Thursday, February 6, 2020

మంత్రజపం ముఖ్యం అయినప్పుడు అంగన్యాస, కరన్యాసాలు అవసరమా?

ప్రశ్న : మంత్రజపం ముఖ్యం అయినప్పుడు అంగన్యాస, కరన్యాసాలు  అవసరమా?
న్యాసం అంటే శుద్ధి చేసుకోవడం, తనను తాను పవిత్రం చేసుకోవడం. “మననాత్ త్రాయతే ఇతి మంత్రః” – మననం చేసిన వాడిని రక్షించునది మంత్రం. ప్రతీ మహా మంత్రానికి ఆ మంత్రాన్ని దర్శించిన దార్శనిక ఋషి ముఖ్యుడు. ఆయన సూత్రీకరించిన ఛందస్సు తో పాటు ఎలా ఆ మంత్రాన్ని జపిస్తే ఉత్తమోత్తమ ఫలితం లభిస్తుందో ఆయన నిర్దేశిస్తారు. ఎలా అయితే పాలు కాచేముందు ఆ పాత్రను శుద్ధి చేసుకుంటామో అలాగే మన శరీరాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. సరైన పద్ధతిలో ఆ మంత్రాన్ని మననం చెయ్యని యెడల ఆ జప ఫలితం లభించదు. వైదిక, తాంత్రిక పద్ధతులలో ఈ న్యాసం ముఖ్యమైన భాగము.అనేక రకాల న్యాసములు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా1 షడంగన్యాసము – వివిధ అంగాలలో వివిధ దేవతలను ఆవాహన చేసుకుని ఈ దేహాన్నే దేవాలయంగా మార్చుకోవడం2. ఋషి న్యాసము – గురు పరంపరగా చెప్పిన న్యాస విధానము3. కరన్యాసము – చేతులలో, చేతి వేళ్ళలో వివిధ ఆవాహనాలు చెయ్యడం.4. మాత్రికన్యాసము – సంస్కృతంలో ఉన్న 50 బీజాక్షరాలను వివిధ భాగాలలో ప్రతిష్టించుకోవడం.లు ప్రముఖములు. ఇవి కాక మహా షోడశ న్యాస విధానంలో అయితే వివిధ గ్రహాలను, ప్రసిద్ధ క్షేత్రాలను, అమ్మవారి పేరున వివిధ అంగాలలో ఆవాహన చేసుకోవడం లాంటి ఎన్నో రహస్య విధులు శ్రీవిద్య ఉపాసకులకు కరతలామలకం.
"నా రుద్రో రుద్ర మర్చయేత్" - రుద్రాంశను తనయందు నింపుకుని (లఘున్యాసము లేదా మహాన్యాసము ద్వారా) మాత్రమే రుద్రుని అర్చించవలెను అని శాస్త్రం ఘోషిస్తోంది. సాధకుడు తాను ఎవరిని ఉద్దేశించి సాధన చేస్తున్నాడో ఆ దేవత తానే అయి ఆ దేవతను అర్చిస్తున్నాడు. ఈ కర్మవిభాగము చెయ్యగా చెయ్యగా తానే ఆ పరబ్రహ్మ అన్న విషయం రూడి అవుతుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పారు. అత్యంత భక్తి శ్రద్ధలతో సాధన చేసి భ్రమరకీటక న్యాయ పరంగా ఎవరిని ఉపాసన చేస్తున్నాడో అదే తాను అవుతున్నాడు.
మంత్రం ఒక అస్త్రం (నేటి పరిభాషలో బులెట్ ) అయితే ఆ న్యాస విధులు ధనస్సును లాగి పెట్టి వదలడం లాంటిది. ( గన్ లో లోడ్ చేసి ట్రిగ్గర్ నొక్కడం లాంటిది ). ఆ బులెట్ కు అంత సామర్ధ్యం ఉన్నా మామూలుగా ఒక వస్తువు మీదకు చేతితో విసిరితే ఉండే ఇంపాక్ట్ కు ట్రిగ్గర్ నొక్కడం వల్ల వచ్చిన impact కు ఎలా తేడా వుంటుందో మామూలుగా చేసే మంత్రజపానికి అంగన్యాస కరన్యాస ఇత్యాది న్యాసాలతో చేసిన మంత్రం ప్రయోగానికి అంత తేడా వుంటుంది. మనకు నిర్దేశించిన ప్రతీ పద్ధతికి ఒక నిర్దుష్టమైన ప్రయోజనం తత్సంబంధమైన ఫలితం చెప్పబడి వుంది. సద్గురువులను ఆశ్రయించి సరైన విధానం నేర్చుకుని సాధన చేసి ప్రయత్నిస్తే ఆ మంత్రం తప్పక అద్భుతమైన ఫలితాలను చూపుతుంది. ఈ సత్యాన్ని దర్శించి సాధించిన ఎందరో మహానుభావులకు పాదాభివందనాలు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS