దైవ దర్శనం కోసం గుడికి వెళ్లినప్పుడల్లా బయటకు వచ్చి గుడి మెట్లపై లేదా గుడి ఆవరణ లో కూర్చోవాలని పెద్దలు చెబుతారు. ఈ సంప్రదాయానికి ఒక ప్రత్యేక కారణం ఉంది.
ఈ రోజుల్లో ప్రజలు గుడి మెట్లపై కూర్చుని వ్యాపారాలు, రాజకీయాలు ఊరి విషయాలు పక్కింటి వారు ఎదురింటి వారి గురించి మాట్లాడుకొంటున్నారు అది మంచి సాంప్రదాయం కాదుకూడా.
దైవ దర్శనం తరువాత ఆలయ ఆవరణలో కూర్చుని భగవంతుని పై విశ్వాసం తో చేసే అతి ప్రాచీన ప్రార్ధన వలన అయితే ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంది.
ఈ శ్లోకం ఇలా ఉంది
"అనాయాసేన మరణమ్,
వినా దైన్యేన జీవనమ్।
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహి మే పరమేశ్వరా "
శ్లోకం యొక్క అర్థం:-
అనాయాసేన మరణం అనగా నొప్పి లేని మరణం కావాలి, అంటే అనారోగ్యంతో మంచం మీద బాధపడాల్సిన అవసరం లేని మరణము
వినా దైన్యేన జీవనం అనగా తన జీవితం లో ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన నిస్సహాయత రాకుండా చూడమని కోరడం
దేహాంతే తవ సానిధ్యం అనగా మరణం వచ్చినప్పుడు భగవంతుని రూపము గుర్తుండాలి భగవంతుని నామమే స్మరణకు రావాలని భగవంతుని పాదాల చెంతచేరాలని.
దేహి మే పరమేశ్వరం ఓ దేవా, మాకు అలాంటి వరాన్ని ప్రసాదించండి అని కోరడం.
*దైవ దర్శనం కోసం గుడికి వెళ్లినప్పుడు దేవుడిని రెండు కళ్ళతో స్వామి పాదాలు శరీరం అలంకరణ ముఖము పూర్తి రూపాన్ని దర్శించుకోవాలి ఆస్వాదించాలి .
*బయటకు వచ్చిన తర్వాత, మీరు మెట్లపై కూర్చుని భవంతుని గురించి ధ్యానం చేస్తూ మీ కళ్ళు మూసుకున్నప్పుడు మీరు దర్శనం చేసిన రూపమే సాక్షాత్కరించాలి.
ఇంత గొప్ప ప్రయోజనాన్ని అందరూ పొందాలని ఆశిద్దాం.
✍🏻🚩 *సుధాకర్ నాంబేటి సర్వే జనాః సుఖినోభవంతు గ్రూపు అడ్మిన్* 🚩
.jpg)
No comments:
Post a Comment