Tuesday, December 2, 2025

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.


ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.............!!
 కుబేర మంత్రం : (ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయै
ధనధాన్య సమృద్ధింఁ మే దేహి దాపయ స్వాహా ! )

రోజు దీపారాధన చేసి మీరు1 చేసే పూజ చేశాక ఈ ఫోటో లో చూపెట్టిన విధంగా మీరు దేవుడి దగ్గర ఒక పీట పైన గాని లేక ఒక అట్టపైన గాని గీసి ఈ అంకెలు ఇలాగే రాసి, పైన చెప్పిన కుబేర మంత్రం 108 సార్లు జపం చేయాలి... ఇలా 3 నెలలు వదలకుండా రోజూ చేయాలి మీకు ధన ప్రాప్తి కలుగుతుంది, కుబేరుడు చాలా ధర్మనిష్ఠ కలిగిన దైవం ఎవరైనా కొరని విధంగా కోరుకొని ఈ సాధన దుర్వినియోగం చేస్తే మీరు ఆయన దృష్టికి వెళ్లి శిక్షించ బడతారు, మీరు కోరుకునే సంపద న్యాయమైనది అయితే తప్పక మీమల్ని అనుగ్రహిస్తారు...

ధనం కి దేవత లక్ష్మీ అయినా అది పంచె బాధ్యత కుబేరుడిది... మీకు 108 టైమ్స్ జపం చేస్తే చాలు అని చెప్పాను... కానీ మీరు ఎంత ఎక్కువగా ఈ యంత్రం ముందు కూర్చుని జపం చేస్తే అంత త్వరగా మంచి ఫలితం వస్తుంది... గుర్తు పెట్టుకోండి విధానం వేయగానే చెట్టు రాదు పెళ్లి అయిన మరుసటి రోజే కొడుకు పుట్టడు...దైవం అనుగ్రహము తో పాటు మీకు అన్ని అనుకూలించే సమయం కూడా భగవంతుడు కలిపిస్తారు... నమ్మకం తో చేయండి ఇది ప్రయత్నం చేసి ఎంతో మంది సమస్యల నుండి బయట పడ్డారు.. ఆర్థికంగా బాగుపడ్డారు.

గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ప్రతి మనిషి దైనందిన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంటాడు.

గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌
ప్రతి మనిషి దైనందిన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంటాడు. వివిధ సమస్యలతో సతమతం అవుతుంటారు. అలాంటి వారిని గ్రహ బాధలు పట్టి పీడిస్తుంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తుంటారు.
అయితే గ్రహబాధల నుంచి బయట పడేందుకు జపాలు, తపాలు, పూజలు చేయమంటారు. అవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. కొన్ని సందర్భాలలో లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయాల్సి వస్తుంది. అయితే వేలకు వేలు ఖర్చు పెట్టలేని మధ్య తరగతి వారి కోసమే పరిహార శాస్త్రంలో సింపుల్‌ రెమిడీస్‌ ఈ కథనంలో తెలుసుకుందాం.

సూర్యుడు: ఎవరి జాతకం చక్రంలో అయితే రవి బలహీనంగా ఉంటాడో వారికి అనారోగ్య ము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధులు, తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపో వుట వంటి సమస్యలు ఎదుర్కొంటారట. ఇలాంటి వారు సమస్యల పరిహారం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం చేయటం. ఆదిత్య హృదయం పారాయణ చేయటం. అలాగే గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థములు దానం చేయాలట.

మంత్రం:రవి గ్రహ అనుగ్రహం కోసం ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః అనే బీజ మంత్రాన్ని ఉదయం వేళలో జపించాలట.

చంద్రుడు: జాతక చక్రంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగాలే పోవుట, భయం, అనుమానం, విద్యలో అభివృద్ధి లేకపోవుట, తల్లిగారి యొక్క ఆరోగ్యం సరిగా లేకపోవుట, స్ర్తీలతో విరోధము, మానసిక వ్యాధులు, రాత్రులు సరిగా నిద్రపట్టక పోవుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కువగా ఉండుట, స్ర్తీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు ఏర్పడతాయట. ఈ సమస్యల పరిష్కారం కోసం బియ్యం దానం చేయుట. పాలు, మజ్జిగ చిన్నపిల్లలకు పంచి పెట్టాలట. అలాగే శివునికి అవుపాలతో అభిషేకం చేయించాలట.

చంద్ర మంత్రం: ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయ నమః అనే బీజ మంత్రాన్ని సంధ్యా సమయంలో జపించాలట.

కుజుడు: జాతకచక్రంలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ధైర్యం లేకపోవుట, అన్నదమ్ములతో సఖ్యత నశించుట, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధింపులు అప్పులు తీరకపోవుట, ఋణదాతల నుండి ఒత్తిడి లాంటి సమస్యలు ఎదుర్కోంటారట. కుజ గ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మ ణ్యస్వామి, ఆంజనేయ స్వామిని పూజించాలి. హనుమాన్‌ చాలీసా పారాయణ చేయడం. కందులు దానం చేయడం, పగడం, ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండటం లాంటి పరిహారాలు చేయాలట.

కుజమంత్రం: ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః అనే మంత్రాన్ని ప్రతి రోజు రెండు గంటల పాటు జపించాలట.

బుధుడు: జాతక చక్రంలో బుధుడు బలహీనంతగా ఉన్నట్లయితే.. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అనుమానం, తరుచూ ధననష్టం మొదలగునవి జరుగు చున్నప్పుడు బుధ గ్రహ దోషంగా గుర్తించాలని పండితులు చెప్తున్నారు. అయితే బుధ గ్రహా అనుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వేంక టేశ్వరస్వామిని, విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి. అలాగే ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి ఆహారంగా ఇవ్వాలట.

బుధమంత్రం: బుధ గ్రహ అనుగ్రహం కోసం ఓం బ్రాం బ్రీం భ్రౌం సః బుధాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 5 గంటల పాటు జపించాలట.

గురువు: జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేకపోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు గురు గ్రహం దోషంగా గుర్తించాలట. గురు గ్రహం అనుగ్రహం కోసం గురు చరిత్ర పారాయణ చేయుట. దైవ క్షేత్రములు సందర్శించడం. శనగలు దానం చేయడం. పంచముఖి రుద్రాక్ష ధారణ చేయడం. కనక పుష్కరాగం ధరించాలి.

గురుమంత్రం:గురు గ్రహ అనుగ్రహం కోసం ఓం గ్రా౦ గ్రీం గ్రౌం సః గురవే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు సంధ్యా సమయంలో జపించాలట.

శుక్రుడు:జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు స్ర్తీలకు అనారోగ్యము కలుగుట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యా భర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట. వ్యసనముల యందు ఆసక్తి, వివాహం ఆలస్యం అగుట, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారం, మత్తుపానీయాలు సేవించుట, కుటుంబంలోని స్ర్తీలకు అనారో గ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషము గా గుర్తించాలి. శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట, లక్ష్మీ స్తోత్ర ము పారాయణం చేయుట, బొబ్బర్లు దానం చేయుట, స్ర్తీలను గౌరవించుట. సప్తముఖి రుద్రాక్షను ధరించాలి.

శుక్రమంత్రం: ఓం ద్రాం ద్రీం ద్రౌంసః శుక్రాయనమః అనే బీజ మంత్రాన్ని ప్రతిరోజు సూర్యోదయ సమయంలో జపించాలి.

శని: ఆయు కారకుడు అయిన శని దేవుడు జాతకంలో నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆ జాతకునికి బద్దకము, అతినిద్ర, దీర్థకాలిక వ్యాధులు, సరయిన ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట, ఎముకలు, తల్లిదండ్రులలో విరో ధములు, కుటుంబమును విడిచి అజ్ఞాతముగా జీవించుట లాంటి సమస్యలు ఉంటాయి. శని గ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకము చేయుట. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయాలి. ఆంజనేయస్వామిని ఆరాధించాలి. హనుమాన్‌ చాలిసా పారాయణం చేయాలి.

శని మంత్రం: ఓం ప్రాం ప్రీం ప్రౌంసః శనైశ్చరాయ నమః అనే బీజ మంత్రాన్ని ప్రతి రోజు సాయంత్రం పూట జపించాలట.

రాహువు: రాహువు జాతక చక్రంలో బలహీనంగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయుట, నీచ స్ర్తీలతో సహవాసము, కుష్టు లాంటి వ్యాధులు, జైలు శిక్షలు అనుభవించడం. విద్యార్థులు విద్య మధ్యలో మానివేయడం. లాంటి సమస్యలు వస్తాయి. ఈ దోష నివారణకు కనక దుర్గ అమ్మవారిని పూజించాలి. దేవి భాగవతం పారాయణం చేయాలి. ఎనిమిది ముఖములు గల రుద్రాక్షను ధరించాలి.

రాహువు మంత్రం: ఓం భ్రాం భ్రీం బ్రౌంసః రాహవేనమః అనే బీజ మంత్రాన్ని రాత్రి సమయంలో జపిచాలి.

కేతువు: కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఎకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, తనలో తానే ఊహించుకొనుట, తనని తాను దేవుడిగానో.. దేవతగానో ఊహించుకోవడం లాంటి సమస్యలు ఉంటాయి. ఈ గ్రహ అనుగ్రహం కొరకు నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయుట. ఆలయాల నిర్మాణానికి విరాళములు ఇవ్వాలి. పిచ్చి ఆస్పత్రిలో రోగులకు సేవలు చేయాలి. అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలి.

కేతు మంత్రం:ఓం స్త్రాం స్త్రీం సౌం సః కేతవేనమః అనే బీజ మంత్రాన్ని రాత్రి సమయంలో జపించాలి.

ఇలా ఏసమస్య ఉందో తెలుసుకుని ఆ సమస్యకు కారణమైన గ్రహానికి సంబంధింయిన పరిహారాలు చేసుకోవాలి. అలాగే తెల్లవారు జామునే నిద్ర లేచి స్నానం చేసుకుని దగ్గరలో ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవడం. ప్రతి రోజు సూర్య నమస్కారం చేసుకోవడం లాంటి చేయడం వల్ల కూడా ఎటువంటి గ్రహదోషాలు దగ్గరకు రావట.

హర హర మహాదేవ శంభో శంకర 
శివ సంకల్పమస్తు శుభమస్తు

అత్యంత అరుదైన దర్శనం నవ పాషాణ విగ్రహం పళని శ్రీ సుబ్రహ్మణ్యుని నిజరూపం ఈ దర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం

అత్యంత అరుదైన దర్శనం నవ పాషాణ విగ్రహం🙏పళని శ్రీ సుబ్రహ్మణ్యుని నిజరూపం🙏ఈ దర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం🙏

🙏శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. 🙏

🙏దండాయుధ పాణి 🙏

🙏ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళం వాళ్ళు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” -  అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని. 🙏

🙏ఇక్కడ పళని మందిరంలోని గర్భ గుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశారు. తొమ్మిది రకాల విషపూరిత పదార్ధాలతో (వీటిని నవపాషాణములు అంటారు) చేశారు. పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుక నుండి స్వామి వారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠ రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే, వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా, స్వామి వారి తొడ భాగం బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామి వారిని వెనుక నుండి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెప్పారు. కాని మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు.🙏

🙏ఇక్కడ స్వామి వారిని ఈ క్రింది నామాలతో స్తుతి చేస్తూ ఉంటారు. కులందైవళం, బాలసుబ్రహ్మణ్యన్, షణ్ముఖన్, దేవసేనాపతి, స్వామినాథన్, వల్లిమనలన్, దేవయానైమనలన్, పళనిఆండవార్, కురింజిఆండవార్, ఆరుముగన్, జ్ఞాన పండిత, శరవణన్, సేవర్ కోడియోన్, వెట్రి వేల్ మురుగా ...మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ.🙏

🙏ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది. 

🙏ఇంకొక విషయం ఏమిటంటే, పళని లో కొండ పైకి ఎక్కడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఓపిక ఉన్న వారు మెట్ల మార్గంలో వెళ్లడం ఉత్తమం. మెట్లు కాకుండా, రోప్ వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది. దీనికి టికెట్ యాభై రూపాయలు. ఒక సారి వెళ్ళడానికి బావుంటుంది. (ఓపిక లేకపోతే ప్రతీ సారి)🙏

🙏పళని క్షేత్ర స్థల పురాణము:🙏

🙏పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని, పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జ వినాయకుడిని, చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి ఈ భూలోకం చుట్టి ( అన్ని పుణ్య  నదులలో స్నానం ఆచరించి  ఆ క్షేత్రములను దర్శించి రావడం) ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే, అప్పుడు పెద్దవాడు, వినాయకుడు యుక్తితో ఆది దంపతులు, తన తల్లి తండ్రులు అయిన ఉమా మహేశ్వరుల చుట్టూ మూడు మాట్లు ప్రదక్షిణ చేస్తారు. మన బుజ్జి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనముపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కాని, వినాయకుడు “తల్లి తండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది” అనే సత్యము తెలుసుకుని, కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల, సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు  వెళ్ళినా, అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మనకు అందరకూ తెలిసినదే.🙏

🙏కార్తికేయుడు శివ కుటుంబంలో చిన్న వాడు కదండీ, దానితో కాస్త చిన్న మొహం చేసుకుని కైలాసం వదిలి, భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు అలకతో. ఏ తల్లి తండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదండీ, అందులోనూ చిన్న వాడు, శివ పార్వతుల ఇద్దరి అనురాగముల కలపోత, గారాల బిడ్డ కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా, శివ పార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు. 🙏

🙏శంకరుడు సుబ్రహ్మణ్యుని బుజ్జగిస్తూ..🙏

🙏ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశమును తిరు ఆవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని, “ నువ్వే సకల జ్ఞాన ఫలానివి రా నాన్నా” అని ఊరడిస్తారు. సకల జ్ఞాన ఫలం (తమిళంలో పలం), నీవు (తమిళంలో నీ) – ఈ రెండూ కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతముగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తారు. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జరిగే “కావడి ఉత్సవం” మొట్ట మొదట ఈ పళని లోనే ప్రారంభం అయ్యింది.🙏

🙏కావడి ఉత్సవము - ఇడుంబన్ వృత్తాంతం:🙏

🙏ఇడుంబుడు 🙏

🙏సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గొప్ప శిష్యులలో అగస్త్య మహా ముని ఒకరు. అగస్త్య మహా ముని స్వామి దగ్గర నుండి సకల జ్ఞానము పొందారు. అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణము సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు. 🙏

🙏పూర్వము దేవ దానవ యుద్ధములో చాలా మంది దానవులు నిహతులై పోయారు. కాని అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రం అగస్త్య మహర్షి పాదములు పట్టుకున్నాడు. అగస్త్యుడు సంతోషించి, వీడిలో మిగిలిపోయిన కొద్ది రాక్షస భావాలు తొలగించాలి అనుకున్నారు. సాధారణంగా ఎవరైనా పెద్దలు తన వల్ల కాని పని ఉంటే, తన గురువుకి అప్పచెప్తారు. వీడు రాక్షసుడు కదా అని సంహరించడం కాదు, వీడిలో ఉన్న ఆసురీ గుణములను తీసివేయాలి అని తలచి, లోకంలో ఆదిగురువు దక్షిణా మూర్తి, శంకరుడు ఉండేది కైలాసంలో కదా, అందుకని ముందు అక్కడికి పంపిద్దాము అనుకుని ఇడుంబుడిని పిలిచి, “ఒరేయ్ నేను కైలాసం నుండి రెండు కొండలు తెద్దామని చాలా కాలం నుండి అనుకుంటున్నాను, వాటిని శివగిరి, శక్తిగిరి అంటారు. నువ్వు వెళ్లి ఆ రెండు కొండలను, ఒక కావిడి లో పెట్టుకుని నేను ఉన్న చోటికి తీసుకురా” అని ఆజ్ఞాపించారు.🙏

🙏సరే ఇడుంబుడు, వంట్లో ఓపికుంది కదా, కైలాసం వెళ్లి ఆ రెండు కొండలను తన కావిడిలో పెట్టుకుని బయలుదేరతాడు. శంకరుడు అనుకుంటాడు, ఈ రాక్షసుడి ఆసురీత్వం పోగొట్టడం, జ్ఞాన రాశి అయినటువంటి మా సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అనుకుని ఇడుంబుడిని వెళ్ళనిస్తారు. ఇక్కడ స్వామి పళని కొండ మీద చిన్న పిల్లవాడిగా ఉన్నారు, ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరకి వచ్చే సరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి, కాసేపు క్రింద పెట్టి సేద తీరాడు.🙏

🙏మళ్ళీ కావిడి ఎత్తుకుందామని క్రిందకి వంగి కావిడి బద్ద భుజం మీద పెట్టుకుని లేచి నిలబడి, రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే ఒక వైపు ఎక్కువ బరువు, ఇంకో వైపు తేలిక అవుతోంది కాని, సమానంగా ఎంతసేపటికీ కుదరట్లేదు. ఇంక విసుగొచ్చి, ఏమిటిరా ఈ కావిడి అనుకుని, అలా పైకి చూస్తాడు ఇడుంబుడు. పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పకపక నవ్వుతున్నారు. ఇది చూసి వీడికి కోపం వచ్చింది. ఇదే రాక్షస ప్రవృత్తి అంటే, ఏదో చిన్న పిల్లవాడు నవ్వుతున్నాడులే అనుకోవచ్చు కదా. స్వామికేసి తిరిగి “ఏమిటా నవ్వు, నేనేమైనా ఈ కావిడి ఎత్తలేనని అనుకుంటున్నావా? కైలాసం నుంచి తీసుకొచ్చాను. ఏమిటా వెర్రి నవ్వు, నిన్ను చంపేస్తాను ఇవ్వాళ అని ఆ కొండ మీదకి పరిగెత్తాడు. తెలిసి పరిగెత్తాడో, తెలియక పరిగెత్తాడో పళని కొండ మీదకి పాదచారియై వెళ్లాడు. పైకి వెళ్ళాక, స్వామి రెండు గుద్దులు గుద్దారు, ఇంక ప్రాణం వదిలేస్తున్నాను అన్నప్పుడు, వాడికి తెలిసింది, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదురా, మా గురువు గారికి (అగస్త్యుడు) గురువు, సాక్షాత్తు ఈశ్వర పుత్రుడు.🙏

🙏అప్పుడు వేడుకుంటాడు “ఈశ్వరా తెలుసుకోలేక పోయాను, మీ చేతి గుద్దులు తిన్నాను, నాకు వరం ఇవ్వండి” అన్నాడు. ఏమిటో అడుగు అన్నారు స్వామి.
ఇడుంబుడు అన్నాడు, “స్వామీ, నేను ఈ పళనిలోనే కదా, కావిడి ఎత్తలేకపోయాను, ఈ కావిడి వల్లనే కదా, మిమ్మల్ని చేరడానికి మార్గం అయ్యింది, అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుడిని ఏ ఆరాధనా చెయ్యకపోయినా, ఒక్క సారి కావిడి పాలతో కాని,  విభూతితో కాని, పూలతో కాని, తేనెతో కాని, నేతితో కాని భుజం మీద పెట్టుకుని, మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరకి వెళ్ళిపోతున్నాం అని పాదచారులై నీ గుడికి వస్తే, అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన, శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో, అంత ఆరాధనా చేసిన ఫలితం వాళ్లకి ఇచ్చేసేయ్యాలి” అన్నాడు ఇడుంబుడు.🙏

🙏స్వామి అనుగ్రహించి సరేనని ఆ కోరికని కటాక్షించి, ఇక పైన నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందు నీ దర్శనం చేసి నా వద్దకు రావాలని వరం ఇచ్చారు. అందుకే అప్పటి నుంచి అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో (ప్రత్యేకం గా తమిళనాడులో) స్వామి వారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది, అక్కడ ఆయనకు నమస్కరించిన తరువాతే, సుబ్రహ్మణ్యుని దర్శనము చేసుకుంటారు.🙏

🙏సుబ్రహ్మణ్య కావిడలు 🙏

🙏అప్పటి నుంచి, తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్య కావిళ్ళు ఎత్తి సుబ్రహ్మణ్యుడిని తమ దైవం చేసేసుకున్నారు. అంతే కాక, ప్రతీ ఏటా స్కంద షష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే, భక్తితో, పూనికతో స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్లకి తప్పక సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. వారి వంశంలో సంతానము కలగక పోవడం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా ఆ దోష పరిహారం చేసి స్వామి అనుగ్రహిస్తారు అని పెద్దలు చెప్తారు.🙏

🙏అంతటి శక్తివంతమైన క్షేత్రం, తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రము పళని. పళని దండాయుధ పాణి స్వామి వారి దర్శనం చేసి, జీవితంలో ఒక్క సారైనా సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి సుబ్రహ్మణ్య అనుగ్రహమును పొందగలమని ఆశిద్దాం.🙏

🙏ఈ క్షేత్రమును చేరే మార్గములు:🙏
పళని తమిళనాడు లోని మధురై సమీపంలో నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది.
#రోడ్ ద్వారా: మధురై, కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, చెన్నై, బెంగళూరు నగరాల నుండి అనేక బస్సులు ఉన్నాయి.🙏

🙏#రైలు ద్వారా: పళని లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడ నుండి మధురై కి, కోయంబత్తూరు కి రైళ్ళు ఉన్నాయి. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు కొడైకెనాల్ ( 46 Km ), దిండిగల్ ( 48 Km ) దూరం లో ఉన్నాయి.🙏

🙏#విమానము ద్వారా: దగ్గరలో విమానాశ్రయములు కోయంబత్తూరు ( 116 Km ), మధురై ( 129 Km ), తిరుచిరాపల్లి ( 158 Km ), బెంగళూరు ( 306 Km ), చెన్నై ( 471 Km ) దూరంలో ఉన్నాయి..🙏

🙏#వసతి సదుపాయము:🙏
పళని కూడా మదురైకి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు. మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. కాస్త మంచివి కావాలంటే, Tamil Nadu Tourism Development Corporation (TTDC) వాళ్ళ హోటళ్ళు రెండు ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. వీటిలో మధురై – 1 అనే హోటల్ అమ్మ వారి ఆలయమునకు చాలా దగ్గరలో ఉంది. ఇది West Veli Street లో ఉంది. 🙏

🙏ఇది కాక పళని దేవస్థానం వాళ్ళ వసతి గృహాలు కూడా ఉన్నాయి. కాని అందులో ముందుగా బుక్ చేసుకోవాలంటే, వాళ్లకి డబ్బు డీడీ రూపం లో పంపవలసి ఉంటుంది. దీని లంకె ఇక్కడ ఇస్తున్నాను.🙏

🙏ఆలయంలో ఆర్జిత సేవలు:🙏

🙏ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదం తప్పకుండా స్వీకరించాలి. ఒక్కో ప్రసాదం డబ్బా యాభై రూపాయలు. సీల్ చేసిన డబ్బాలో ప్రసాదం ఇస్తారు. ఎన్ని రోజులైనా ఉంటుంది. చక్కగా ఇంటికి తీసుకువెళ్ళవచ్చు🙏

ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ ఓం శం శరవణభవ

#సర్వోజనా సుఖినోభావంత్🙏

విదేశాలలో ఉన్నా, ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న పిల్లల కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తి పరిహారం (Dakshinamurthy Upasana) చేయడం చాలా శ్రేయస్కరం మరియు శాస్త్రోక్తంగానే ఉంటుంది

విదేశాలలో ఉన్నా, ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న పిల్లల కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తి పరిహారం (Dakshinamurthy Upasana) చేయడం చాలా శ్రేయస్కరం మరియు శాస్త్రోక్తంగానే ఉంటుంది.

ఎందుకు దక్షిణామూర్తి పరిహారం....?
దక్షిణామూర్తి జ్ఞానానికి, స్థిరతకు, నిర్ణయ శక్తికి అధిష్ఠాత దేవుడు.
శని/రాహు/బుధ గ్రహ సంబంధిత అడ్డంకులు మరియు విదేశీ సెటిల్మెంట్ సమస్యలను తొలగించే దైవం.
పిల్లల ఉద్యోగం, విద్య, ఇంటర్వ్యూ, విదేశీ సర్దుబాటు, మానసిక తటపటాయింపు వీటి అన్నింటిలో మార్పులు కనపడతాయి.

తల్లిదండ్రులు ఎలా చేయాలి.....? 

గురువారం రోజు ముఖ్యంగా చేసి, ఇతర రోజుల్లోనూ చేయవచ్చు.

1) దక్షిణామూర్తి మంత్రం (ఉద్యోగం కోసం అత్యంత ప్రభావశాలి)
“ఓం నమో భగవతే దక్షిణామూర్తయే”
108 సార్లు జపించాలి.
తెల్లటి బట్టలు వేసుకుని, ముందుగా పిల్లల పేర్లు మనసులో తలుసుకొని జపం చేయాలి.

2) దీపం...
నువ్వుల నూనె లేదా గీరు దీపం
గురువారం 1 దీపం వెలిగితే చాలా మంచి ప్రభావం.

3) పుష్పం & నైవేద్యం....
తెల్లటి పువ్వులు చక్కగా పని చేస్తాయి.
పాలు/చక్కెర లేకుండా చిన్న ఫలం లేదా నైవేద్యం పెట్టవచ్చు

4) ప్రత్యేక శ్లోకం.......
(అడ్డంకులు తొలగించే శక్తివంతమైనది)

“మౌనవ్యాఖ్యాప్రకటన పరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృగణైరావృతం బ్రహ్మనిష్ఠైः
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రానందరూపం
దక్షిణామూర్తి మిదమహం మనసా చింతయామి”

రోజూ 1సారి చదివినా చాలా మంచిది.

ఎంత కాలం చేయాలి.......?
కనీసం 48 రోజులు (మండలం).
ఇంటర్వ్యూలు, ఉద్యోగ అవకాశం, అడ్డంకులు తొలగడం మొదలవుతాయి.

ఎప్పుడు ఫలితాలు వస్తాయి......?
మీ జాతకం మీద మీ పిల్లల జాతకం ప్రభావం కూడా ఉంటుంది కానీ సాధారణంగా 21వ రోజు నుండి ఫలితాలు కనిపించడం మొదలు అవుతాయి. 48 రోజులకు స్పష్టమైన మార్పులు వస్తాయి.
విదేశాల్లో ఉన్న పిల్లలకు మానసిక స్థిరత & ఉద్యోగ యోగం బలపడుతుంది.

తల్లిదండ్రులు చేస్తే మరింత శక్తిగా పనిచేస్తుంది కారణం పుత్ర కర్మ / మాతృ దేవోభవ, తల్లిదండ్రుల ప్రార్థన “అత్యంత శీఘ్రం” ఫలితాన్ని ఇస్తుంది.

RECENT POST

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.............!!  కుబేర మంత్రం : (ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయै ధనధాన్య...

POPULAR POSTS