జోతిష్యంలో నవమాసాలు - నవగ్రహాలు.!
పిండోత్పత్తి ప్రారంభమయిన దగ్గర నుండి శిశు జననం వరకు తల్లి గర్భములో పిండం ప్రతి మాసం మార్పులు చెందుతూ ఉంటుంది. ఆ మార్పుల ఆధారంగా ప్రతి మాసమునకు ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు.
1 వ మాసం శుక్ర గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శుక శోణితాలు ద్రవ రూపంలో ఉంటాయి.
2 వ మాసం కుజ గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శుక్ర శోణితాలు గట్టిపడుతుంటాయి.
3 వ మాసం గురుగ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో జీవం ప్రారంభమవుతుంది. అవయవాలు ఏర్పడటం ప్రారంభమవుతుంది.
4 వ మాసం రవి గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో ఎముకలు ఏర్పడటం ప్రారంభమవుతుంది.
5 వ మాసం చంద్ర గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో ద్రవ పదార్ధాలు ఏర్పడతాయి. చర్మం ఏర్పడటం ఆరంభమవుతుంది.
6 వ మాసం శని గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శిశువుకు కేసాలు ఏర్పడతాయి.
7 వ మాసంలో బుధ గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శిశువుకు స్పర్శ జ్ఞానం ప్రారంభమవుతుంది.
8 వ మాసంలో తల్లి లగ్నాధిపతి ప్రాదాన్యత వహిస్తూ ఉంటుంది. .
9 వ మాసలో చంద్ర గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శిశువుకు ఆహారం తీసుకోవటం తెలుస్తాయి.
10 వ మాసంలో రవి గ్రహం ప్రాదాన్యత వహిస్తూ ఉంటుంది.
పై గ్రహాలు అవి సూచించు మాసాలలో గర్భంలోని శిశువుపై ప్రభావాన్ని సూచిస్తాయి. గర్భవతిగా స్త్రీకి ఎన్నవ మాసం జరుగుతుందో ఆ మాసాధిపతి ఆ మాసములో గోచారంలో బలహీనపడరాదు. అదే విధంగా ఒక స్త్రీ జాతకంలో ఏదైనా గ్రహం బలహీనంగా ఉంటే ఆ గ్రహం సూచించు మాసములో గర్భములోని శిశువుకు ఇబ్బందులు ఏర్పడటం లేదా గర్భస్రావం జరగటం లేదా గర్భవతికి గర్భ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడటం జరుగుతాయి.
ఉదా:- గర్భవతి జాతకంలో రవి బలహీనపడిన నాల్గవ నెలలో ఇబ్బందులు కలగటం లేదా ప్రసవ సమయంలో కష్టాలు కలుగుతాయి. ఏ విధంగా స్త్రీ జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉన్నదో మరియు గర్భవతిగా ఉన్నప్పుడూ ఏ మాసం జరుగుతుందో ఆ మాసాధిపతి ఆ మాసంలో గోచారంలో బలంగా ఉన్నాడో లేదో ముందుగానే పరిశీలించి ఆ గ్రహానికి శాంతి ప్రక్రియలు చేయించుకున్న గర్భ రక్షణ జరుగును.
No comments:
Post a Comment