అసలు ఈ రహస్యం ఏమిటి?
ధర్మ సూక్ష్మము ఏమిటీ?
అతి సులువుగా తెలుసుకోండి.
మనలోని 3 దోషాలు తరచూ మోక్షం రాకుండా,మోక్షం వైపు సాధన చేయనియకుండా అడ్డుపడతాయి.వాటి ని తొలగించుకోవాలి.
🪷ఎలా తొలగించుకోవాలి.చాలా సులువుగా చెప్తాను.
త్రిపుర ఆసురులు(మన మోక్షం అనే సంకల్పం నేర వేరకుండా చూసేవారు)లో
మొదటి వారు
1.విద్యున్మాలి,
అంటే అర్ధం (విద్యుత్ లాంటి చంచలత)
గుడార్ధము.-
“విద్యుత్” = మెరుపు, చంచలత-
మనస్సు ఒక క్షణంలో ఒకటిని, మరో క్షణంలో మరొకటిని ఆశించడం అనేది.అంటే ఒక నిమిషం మంచి మీద వాలి,మరు నిమిషం చెడు మీద వాలేది మనసు.ఇది దోషం .
చంచలమైన మనస్సు,
ఏకాగ్రత లేకపోవడం,
ఒక విషయంపై నిలకడ లేకపోవడం ఇలా.
ముందు మనకు స్థిరత్వం రావాలి.ఎలా వస్తుంది?
ఈ దోషం ధ్యానం ద్వారా తొలగించుకోవాలి.
ప్రతి రోజూ కళ్ళు మూసుకొని "దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా"అని నామం.చేయండి. వేరే ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు అపవద్దు.చేతి లో జపమాల వైపు చూడండి.మళ్ళీ మనకు నామ స్మరణ చేయాలని గుర్తు వస్తుంది. మళ్ళీ మనసు ని నామ స్మరణ వైపు పెట్టండి.ఇలా తరుచూ చేస్తుంటే మనసు నామ స్మరణ వైపు తిరుగుతుంది.చంచలం తగ్గుతుంది.
రెండవ దోషం.
2️⃣ తారకాక్షుడు (తర్క–అహంకార దృష్టి)-అహంకార బుద్ధి.
పురాణార్థం
“తారక” = తర్కం, లెక్కలు
ప్రతిదీ తర్కంతో కొలవడం,జ్ఞాన గర్వం.
మనలో ఉన్న దోషం
అహంకారం
“నేనే తెలివైనవాడిని” అన్న భావం,నాకు అన్నీ తెలుసు.నాకు తెలిసింది అంతా నిజం.నా మార్గం మాత్రమే గొప్ప.ఇలా.భక్తి లో కూడా వాదనలు.
గురువు మాటను కూడా ప్రశ్నించడం.అన్నీ తెలుసు అనే భావన.
👉 భక్తి కన్నా వాదన ఎక్కువైతే — తారకాక్షుడు మనలో ప్రబలంగా ఉన్నాడు అని.
తారకాక్షుడు – అహంకార బుద్ధి,
🪷
దేనికి దత్త మార్గం ఈ.రోజు అంతా దత్త కృప.నా వల్ల అయితే అసలు కాదు అనుకోవడం.అంతా దత్తాత్రేయ అర్పణం అని తరచూ అనుకోవడం,నేను చేసే మంచి పనులు దత్తుని అనుగ్రహం కోసం అని భావన,చేయడం.తరచూ మహాత్ములను స్మరించడం ద్వారా వారు మనకన్నా ఎంత గొప్ప వారొ, మనం వారి ముందు ఎంత అల్పం నో తెలుస్తుంది.
ఈ దోషమును దత్తునికి శరణాగతి ద్వారా తొలగించుకోవాలి.
3️⃣ కమలాక్షుడు.
ఆర్థం
“కమలం” = సౌందర్యం, భోగం
మాయా ప్రపంచంలో కన్నులకు నచ్చేదే సత్యమని భావించడం
మనలో ఉన్న దోషం.
ఇంద్రియాసక్తి.
చూసినవి
అన్నీ కావాలి అనుకోవడం, భోగలాలస,దృష్టి ఎప్పుడూ బయట విషయాలపైనే ఉండడం.అసత్సంగం ని ఇష్ట పడటం,
మన కళ్ళు–మనస్సు ఎప్పుడూ మయా విషయాల వెంబడే పరుగెడితే — కమలాక్షుడు పని చేస్తున్నాడు అని.
కమలాక్షుడు → వైరాగ్యం ద్వారా తొలగించుకోవాలి.
కోరిక జనించగానే ఇది అవసరమా?మనకి అలవాటు నా?దాని పర్యవసానం ఏమిటి?అని ఆగి,వద్దు అని చెప్పెడం మనసుకి అలవాటు చేయాలి.దానితో మనకు ఉన్నదానితో తృప్తి అలవాటు అవుతుంది.
ఈ ముగ్గురు బయట శత్రువులు కాదు.మన అంతర్ శత్రువులు.
ఇవి తీవ్రంగా మన ఇంద్రియాలను లోబరుచుకొని తరచూ మన సాధనలలో అడ్డుపడుతుంటాయి. 'త్రిపుర+అంతకుడు' దత్తాత్రేయ స్వామి నే.
మనలోని మూడు స్థాయిలు:
త్రిపురం
మనలో
*స్థూల శరీరం*
-శరీరాసక్తి.
*సూక్ష్మ శరీరం*-
మనస్సు–బుద్ధి
*కారణ శరీరం*
-అహంకారం–అజ్ఞానం.
ఈ మూడు కలిసినప్పుడే మనలో అసుర స్వభావం ఎక్కువగా ఉంటుంది.
ఇదే దత్తాత్రేయ తత్త్వం.
🌼 దత్తాత్రేయ తత్త్వంలో (అవధూత దృష్టి)
దత్తాత్రేయుడు = గురు, జ్ఞానం, వైరాగ్యం, అనుభవం
త్రిపురాసురులు = ఈ మూడు శత్రువులు దత్త తత్త్వానికి విరుద్ధాలు.
1️⃣ విద్యున్మాలి → అస్థిర మనస్సు.నామధారకుని కథ.
దత్తుడు చెబుతాడు: “మనస్సే బంధం, ఈ మనస్సే ముక్తి”
మనస్సు చంచలంగా ఉంటే గురుకృప మనపై నిలవదు.ముందు దత్తుని నమ్మాలి అని.సిద్ధుడు చెప్తాడు.
జపం (నామస్మరణ)
గురు స్మరణ
ఏకాగ్రత
సద్గురువు వాక్యంపై నిలకడ వస్తే మనలో విద్యున్మాలి నశిస్తాడు.
2️⃣ తారకాక్షుడు → అహంకార బుద్ధి
“నేనే తెలుసుకున్నాను” అనే భావం.శాస్త్రం చదివినా వినయం లేకపోవడం
గురువును కూడా తర్కంతో కొలవడం.అదే త్రివిక్రమభారతి తో కలిసి శ్రీ గురుని కలిసిన వేద పoడితుల లీల.వేదం అంతా చదిమాము. మాకు అంతా తెలుసు.ఎదురు వారికి ఏమి తెలియదు అన్న భావన తో వేద పండితులు శ్రీ గురుని వద్దకు వస్తారు.
దత్త మార్గం:
శరణాగతి,“నేను కాదు, అన్ని నా గురువే” అనే భావం.
3️⃣ కమలాక్షుడు → ఇంద్రియ భోగాసక్తి.
రూపం, రసం, సుఖం వెంట పరిగెత్తడం.ఒక భక్తురాలికి అందరి ఇంటా భోజనం చేయాలని .సుఖంగా ఉండాలని తన భర్త తన మాట వినడం.లేదని దత్తుని ఆశ్రయించారు. దత్తుడు ఆమె కి లీల ద్వారా నిజం చూపించారు.
ఈ ముగ్గురు అసురులు
యోగ పరమం గా
మనలో
విద్యున్మాలి
-విక్షేపం,మనస్సు అశాంతికి కారణం.
తారకాక్షుడు-
అస్మిత,అహంకారంకి కారణం.
కమలాక్షుడు
రాగ,కోరికలు
ఇవి ఉన్నంతవరకూ సమాధి స్థితి మనకు అసలు రాదు.
🕉️ ఇడా + పింగళ + సుషుమ్న సమతుల్యం.
మూడు దోషాల సంహారం నే త్రిపుర సంహారం.
కాబట్టి
🔹 చంచల మనస్సును నిలకడగా చేయడం
🔹 అహంకారాన్ని గురుభక్తిగా మార్చడం
🔹 భోగాన్ని ఋణను బంధములు కాకుండా చూడడం సాధన తో చేయాలి.
ఇదే దత్త తత్త్వం.ఇదే అత్రి,అనసూయ తత్వం.వీరికి మాత్రమే దత్తుడు దత్తం అవుతారు.రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి. పద్మజ ప్రసాద్ బెతనభొట్ల.
.jpg)
No comments:
Post a Comment