Sunday, December 21, 2025

శ్రీ శూలినీ దుర్గాంబా దేవీ


శ్రీ మాత అనుగ్రహం నరఘోష ,దృష్టి దోష నివారణరక్షణ , సర్వ దోష నివృత్తి , రక్షణ కోసం విశేష దేవత శ్రీ శూలినీ దుర్గాంబా దేవీ ధ్యానం *

*పిల్లలకు పెద్దలకు ,గృహాలకు, వ్యాపారాలకు గ్రామాలకు పట్టణాలకు ఉండే సమస్త దోష నివారించే ప్రత్యేక దుర్గా శక్తి ఈ శూలినీ దుర్గాంబా*

*శ్రీ శూలిని దుర్గా ధ్యానo*
అధ్యాసీనా మృగేంద్రం ప్రమథగణవృతా ప్రజ్జ్వలత్పాశహస్తా
చక్రం శూలం ధనుర్భిః పృథుతరముసలం ఖడ్గఖేటౌ దధానా |
చండీ ఘంటా నినాదైః విదళిత దనుజా భీతిదాతుః సురాణాం
దుర్గా శూలిన్యభీష్టా భవతు భయహరా భక్తవత్సార్చ్యమానా ||

*రూప వర్ణన*
అమ్మవారు సింహవాహిని 
ప్రమథ గణాలచే సేవింపబడుతుంది  చేతుల్లో పాశం, చక్రం, శూలం, ధనుస్సు, ముసలం (రోకలి వంటి ఆయుధం), ఖడ్గం మరియు డాలు వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది.
చేతిలోని ఘంటానాదం వింటేనే రాక్షసులు భయంతో వణికిపోతారు.
భక్తులకు అభయాన్నిస్తూ, భయాన్ని పోగొట్టే కరుణామయి ఈ శూలిని దుర్గా దేవి.

*ధ్యాన ఫలం*
*శత్రు నివారణ కోర్టు కేసులు, శత్రువుల నుండి వచ్చే ఇబ్బందులు మరియు కుతంత్రాల నుండి రక్షణ లభిస్తుంది.
*భయ విముక్తి తెలియని భయాలు, పీడకలలు మరియు మానసిక ఆందోళనలు తొలగి ధైర్యం కలుగుతుంది.
*దృష్టాంతర రక్షణ దిష్టి దోషాలు, నకారాత్మక శక్తి (Negative energy) ప్రభావం మీపై పడకుండా కాపాడుతుంది.
*కార్య సిద్ధి ఆటంకాలు తొలగి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
***************************************
శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏 
శ్రీ మాత్రే నమః *రాళ్ళబండి శర్మ*

No comments:

Post a Comment

RECENT POST

జాతకంలో 12 రకాల కాలసర్ప యోగాలు - పోరాటాలను అధిగమించి విజయం సాధించే సూత్రం............!! ​మనలో చాలా మంది 'కాలసర్ప దోషం' అనే పదాన్ని వ...

POPULAR POSTS