Wednesday, August 26, 2020

శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్యుల వారి సమాధి మందిరము శ్రీ విద్యాశంకరమందిరము" ఇది హంపీ పట్టణానీకి దగ్గరలోనే వుంటుంది ! ఊరిపేరు విరూపాక్షం !

శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్యుల వారి సమాధి మందిరము 
 శ్రీ స్వామివారి అదేశానుసారముగా వారి సమాధిపైన ఒక ఆలయము నిర్మించినారు. 
దాని పేరు "శ్రీ విద్యాశంకరమందిరము"
ఇది హంపీ పట్టణానీకి దగ్గరలోనే వుంటుంది ! ఊరిపేరు విరూపాక్షం  !

వీరు సజీవ సమధి చెందిన మహానుభావుడు , వీరి యొక్క అదేశం 12 సం|| వరకూ దానిని తెరువవద్దు అని చెప్పగా 3 సం|| ల తరువాత తెరిచి చూడగా శరీరం శుష్కించిందే తప్ప శిధలంకాకాకపోవటంతో భయపడి దానిని మూసివేశారు , తరువాత స్వామి కలలో కనపడి వారిని క్షమించి ఆ నగరాన్నేలే రాజుగారి సహాయంతో దానిపైన ఒక మందిరము నిర్మించమని దానిపేరు 
"శ్రీ విద్యా శంకర మందిరం" గా నామకరణం చెయ్యమనీ అదేశించగా ..కాలాంతరంలో అలనే చేశారని చరిత్ర చెప్తున్నది 
ఇప్పటికీ ఈయన అక్కడ ఉన్నారనేది భక్తుల విశ్వాసం..!
చాలా మహిమగల ఆద్యాత్మిక సాధకుల దర్శన క్షేత్రం ఇది !
విజయనగరం కష్ట కాలంలో వున్నప్పుడు రాజుగారి అభ్యర్ధన తో ఈ మహానుభావుడు రాజుగారితో ఒక ఒడంబడిక చేసుకుని రాజ్యంలోని ఎవరి ఇళ్ళలో కురిసిన వర్షం వారిసొంతం పురవీధులలో రాజుగారి భూములలో కురిసినది రాజుసొంతం అనే ఒడంబడికతో రాజ్యం మొత్తం  ఒక ఘడియ పాటు (24 నిమిషములు )  "కనక వర్షం" కురిపించిన మహాను భావుడీయన..
గురుచరిత్రలో కనిపించే గురుపరంపరలోని విద్యారణ్యుడు ఈయనే ...
దక్షిణ భారతంలోని హిందూ సంస్కృతిని కూకటివేళ్ళతో పెకిలించి వేద్దాం అనుకున్న వాళ్ళను నిరోధించి హిందూ ధర్మాన్ని కాపాడిన ఒక గొప్ప మహనీయుడీయనే !!
13వ శతాబ్ధానికి చెందిన గొప్ప గురువు ఈయన !
వీరి రచనలలో "వేదాంత పంచదశి " విశేషమైన ఖ్యాతి పొందిన గ్రంధరాజం !
గమ్మత్తయిన విషయమేమంటే మొదటి పది అద్యాయాలూ వీరువ్రాస్తే మిగతావి వీరి గురువుగారు "విష్ణు" అనే ఆయన వ్రాశారని ప్రసిద్ది..
19వ శతాబ్ధానికి చెందిన సద్గురువైన షిరిడీ సాయిబాబా , ఆయన నోటినుండి చెప్పిన అతికొద్ది ఆద్యాత్మిక గ్రంధాలలో ఈ "పంచదశి" ఉండటం మరింత విశేషం ! ఇటువంటి మహనీయులు అందరూ ఆయనకు పూర్తిగా తెలుసని అర్ధంవుతున్నది !
రామకృష్ణ అనే ఆయన వీరి గ్రంధాలను సంస్కృతంలోనికి అనువదించినట్టు చెరిత్ర చెప్తున్నది !   
విశ్వవిఖ్యాతి గాంచిన విజయనగర వైభవానికి కారకుడు ఈయన మాత్రమే అని అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు ! 
తెలుగున అసంపూర్తిగానున్న వీరి చెరిత్ర కన్నడ భాషలో కొన్నిచోట్లమాత్రమే వివరాలు ఉన్నాయి !  
Hari Babu ఏలూరు వారి fb పోస్టింగ్స్ నుంచి

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS