  ధనవంతులు, దాతలు.
26. ఉత్తరాభాద్ర : ఎక్కువ సంతానం కలవారు, ధార్మికులు, జితశత్రులు , వక్తలు.
27.రేవతి : శూరులు, శుచివంతులు, సుభగులు,  సంపూర్ణంగులు
*👆 ఫార్వర్డ్ మెసేజ్👆*

#అరుణాచలం_కొత్తగా_వెళ్లేవారికి_కొన్ని_వివరాలు

#అరుణాచలం_కొత్తగా_వెళ్లేవారికి_కొన్ని_వివరాలు :

 
1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారు అక్కడికి చేరుకోవడంతో నే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది ' 
రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తి అవుతుంది అని భావించకండి .
మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన కచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి అయినా ఉంటుంది .
అక్కడ స్వామికి నమస్కరించి మొదలుపెట్టవచ్చు '

2. గిరిప్రదక్షిణ అనేది కచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి " కుడివైపున కరుణగిరి కి దగ్గరలో ఉండే కుడి మార్గం లో  సూక్ష్మరూపంలో యోగులు ' సిద్ధులు ' దేవతలు ప్రదక్షిణలు చేస్తారట . అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు .

3. ఆరుణాచలం వెళ్లే ప్రతి వారు కచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి .
ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు ఖచ్చితంగా ఇస్తారు .

4 . దర్శనానికి గిరిప్రదక్షిణ కి వెళ్లేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి . ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు .

5. ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతారు .

6. నైఋతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు కచ్చితంగా  అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది '
ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు .

7. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని ' మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు " భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు . ఖాళీ కడుపుతో చేసే గిరిప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది .

8. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరిప్రదక్షణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది .
నా స్వానుభవం .

9. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది '
మాక్సిమం కూర్చోకుండా నిలబడి గానీ ' తప్పనిసరి పరిస్థితుల్లో  బెంచీపై పడుకోండి " కూర్చోవడం అన్న చాలా ఇబ్బందులు ఉంటాయి .

10 . కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని  దర్శనానికి వెళ్లే వారు ' అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి . అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు .
లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు.

11. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత 
ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది .
కచ్చితంగా దర్శనం చేసుకోండి .

12. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దపెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది '
ఆ మండపంపై కి వెళ్లి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది .
రమణ మహర్షి వారు  అక్కడే తపస్సు చేసారు .

13.రాజ గోపురానికి కుడివైపున అనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది . అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం .

14 ' ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం ' అది ఇది మహా భక్తురాలైన అమ్మాణి అమ్మన్‌ అని ఆవిడ కట్టించిన గోపురం .

15. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది .తప్పకుండా దర్శనం చేసుకోండి .

16 ' అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది దాని క్రింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది .
అద్భుతః

17. అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు .

18 ' అగ్ని లింగానికి ' రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది . చాలా పెద్ద విగ్రహం ' అత్యంత శక్తివంతమైన విగ్రహం '
అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు .
ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి . రూపాయలకు శెనగల దండ అమ్ముతారు . మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శెనగల దండలను స్వామివారికి సమర్పించండి . అది స్వామి వారి మీద వేస్తారు .

19. శివసన్నిధి రోడ్ లో కొంచెం ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది ' 
చాలా చాలా బాగుంటుంది . ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది .
రమణ మహర్షి వారి ఆశ్రమంలో కి వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి .
ఇక్కడ
ఉదయం టిఫిన్ ' మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు .
విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్ లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు .
ఒకసారి అక్కడి ప్రసాదం స్వీకరించండి 

20 . ఈ రామ్ సూరత్ బాబా ఆశ్రమం లోనే అవధూత శ్రీ తోప్పి అమ్మాల్ వారు వుంటారు.
దర్శనం చేసుకొని తరించండి 🙏

🙏#ఓంఅరుణాచలేశ్వరాయనమః 🚩.

సాధకుడు ఏఏ చక్రాల్లో ఉన్నాడో... ఆయా చక్రాలు కొన్ని సూచనలు ఇస్తాయి. తద్వారా ఆ చక్రాలు జాగృతి అయినట్లు భావించుకోవాలి. అవేమిటంటే

సాధకుడు ఏఏ చక్రాల్లో ఉన్నాడో... ఆయా చక్రాలు కొన్ని సూచనలు ఇస్తాయి. తద్వారా ఆ చక్రాలు జాగృతి అయినట్లు భావించుకోవాలి.

 


*మూలం :- కపాల మోక్షము అనే మోక్ష సాధనా గ్రంథం*

1. మూలాధార చక్రము - మన దగ్గర లేని పదార్థాల వాసనలు రావడం, రతిక్రీడ దృశ్యాలు.

2.స్వాధిష్ఠాన చక్రము – ఇష్టపదార్ధాల రుచులు గుర్తుకి రావడం, గుప్తనిధుల దృశ్యాలు.

3.మణిపూరక చక్రము - అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం.

4.అనాహత చక్రం -   ప్రమాదాలు జరిగే ప్రాంతాలు తరచుగా కనిపించడం.

5.విశుద్ధి చక్రము -  వివిధ రకాల శబ్దాలు వినబడటం.

6.ఆజ్ఞా చక్రము -  ఓంకార నాదం వినబడటం.

7. గుణ చక్రం -  త్రిగుణాలు హెచ్చుతగ్గులు రావడం.

8. కర్మచక్రం -  వివిధ రకాల ఆయుధాలు కనబడటం  త్రిశూలం, ఖడ్గం ,రామ బాణం, చక్రం ,బ్రహ్మదండం సందర్శనం.

9.కాలచక్రం-  ప్రేత ఆత్మ దర్శనాలు, త్రికాల జ్ఞానం.

10. బ్రహ్మ చక్రం-దశ మహా విద్య దేవతల దర్శనం.

11.సహస్రార చక్రం -  కర్పూరం సుగంధ పరిమళాలు వాసనలు రావటం.

12.హృదయ చక్రం-  హనుమాన్/అనంత పద్మనాభుని దర్శనాలు
 ఇష్టలింగం రావటం.

13.బ్రహ్మరంధ్రము - కపాలం దర్శనాలు 
త్రి గ్రంధులు -త్రిమూర్తులు దర్శనాలు.

అలాగే మనము ఏఏ చక్రాల శుద్ధిలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన అనుభవాలు కలుగుతాయి.          

1. మూలాధార చక్రము -  మనకు సంబంధం లేకుండా కామ విషయాలలో ఇరుక్కోవటం, శరీరం తేలికగా  గాలిలో ఎగరడం.

2.స్వాధిష్ఠాన చక్రము -వాంతులవడం, ధన సంబంధ విషయాల్లో ఇరుక్కోవటం, నీళ్ల విరోచనాలు అవ్వడం.

3.మణిపూరక చక్రము -  విపరీతమైన వేడి బొడ్డు ప్రాంతంలో నొప్పి, అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం.

4.అనాహత చక్రం - విపరీతమైన ధ్యానం చేయడం, జపాలు పూజలు చేయాలని అనిపించటం.

5.విశుద్ధి చక్రము -  చెవిలో సముద్ర హోరు,గాలి హోరు, నీటి సవ్వడి, నీటి అలల శబ్దాలు వినిపించడం, ఏదో చేయాలని తీవ్రమైన జ్ఞాన సంబంధ వాంఛలు కలగడం.
 

6.ఆజ్ఞా చక్రము - కనుబొమ్మల మధ్య కోడిగుడ్డు ఆకారంలో శ్వేత జ్యోతి దర్శనం.

7. గుణ చక్రం -   పరోపకారార్ధం ఇదంశరీరం -  ఇతరుల కోసం దీనుల కోసం ఏదైనా చేయాలని బలంగా అనిపించడం.

8. కర్మచక్రం -  ధర్మం పాటించాలి అని అనిపించటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం.

9.కాలచక్రం-   చావు మరణ, మృత్యు భయాలు భయపడటం, ప్రేతఆత్మ దర్శనాలు పొందుట.

10. బ్రహ్మ చక్రం- వివిధ రకాల తత్వం, ఆత్మ, బ్రహ్మ జ్ఞానం కోసం పరితపించడం భూమండలం వివిధ లోకాల దర్శనం.
 

11.సహస్రార చక్రం - మలము నుండి కర్పూర వాసన, శరీరం నుండి సుగంధ పరిమళం వాసన.

12.హృదయ చక్రం-   ఏకైక ఇష్ట కోరిక ఏమిటో తెలియటం, ఏకైక కోరిక జిజ్ఞాస.

13.బ్రహ్మరంధ్రము - మహా మృత్యు దర్శన జిజ్ఞాసలు కలగడం
త్రి గ్రంధులు - ఆయా లోకాలు దర్శనం అనగా శివ విష్ణు బ్రహ్మ లోకాల దర్శనం....

🕉️🌞🌏🌙🌟🚩

దత్త క్షేత్రాలు


          దత్త క్షేత్రాలు


01. Pithapuram - పిఠాపురం (పీఠికాపురం)

02. Kuruvapuram & Panchadevapahad (కురువపురం మరియు పంచదేవపహాడ్)

03. Ainavilli Maha Ganapathi (అయినవిల్లి - మహా గణపతి)

04. Ettipothala (Yati – Tapaha-Sthala) - ఎత్తిపోతల (యతి తపః తలం)

05. Navanatha Siddula Gutta – Armoor (నవనాథ సిద్ధులగుట్ట – ఆర్మూర్)

06. Penugonda (Bruhatsilaa Nagaram) - పెనుగొండ (బృహత్శిలానగరం)

07. Ganagapur - గంధర్వపురము (గాణుగాపురము/ దేవల్ గాణ్గాపూర్)

08. Prajnapuram (Akkalkot) – Chanchala Bharathi (ప్రజ్ఞాపురం (అక్కల్ కోట) – చంచలభారతి)

09. శ్రీపాద సాధనా క్షేత్రం – విశ్వయోని ‘గోకర్ణ’ (Gokarna)

10. మాణిక మణిహారం ‘మొమిన్ పేట్’ – Manika Maniharam ‘Mominpet’

11. శ్రీ దేవదేశ్వర మందిరం – మాహుర్ ఘడ్ (Sri DevaDeveshwara Mandiram – Mahur Ghad)

12. ఘనస్వరూప నృసింహసరస్వతి క్షేత్రం – కొడువటూర్ (Ghanaswarupa Nrusimha Saraswathi Kshetram – Koduvatoor)

13. ‘గులాబీ గూట్లో కాషాయాంబరుడు’ – ‘Gulaabi Gutlo Kashaayaambarudu’

14. ప్రవర దత్తక్షేత్రం - శ్రీక్షేత్ర దేవ్గడ్ : Pravara Dattakshetram – Srikshetra Devgad

15. కలలను సాకారం చేసే ‘సాకురి’ ఏకముఖ దత్తాత్రేయుడు – Sakuri Ekamukha Dattatreya

16. GirRaj Girnar (గిరిరాజ్ గిర్నార్)

17. Saraswathi Dwaya Kshetram – Basar (‘సరస్వతి ద్వయ’ క్షేత్రం – బాసర్)

18. Paschim Pir Jackal Datta Kshetram – Kaladungar (పశ్చిమ పీర్ నక్కల దత్త క్షేత్రం – కాలాడూంగర్)

19. Coffee Drinking Dattatreya–Baba Budangiri Datta Pitham ( కాఫీ తాగే దత్తాత్రేయుడు – బాబా బుడంగిరి దత్తాత్రేయ పీఠం)

20. Shirdi Sai Nija Paduka Mandir – Korhale Village (షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ – కొర్హలె)

21. Manika Man’Jhari’- Jharasangam (మాణిక్య మం’ఝరి’-ఝరాసంగం ‘)

22. Dattatreya Devotees & Krishna River Pushkaraalu – 2016 (కృష్ణానది పుష్కరాలు- 2016 మరియు దత్తభక్తులు)

23. Navanaatha Pratistitha Naarasimha Kshetram – Nacharam Gutta (నవనాథ ప్రతిష్ఠిత నారసింహ క్షేత్రం – నాచారం గుట్ట)

24. Narasimha Dwaya Kshetram – Vaidhurya Nagaram (Bidar) (నరసింహ ద్వయ క్షేత్రం – వైఢూర్య నగరం [బీదర్])

25. Dattodghama Dharma Tirtham – Chotrakoot (దత్తోద్ఘమ ధర్మ తీర్థం – చిత్రకూటము)

26. DattaTatwaRaasi ‘Varanasi’ (దత్తతత్వరాశి – ‘వారణాశి’)

27. Dattatreya KshetraPalaka Kshetram & Andhra Kaamakhya – Devipuram (దత్తాత్రేయుడు క్షేత్రపాలకుడుగా ఉన్న క్షేత్రం & ఆంధ్రా కామాఖ్యా – దేవీపురం)

28. Bhakthavatsala Dattatreyudu – Rajamahendravaram (Rajahmundry) - భక్తవత్సల దత్తాత్రేయుడు – రాజమహేంద్రవరం (రాజమండ్రి)

29. Vanne Chinnela ‘Vannepudi’ (వన్నెచిన్నెల ‘వన్నెపూడి’)

30. Shiva Datteshwarudu – Uddamarri (శివ దత్తేశ్వరుడు – ఉద్దమర్రి)

31. Navatha Siddha Caves of TrethaYuga At Pitlam (Chinna Kodapgal Village) - త్రేతాయుగం నాటి నవనాథ సిద్ధుల గుహలు – పిట్లం (చిన్నకోడప్‌గల్‌ గ్రామం)

32. Samskarahina ShivaSwarupa Dattatreya (13th Shodasa Dattavataaram) – Palamakula Village - ’హీన’స్థితి లో ఉన్న ‘సంస్కారహీన శివస్వరూప దత్తాత్రేయ (ఏకాదశ [13వ] షోడశ దత్తావతారం) – పాలమాకుల గ్రామం

33. World’s Rare Sleeping Posture Rahu Rupa (Sarpa Rupa) Dattatreyudu – Varadaelli - అత్యంత అరుదైన రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు – వరదవెల్లి దత్తాత్రేయుడు

34. Viswa Rahasya Viswarupa Datta Kshetram – Trivikrama Bharathi Tapovanam : Kumasi Village - విశ్వ రహస్య ‘దత్త విశ్వరూప’ క్షేత్రం – త్రివిక్రమభారతి తపోవనం : కుమసి గ్రామం

35. Karuna Paaduka DattaKshetram ‘Kadaganchi’ - కడగండ్లు తీర్చే కరుణపాదుకా దత్తక్షేత్రం ‘కడగంచి’

36. Women Special Datta Kshetram – Dattachala Kshetram (Dattalaya Gutta) - మహిళా దత్తక్షేత్రం – దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట)

37. The Confluence of River Krishna & River Bhima – Tangidigi Village - కృష్ణానదీ – భీమానదీ సంగమ స్థానం – తంగిడిగి గ్రామం

38. Vallabhesa Vruttantha Divya Sthali “Sri Kshetra Vallabhapuram (Manthangod Village)” - వల్లభేశ వృతాంతం జరిగిన దివ్యస్థలం “శ్రీక్షేత్ర వల్లభాపురం (మంథన్‌గోడ్ గ్రామం)”

🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS