ఒక్కొక్క రాశి వారు,
వారి రాశిని బట్టి ఇలా చేస్తే…
వారి కష్టాలన్నీ తొలగి అదృష్టం కలుగుతుంది.
జీవితంలో అనేక సమస్యలకు ఉపసమనం దొరుకుతుంది. అసలు ఏ రాశి వారు ఏమి చెయ్యాలి..
మేషము-
ఈ రాశి వారు తాంబూలంలో మావిడి పండు పెట్టి మంగళవారం, కుమార స్వామికి సమర్పిస్తే మంచిది.
వృషభము-
తమలపాకు లో మిరియాలు ఉంచి,
మంగళవారం రాహుని పూజిస్తే కష్టాలు తొలిగిపోతాయి.
మిథునము-
ఈ రాశి వారు తాంబూలంలో అరటిపండు పెట్టి, బుధవారం నాడు ఇష్టదేవతను పూజించాలి.
కర్కాటకము-
ఈ రాశి వారు తాంబూలంలో దానిమ్మని ఉంచి,
శుక్రవారం నాడు కాళికా దేవిని పూజించాలి.
సింహరాశి-
ఈ రాశి వారు తాంబూలంలో అరటిపండు ఉంచి గురువారం నాడు ఇష్టదేవతను పూజించాలి.
కన్యారాశి-
తమలపాకులో మిరియాలు ఉంచి,
గురువారం ఇష్టదేవతను పూజిస్తే, అంతా మంచి జరుగుతుంది.
తులారాశి-
ఈ రాశి వారు తమలపాకులో లవంగాలు ఉంచి, శుక్రవారం నాడు ఇష్టదేవతను పూజించాలి.
వృశ్చిక రాశి-
ఈ రాశివారు తమలపాకులో కర్జూరం ఉంచి, మంగళవారం నాడు ఇష్ట దైవాన్ని పూజిస్తే మంచిది.
ధనుస్సు-
ఈ రాశి వారు తమలపాకులో, కలకండా ఉంచి, గురువారంనాడు ఇష్ట దేవతను పూజిస్తే అంతా
మంచి జరుగుతుంది.
మకరరాశి-
వీరు తమలపాకులో బెల్లం ఉంచి,
శనివారం కాలికామాతను పూజిస్తే మంచిది.
కుంభ రాశి-
ఈ రాశి వారు తమలపాకులో నెయ్యి ఉంచి,
శుక్రవారం నాడు కాళికామాతని పూజించినట్టైతే
మంచి జరుగుతుంది.
మీన రాశి –
ఈ రాశివారు తమలపాకులో పంచదార ఉంచి,
ఆదివారం నాడు ఇష్ట దైవాన్ని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది.
ఇలా అన్ని రాశులవారు ..
వారికీ సూచించినట్టు చేస్తే అంతా మంచి జరిగి,
సకల సంపదలు..కలుగుతాయి.
ఓం నమః శివాయ..!!
సర్వే జనా సుఖినోభవంతు..!!
.jpg)
No comments:
Post a Comment