నవనందుల దర్శన భాగ్యం
నంద్యాలలో నవ నందులు ఎలా దర్శనం చేసుకోవాలి.
ముందుగా నంద్యాలలోని మల్లికార్జున స్వామి వారి గుడికి చేరుకుని దర్శనం చేసుకుని నవ నందులు దర్శనం చేసుకోవటానికి స్వామి దగ్గర అనుమతి తీసుకోవాలి (మనం నవ నందులు తిరిగాము అనేదానికి ఆయనే సాక్షి).
తరువాత ::-
1. ప్రథమ నంది ( బొమ్మల సత్రం దారిలో, చామకాల్వ సెంటర్ దగ్గర)
2. నాగ నంది ( బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయస్వామి గుడి లో ఆంజనేయ స్వామి మూల విరాట్టు పక్కనే వుంది).
3. సోమ నంది ( ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర)
4. శివ నంది ( నంద్యాల నుండి 15 km దూరం కడమలకాల్వ గ్రామం లో)
5. కృష్ణ నంది ( శివ నంది నుండి 5 km దూరం)
(కృష్ణ నంది నుండి తెలుగు గంగ కాలువ కట్ట మీద నుండి
6 km travel చేస్తే మహానంది రోడ్ వస్తుంది)
6. గరుడ నంది ( మహానంది లో పెద్ద నంది విగ్రహం దాటిన తరువాత మనకు ఎడమ వైపు వుంటుంది.
7. మహానంది.
8. వినాయక నంది (మహానంది గుడి లోనే ప్రసాదం కౌంటర్ దగ్గరలో)
9. సూర్య నంది ( మహానంది నుండి నంద్యాల వచ్చే దారిలో తమ్మడ పల్లె గ్రామం దాటిన తరువాత మైన్ రోడ్ నుండి ఎడమవైపు 2km వెళ్ళాలి)
అన్ని నందులు చూసిన తరువాత నంద్యాలలో మల్లికార్జున స్వామి గుడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాలి.
అపుడే నవ నందులు దర్శన ఫలితం వస్తుంది.
No comments:
Post a Comment