గంగా ద్వాదశ నామాలు
గంగానదీ తీరాన - పుష్కరస్నానం చేయడానికి వీలుపడని పక్షంలో మరేదైనా నదిలో కానీ, కాలువలో లేదా చెరువులో కానీ, అదీ కుదరకపోతే ఇంటిలోని బావి వద్ద గంగా స్తోత్రం చేస్తూ, భక్తిశ్రద్ధలతో చేయాలి._
స్నానం చేసేటప్పుడు ఈక్రింది శ్లోకం చదవాలి_
‘‘మమ ఏతజ్జన్మ జన్మాంతర సమూద్భూత పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పుష్కర మహాపర్వ నిమిత్తం స్నాన మహం కరిష్యే!’’
- అని సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి.
స్నానం చేశాక - పితృ తర్పణాలు , నిత్యానుష్ఠానాలను యథావిధిగా నిర్వర్తించాలి. తరువాత తీర్థ పూజ చేయాలి. పూజలో
‘‘నమశ్శివాయై, నారాయణ్యై , దశపాపహరాయై , గంగాయై!’’
అనే మంత్రం చెబుతూ నారాయణుణ్ణీ , రుద్రుణ్ణీ , బ్రహ్మనూ , సూర్యుణ్ణీ , భగీరథుణ్ణీ , హిమవంతుణ్ణీ ఆవాహన చేసి, పూజించాలని శాస్త్రవచనం.
గంగామాత ద్వాదశనామాలు
‘‘నందినీ, నళినీ, సీతా, మాలినీ, మహాపగా, విష్ణు పాదాబ్జ సంభూతా, గంగా, త్రిపథగామినీ, భాగీరథీ, భోగవతీ, జాహ్నవీ, త్రిదశేశ్వరి’’
అనే పన్నెండు నామాలను తలచుకుంటూ అందుబాటులో ఉన్న జలవనరులలో మునకలు వేస్తే - గంగానదీ స్నానాన్నీ , వ్రతాన్నీ నిర్వహించగా ప్రాప్తించే ఫలానికి సమానమైన ఫలం పొందుతారని శాస్త్రం చెబుతోంది.
No comments:
Post a Comment