Saturday, May 20, 2023

సోమస్కంధమూర్తి

 అరుణాచల క్షేత్రంలో కొలువై ఉన్న సోమ స్కందమూర్తులుఅపీతకుచాంబ దేవి, బాల సుబ్రహ్మణ్యునితో దర్శనమిస్తున్న  అరుణాచలేశ్వరుడు


సోమస్కంధమూర్తి


పార్వతి పరమేశ్వరుల మధ్యలో చిన్న బాలుడుగా ఆడుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి వారు హృదయానందకరమైన దృశ్యం.


తమిళనాడులో ఈ మూర్తి ప్రతి శివాలయమున ఉంటారు ... మన ఆంధ్రరాష్ట్రమున కపిలతీర్థం మరియు శ్రీ కాళహస్తీ దేవాలయాల్లో మాత్రమే మనకు కనిపిస్తారు ...🙏

🙏సంతానం కలగాలని కోరుకునే దంపతులు 

శ్రీ సోమస్కంద మూర్తి చిత్రపటం గానీ, విగ్రహం కానీ ఇంట్లో పెట్టుకుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే, పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వలన,  సుబ్రహ్మణ్యుని వంటి తేజోమూర్తి అయిన సుపుత్రుడు జన్మిస్తాడు అని శాస్త్ర వచనం. అంతే కాదు పిల్లలు ఉన్నవారైనా సరే, ఈ సోమస్కంద మూర్తిని ఆరాధిస్తే, పిల్లలు చక్కని తెలివితేటలు, బుద్ధి కుశలత, చురుకుదనం, తేజస్సు పొందుతారు. 


🙏స- ఉమా- స్కంద మూర్తి ... 🙏


*సోముడు అనగా శివుడు , 

*ఉమాదేవి అనగా పార్వతి దేవి, 

*స్కందుడు అనగా సుబ్రహ్మణ్యస్వామి వారు, 

వీళ్ళ ముగ్గురూ కలసి ఉన్న మూర్తినే సోమస్కంద మూర్తి అంటారు,చాలా విశేషమైన మూర్తి. 

No comments:

Post a Comment

RECENT POST

శ్రీ రుద్రం నమకం

  శ్రీ రుద్రం నమకం శ్రీ రుద్ర ప్రశ్నః కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితా చతుర్థం-వైఀశ్వదేవం కాండం పంచమః ప్రపాఠకః ఓం నమో భగవతే॑ రుద్రా॒య ॥ నమ॑...

POPULAR POSTS