Monday, August 10, 2020

ఉడిపి శ్రీ కృష్ణ

*ఉడిపి* 

కర్ణాటక రాష్ట్రము దక్షిణ కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఉడిపి అనే పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది. 

ఉడుప అనే మాట నుంచి ఈ ఉరికి ఉడిపి అనే పేరు వచ్చింది.

 ఈ ఆలయం 13 వ శతాబ్దం నాటిది అని తెలుస్తుంది. ఈ ఆలయంలోని చిన్ని కృష్ణుడి విగ్రహం ద్వాపరయుగం నాటిదిగా ప్రతీతి.

 ఈయన ఒక చేతిలో త్రాడు, మరొక చేతిలో కవ్వముతో వివిధ ఆభరణములు ధరించి దివ్య మంగళ రూపంతో భక్తులకి దర్శనమిస్తున్నాడు.

 దేశంలో ఎక్కడా లేని విధంగా ఉడిపిలో భక్తులకు గర్భాలయ దర్శనం లేదు. 

తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీద్వారా స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. 

 తన భక్తుడైన కనకదాసుడికి స్వామి ఈ కిటికీ నుంచే దర్శనం ప్రసాదించారని ప్రతీతి. అందుకే దీన్ని ఆయన పేరు మీదుగా ‘కనకన కిండి’ అని పిలుస్తారు.

శ్రీమధ్వాచార్యులు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటు చేశారు
వాటిలో శ్రీకృష్ణమఠం ఒకటి.

 ఈ మఠాధిపతులే నేటికీ గర్భాలయంలో కృష్ణ పూజలు నిర్వహిస్తున్నారు. వీరికితప్ప ఇతరులెవరికీ మూలమూర్తిని తాకే అవకాశం లేదు.

 ఇక్కడి కృష్ణ విగ్రహాన్ని మధ్వాచార్యులు ప్రతిష్ఠించారు.

 ప్రతి రెండేళ్ళకు ఒకసారి నిర్వహించే ‘పర్యాయ’ పండుగ సందర్భంగా ఒక్కో మఠాధిపతికి దేవాలయం బాధ్యతలు అప్పగిస్తారు.

 ఇక్కడి స్వామికి ప్రతిరోజూ 14 రకాలైన పూజలను నిర్వహిస్తారు.    ఉడిపి శ్రీ కృష్ణుడి 24 అద్భుతమైన అలంకారాలు
ప్రతి ఒక్కటి శాస్త్రాలలో చెప్పినట్లు ఒక్కో పేరుకు అనుగుణంగా ఉంటుంది.
1 కేశవ
2 నారాయణ
3 మాధవ
4 గోవింద
5 విష్ణు
6 మధుసూదన
7 త్రివిక్రమ
8 వామన
9 శ్రీధర
10 హృషికేశ
11 పద్మనాభ
12 దామోదర
13 సంకర్ష్ణ
14 వాసుదేవ
15 ప్రద్యుమ్న
16 అనిరుద్ధ
17 పురుషోత్తమ
18 అదోక్షజా
19 నారసింహ
20 అచ్యుత
21 జనార్ధన
22 ఉపేంద్ర
23 హరి
24 కృష్ణ

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS