లక్ష్మీదేవి కటాక్షం కొరకు పాటించాల్సిన పద్ధతులు!
ధనం ఎప్పుడూ మన దగ్గరే ఉండాలంటే భగవంతుడి అనుగ్రహం కావాల్సిందే. అందులోనూ ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉండాలి.
అయితే లక్ష్మీదేవి అందరినీ కనికరించదా అంటే.. మన పనులు, ప్రవర్తన, నియమ నిబద్దత.. వీటన్నిటి వలనే భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. కొంతమందిని ఆర్థికపరమైన ఇబ్బందులు దెబ్బతీస్తుంటాయి. మరి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి లక్ష్మీదేవి మంత్రాన్ని ఎలా జపించుకోవాలో, అలాగే ఎలాంటి ఆర్థిక పరమైన సమస్యలున్నా.. రావి ఆకుకు సంబంధించి ఎటువంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
ఈ మంత్రాన్ని పఠించండి
ఎవరైనా సరే, మాకు ధన పరమైన ఇబ్బందులు ఉన్నాయి.. వచ్చిన డబ్బు వెంటనే ఖర్చైపోతుంది. ఎంత సంపాదించినా ధనం నిలబడట్లేదు అని బాధపడేవాళ్లు రకరకాల మార్గాలలో ధన ఆదాయాన్ని పెంచుకోవాలంటే, ఆర్థికంగా మీకు బాగా కలసి రావాలంటే, లక్ష్మీదేవికి సంబంధించిన ఒక చిన్న మంత్రాన్ని ప్రతిరోజూ చదువుకుని మీ కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి.
ఆ మంత్రమే 'ఓం శ్రీం నమః' . ఈ మంత్రం చదువుకుంటే మీకు ఆర్థికంగా తప్పకుండా కలిసొస్తుంది. శ్రీం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ చిన్న మంత్రం రోజూ 11 సార్లు చదువుకుంటే ఎంతో మంచిది. త్వరగా లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.
రావి ఆకుతో ఇలా చేయండి
అలాగే ఈ మంత్రంతో పాటుగా రావి చెట్టుకు సంబంధించి కొన్ని చిట్కాలను పాటించండి. అదెలా అంటే మీరు శనివారం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి ఒక రావి చెట్టు ఆకును ఇంటికి తెచ్చుకుని, శుభ్రంగా కడిగి, దానిమీద సింధూరంతో 'హ్రీం' అనే పదాన్ని రాసి ఆ ఆకుని మీ దగ్గరే ఉంచుకోండి. ఇలా చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడొచ్చు. ఇలా ప్రతి శనివారం కూడా మీ దగ్గర ఉన్న ఆకును రావి చెట్టు మొదట్లో వేసి.. మరలా కొత్త ఆకుని తెచ్చుకుని సింధూరంతో మనం ముందుగా చెప్పుకున్న పదాన్ని రాసి ఆ ఆకుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా నాలుగు శనివారాలు చేస్తే చాలు మీకున్న ఆర్థికపరమైన సమస్యల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది.
అలాగే రావి చెట్టు వద్దకు వెళ్లేటప్పుడు.. ఒక గ్లాస్ పాలలో కొంచెం బెల్లం ముక్కను వేసి.. ఆ పాలను రావి చెట్టు మొదట్లో పోసి ఆ మట్టిని బొట్టులాగా పెట్టుకుంటే వారి ఇంట్లో ధనలక్ష్మి ఎప్పుడూ నిండుగా ఉంటుంది.
No comments:
Post a Comment