Tuesday, May 16, 2023

నవగ్రహ దోషములు - స్నానౌషధములు

 నవగ్రహ దోషములు - స్నానౌషధములు



నవగ్రహ దోషములు- స్నానౌషధములు సిద్ధౌషధ సేవల వలన రోగములు, మంత్ర జపము వలన సకల భయము తీరునట్లుగా ఔషధస్నాన విధానము వలన గ్రహ దోషములు నశించును.

సూర్య గ్రహ దోషము తొలగుటకు: మణిశిల, ఏలుకలు, దేవదారు, కుంకుమ పువ్వు, వట్టివేళ్ళు, యష్టిమధుకము, ఎర్రపుష్పాలు, ఎర్రగన్నేరు పువ్వులు ఈ వస్తువులను నీళ్ళూ వేసి కాచి, ఈ నీటితో స్నానము చేయవలెను.

చంద్ర గ్రహ దోషము తొలగుటకు: గో మూత్రము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు నెయ్యి, శంఖములు, మంచిగంధములు, స్పటికము ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలెను.

కుజ గ్రహ దోషము: మారేడు పట్టూ, ఎర్రచందనము, ఎర్రపువ్వులు, ఇంగిలీకము, మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానము చేయవలయును.

బుధ గ్రహ దోషము: ఆవుపేడ, తక్కువ పరిమాణములో పండ్లు, గోరోచనము, తేనే, ముత్యములు బంగారము  ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలయును.

గురు గ్రహదోషమునకు: మాలతీపువ్వులు, తెల్ల ఆవాలు, యష్టి మధుకం, తేనే వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలయును.

శుక్ర గ్రహదోషము: యాలుకలు, మణిశిల, శౌవర్చ లవణము, కుంకుమ పువ్వు ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలయును.

శని గ్రహ దోషము: నల్ల నువ్వులు, సుర్మరాయి, సాంబ్రాణి, సోపు వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలయును.

రాహు గ్రహ దోషము: సాంబ్రాణి, నువ్వు చెట్టు ఆకులు, కస్తూరి, ఏనుగు దంతము(ఏనుగు దంతము లేకపొయినను తతిమ్మా వాటితో)  ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానము చేయవలయును.

కేతు గ్రహ దోషము: సాంబ్రాణి, నువ్వుచెట్టు ఆకులు, ఏనుగు దంతం, మేజ మూత్రం, మారేడు పట్ట ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS