Tuesday, August 25, 2020

రామతారక మంత్రం

రామతారక మంత్రం

మహావిష్ణువు దశావతారాలలో రామావతారం అత్యంత మహిమాన్వితమైనది.

 రాముడు అవతరించి రావణ సంహారం గావించిన విషయం పక్కన పెడితే మానవుడు ఎలా బతకాలో ప్రత్యక్షంగా ఆచరించి చూపిన మర్యాదాపురుషోత్తముడు శ్రీ రామచంద్రుడు. 

వాల్మీకి మహర్షి రామావతారానికి ముందే నారద మహర్షిని లోకంలో పదహారు సంపూర్ణ గుణాలు కలిగిన మానవుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించగా నారదుడు శ్రీ రాముని గురించి చెపుతాడు.

 శ్రీరాముడు ఆ పదహారు లక్షణాలు పుణికి పుచ్చుకున్న పదహారు అణాల పురుషనిదానము. 

ఆయన గుణాలలో మెచ్చదగినది పూర్వ స్మితభాషి.

 ఎవ్వరినైనా తనకుతానుగా నవ్వుతూ పలుకరించి మాట్లాడే స్వభావం కలవాడు. 

పురుషులను సైతం మోహింపచేయ గలిగే మోహన రూపము కలిగిన వాడు. 

పుణ్య శ్లోకుఁడు. 

రామ నామం భవ తారకమంత్రం.
 ర కార ఆ కార మకార ల మేలు కలయికే రామ నామం. 

ఈ నామ స్మరణ ధన్యత పొందడానికి మహోపాయం. 

అందుకే ఛత్రపతి శివాజీ గురువైన సమర్ధ రామదాసు సర్వులు భవ భయాలనుండి తరించడానికి ఉపదేశించిన త్రయోదశాక్షరి మంత్రం. 

 *శ్రీ రామ జయ రామ జయ జయ రామ* 

ఈ మంత్రం శ్రీరామ జయ మంత్రం. నిత్యం సర్వకాల సర్వావస్థలలో జపించ తగిన మంత్రం. 

అలాగే 
 *శ్రీ హనుమాన్ జయ* *హనుమాన్ జయ జయ* 
 *హనుమాన్* 

ఇది మహా మహిమాన్వితమైన హనుమాన్ మంత్రం. ఈ రెండు మంత్రాలలో విశేషం ఏమిటంటే జయ శబ్దం ముమ్మార్లు ప్రయోగించబడినది 

జాంబవత్ సుగ్రీవ లక్ష్మణ భారత శత్రుఘ్న హనుమత్ సీతా సమేత శ్రీ రామచంద్రుని ఎవరైతే నిత్యం స్మరించుకుంటారో వారికి శ్రీ రామచంద్రప్రభుని ఛత్రఛాయలో నిర్భయంగా బ్రతుకుతారు. 

ఎవరైతే శ్రీ రాముని వారలము మాకేమి విచారము అని రాముని త్రికరణ శుద్ధిగా నమ్ముతారో వారికి శ్రీరామ రక్ష సర్వవేళలా ఉంటుంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS