Saturday, December 20, 2025

కూష్మాండ(గుమ్మడికాయ)దీపం అంటే ఎంటి.........!! ఎలా వెలిగిస్తారు ?


కూష్మాండ(గుమ్మడికాయ)దీపం అంటే ఎంటి.........!!
ఎలా వెలిగిస్తారు ? 
దేని కోసం వెలిగిస్తారు ? 
కూష్మాండ దీపం ఎలా పెడతారు.
ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే గుడిలో వేరుగా చెయ్యాలి.
ఒక వ్యక్తికి దృష్టి దోషం, నర ఘోష ,శని దోషం, ఆర్ధిక సమస్యలు, ఇంట్లో నెగిటి్ ఎనర్జీ ఎక్కువ అవ్వడం 
పిల్లలు మాట వినకపోవడo మొదలైన సమస్యలు ఉన్న వారికి కాల భైరవ తత్వం ప్రకారం, మంచి పరిహారం ఇది అందరు చేసుకోవచ్చు, కేవలం భక్తి శ్రద్ధ కావాలి అంతే .

ఒక చిన్న గుమ్మడి  (బూడిద)  కాయ తీసుకుని చిన్నది పెద్దది కాదు . దాన్ని అడ్డగ కోసి గింజలు పిక్కలు తీసి దొల్లగ చేసి దానిలో పసుపు రాసి కుంకుమ బొట్టు పేట్టి  అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి . 

ఆ దీపానికి పంచ ఉపచర పూజ చేసి దీపం దగ్గర కాల భైరవ అష్టకం 11 సార్లు చదవాలి.

ఎప్పుడు చెయ్యాలి ఈ దీపారాధన 
బహుళ అష్టమి రోజున కానీ 
అమావాస్య రోజున కానీ చెయ్యాలి 

ధన యోగం కోసం అష్టమి రోజు చెయ్యాలి. 
జన ఆకర్షణ కోసం అమావాస్య రోజు చెయ్యాలి.
 
ఎన్ని సార్లు చెయ్యాలి 19 అష్టములు కానీ 
19 అమావాస్య లు కానీ చెయ్యాలి 
ప్రసాదంగా ఎండు ఖర్జూరం పెట్టాలి 
 
ఆ రోజు ఉపవాసము ఉండాలి ఘన పదార్థం తినకుండా ద్రవ పదార్థం మాత్రమే తీసుకోవాలి.
ఉదయం 4:30 నుండి 6:00 మద్యలో చెయ్యాలి .
సంకల్ప మాత్రం చెప్పుకోవాలి కోరిక చెప్పుకోవాలి.
  
మీ జీవితం లో ఉన్న పూర్తి దృష్టి గ్రహ వాస్తు పీడలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి.
ఈ దీపారాధన అత్యంత శక్తి వంతం అయినది విపరీత జన ఆకర్షణ పెరుగుతుంది.

No comments:

Post a Comment

RECENT POST

దానాలు - శుభ ఫలితాలు*

దానాలు - శుభ ఫలితాలు*  ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుంది.. అనే మాటలు మనం వింటూ ఉంటాము. పురాణాలు కూడా దానం చ...

POPULAR POSTS