Tuesday, August 25, 2020

ఏ కళ్యాణం లో అయినా వధూవరులను ఆశీర్వదించేటప్పుడు.... ఈ క్రింది శ్లోకం చదువుతూ, అక్షతలు శిరస్సులపై వేస్తాము

ఏ కళ్యాణం లో అయినా  వధూవరులను ఆశీర్వదించేటప్పుడు....

ఈ క్రింది శ్లోకం చదువుతూ, అక్షతలు శిరస్సులపై వేస్తాము.

లక్ష్మీనారాయణా గౌరీశంకరౌ భారతీవిధీ |
   ఛాయాసూర్యౌ రోహిణీందూ రక్షేతాం చ వధూవరౌ ||                                                   

🏵లక్ష్మీనారాయణులు,
🏵గౌరీశంకరులు,
🏵భారతీబ్రహ్మలు,
🏵ఛాయాసూర్యులు,
🏵రోహిణీచంద్రులు     

 🌹అనే ఐదు దేవ దంపతులూ...ఈ వధూవరులను రక్షించుగాక!  అని సందేశం🌹.

🌹1. లక్ష్మీదేవి నారాయణుని వక్షస్థలమందు       (హృదయమందు) ఉంటుంది.
       అంటే భార్యని గుండెల్లో పెట్టుకునే భర్త.
భర్త హృదయమెరిగి ప్రవర్తించే భార్య కలసిఉండిన దాంపత్యం.

🌹2.గౌరీశంకరులు అర్ధనారిశ్వరులు.
             ఆలోచన-మాట - చేత కలిసే ఉంటాయి.
    ప్రకృతి స్వరూపిణియైన శ్రీమాత గంధం, పట్టువస్త్రాలు,
          స్వర్ణాభరణాలతో ప్రకాశిస్తూంటుంది.
పురుషుడైన శివుడు భస్మం, చర్మం, పాములతో విలక్షణంగా
ఉంటూ, తన భాగమైన భార్యని ప్రకృతిగా చక్కగా చూస్తాడు.

🌹3. భారతీ బ్రహ్మల దాంపత్యంలో
         బ్రహ్మ నాలుకపై సరస్వతీదేవి ఉండి పలుకుతుంది.

🌹4. ఛాయాసూర్యులలో
   సూర్యుడు చిటపటలాడుతుంటే, 
    ఛాయాదేవి ఆయనని వెన్నంటియుండి సేవచేస్తుంది.

🌹5. రోహిణీచంద్రుల దాంపత్యంలో
          రోహాణీ కార్తెలా భార్య ఉంటే, 
  వెన్నెలతోపాటు చల్లదనాన్నిస్తూ భర్త చంద్రుడులా వుంటాడు.
  🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS