నారాయణ భట్టాతిరి తనకొచ్చిన రోగాన్ని తగ్గించమని గురువాయూర్ అధిపతి శ్రీ కృష్ణుని వేడుకుని 100 దశకాలలో భాగవతాన్ని ప్రకటించి తన రోగాన్ని తగ్గించుకుని, మన అందరికీ ఒక అమృతాన్ని పంచి ఇచ్చారు.
ఎవరికైనా తగ్గని రోగం నుండి విముక్తి కోసం శ్రీమన్నారాయణీయం చదవమని పెద్దలు చెబుతారు. అందులో మనం అందరం చదువుకోతగ్గ ఒక అద్భుతమైన శ్లోకం
మరుద్గేహాధీశ త్వయి పరాంచొ2పి సుఖినో
భావత్స్నేహీ సోహం సుబహు పరితప్యేచ కిమిదం |
అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్
భవద్భక్తోత్తంసంఝటితి కురుమాం కంసదమన !!
ఓ కంసదమన, కంసుని చంపి లోకాలను శాంతిమయం చేసిన ఓ కన్నయ్యా, మరుద్గేహాధీశ, గురువాయూర్ అధీశా, నువ్వు పరతత్వం అని ఒప్పుకొని వారు కూడా సుఖంగా ఉన్నారు. కానీ నీవే సర్వస్వం అని నమ్ముకున్న నాకు ఈ బాధలేమిటి స్వామీ. ఈ పరిస్థితి నీకు అపకీర్తి స్వామీ. నీ అపకీర్తిని నువ్వే బాపుకోవయ్యా. ఈ దేహానికి సంబంధించిన భారం నుండి ఉపశమనం కలిగించు స్వామీ.. నా రోగాన్ని తగ్గించి నన్ను ఆరోగ్యవంతుడిని చేసి నీవాడగా చేసుకోవయ్యా ఓ నారాయణా !!
ఓ వేంకటేశా నన్ను రక్షించు స్వామీ నీ ప్రభావం లోకానికి తెలుపుకో స్వామీ....
ఆర్తి తో పిలిస్తే తప్పక పలుకుతాడు మన స్వామి. ఈ కలికాలంలో మనం అందరం ఏదో ఒక అనారోగ్యానికి లోనవుతూనే ఉంటాము. మానవ ప్రయత్నానికి మనకు దైవానుగ్రహం కూడా తప్పని సరి. ఎలా వినతి చెయ్యాలో మనకోసం మన పూర్వం ఋషులు దారి చూపించి వున్నారు. అసలు మనబోటి వారికి సహాయం చెయ్యడం కోసమే బంగారాన్ని వేడి చేసినట్టు అటువంటి మహానుభావులకు కొంత క్లేశం కలుగచేసి వారిచేత ఆర్తితో శ్లోకాలు రచించేలా చేసి మనకు స్తోత్రాలను అందించేలా నాటక చేస్తాడు ఆ జగన్నాటకసూత్రధారి మన వేంకటేశుడు.
అటువంటి దే ఈ "నారాయణీయం"
(సేకరణ)
No comments:
Post a Comment