Tuesday, May 16, 2023

ఇంట్లోనే అమ్మవారిని ఎలా ఆరాధించాలి... పూజా విధానం గురించి తెలుసుకోండి... ఇంట్లోనే నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఎలా ఆరాధించాలి.. పూజ సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి.. ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

 ఇంట్లోనే అమ్మవారిని ఎలా ఆరాధించాలి... 


పూజా విధానం గురించి తెలుసుకోండి...

ఇంట్లోనే నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఎలా ఆరాధించాలి.. 

పూజ సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి.. ఏయే పనులు చేయాలి.. 

ఏయే పనులు చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మాతకు అత్యంత ప్రీతికరమైన దేవీ శరన్నవరాత్రుల వేడుకలు  సౌభాగ్యాలను అందించే అమ్మవారిని నవరాత్రుల సమయంలో భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనకవర్షం కురిపిస్తారని చాలా మంది నమ్ముతారు. నవరాత్రుల వేళ దుర్గా మాతను తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాలలో అలంకరించి.. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ పవిత్రమైన రోజుల్లో దుర్గా మాత లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, మహిషాసుర మర్దినిగా కూడా భక్తులందరికీ దర్శనమిస్తారు. మన దేశంలో నవరాత్రి ఉత్సవాలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మాదిరిగా నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో దుర్గా మాత విగ్రహాలను ఏర్పాటు చేసి మేళతాళాలు, వాయిద్యాల నడుమ శోభయాత్రలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇంట్లోనే నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఎలా ఆరాధించాలి.. పూజ సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి.. ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

​ఇంట్లో దుర్గా మాతను పూజించే వారు కేవలం పూజా గదిలోనే లేదా తూర్పు దిశలో అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచాలి. అనంతరం పసుపు కలిపిన నీళ్లతో ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేసుకోవాలి. అమ్మవారు సౌభాగ్య ప్రదాయిని కాబట్టి గాజులు, పసుపు, పూల హారాలు, కొత్త బట్టలతో అలంకరించాలి. అనంతరం పువ్వులు సమర్పించి, నైవేద్యం పెట్టి దీపారాధన చేయాలి.అంతకంటే ముందు మీ ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలతో అలంకరించాలి. అమావాస్య రాత్రి నుండి ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయమే వేదికపై దేవి ప్రతిమను బ్రాహ్మాణుల సహాయంతో ప్రతిష్టించాలి.కొంతమంది ఇంట్లో దుర్గాదేవి విగ్రహం లేదా ఫొటో లేకపోయినా కూడా అమ్మవారిని పూజించొచ్చు. నవరాత్రుల వేళ పూజా గదిలో దేవీ మంత్రాలను పఠిస్తూ పూజ చేయాలి. ‘ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’ అనే మంత్రాన్ని రాగి రేకు మీద రాసి ఆ యంత్రాన్ని ఉంచి కూడా పూజలు చేయొచ్చని పండితులు చెబుతున్నారు.దుర్గా మాత విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత అక్కడ ముందుగానే ఏర్పాటు చేసుకున్న కలశంపై పచ్చి కొబ్బరికాయను ఉంచి, కొత్త బట్టలు(ఎర్రని రంగులో) కప్పి అమ్మవారిని దానిపై ఆవాహన చేసి బ్రహ్మాణుల సహాయంతో పూజను చేయాలి. దేవీ సహస్రనామ పారాయణ అష్టోత్తర శత నామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో ఆరాధించాలి. నవరాత్రుల్లో తొలి రోజు సెప్టెంబర్ 26వ తేదీన అఖండ జ్యోతి వెలిగించాలి. ఇలా 9 రోజుల పాటు చేయడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు, శ్రేయస్సు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. నవరాత్రుల్లో అమ్మవారికి బంతిపూలు, చామంతి, జాజి, కనకాంబర పూలతో పాటు ఇతర రకాల పూలతో పూజించాలి.దుర్గా మాత పూజ అనంతరం నైవేద్యం పొంగలి, పులిహోర, పాయసం, లెమన్ రైస్(చిత్రన్నం), గారెలు, బొబ్బట్లు తదితర రకాల నైవేద్యాలను సమర్పించాలి. అనంతరం వాటిని ఇతరులకు పంచాలి. ముఖ్యంగా బియ్యపు పిండి, నెయ్యి వంటి వాటిని విధిగా మీరు తయారు చేసే వంటలలో ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లిని మీరు చేసే వంటల్లో వాడకూడదు.నవరాత్రుల సమయంలో బ్రహ్మచర్యం పాటించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఎనిమిదో రోజున వివాహం కాని కన్యలను తొమ్మిది మందిని మీ ఇంటికి ఆహ్వానించాలి. అప్పుడు కన్య పూజ చేయాలి. వారికి ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయాలి. ఎందుకంటే వారిని దుర్గా మాత యొక్క తొమ్మిది రూపాలుగా భావిస్తారు.నవరాత్రుల వేళలో అమ్మవారిని ఆరాధించడం వల్ల తమ ఇంటి శ్రేయస్సు, సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అలాగే తమ కష్టాలను దుర్గా మాత పూర్తిగా తొలగిస్తుందని విశ్వసిస్తారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే తాము చేపట్టే ప్రయత్నాల్లో కచ్చితంగా విజయం సాధించి తీరుతామని చాలా మంది నమ్ముతారు. నవరాత్రుల వేళ మద్యం, మాంసాహారం వంటి వాటి జోలికి వెళ్లకూడదు. ఈ పవిత్రమైన సమయంలో కటింగ్, షేవింగ్ వంటివి కూడా చేసుకోకూడదు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS