తోటకాష్టకం
ఆది శంకరాచార్యుల వారి ముఖ్య శిష్యుల లో ఒకరు , గురువైన శంకరాచార్యుల వారిని స్తుతిస్తూ 8 శ్లోకములు కఠినమైన పదములతో అధ్బుతముగా రచించారు . అందులో ఆయన 4 పాదములు , ఒక్కొక్క పాదములో 12 అక్షరములు ( 4×12 అనే ఛందస్సు ) ఉండేడట్టు రచించారు . ఈ విధానమును సంస్కృతం లో తోటక అంటారు . అందువలన ఆ శిష్యుడు తోటకాచార్య అనే పేరుతో పిలవబడుతున్నాడు , ఈ అష్టకము తోటకాష్టకము అనే పేరుతో విలసిల్లుతున్నది .
1 . శ్లోకం
తెలుగు లిప్యాంతీకరణ ;
విధితాఖిలశాస్త్రసుధాజలధే
మహితోపనిషత్ కతితార్థనిధే
హృదయే కమలే విమలమ్ చరణం
భవ శంకర దేశిక మే చరణం ||
అర్థములు ;
విదిత = జ్ఞానం కలిగినవారు ; అఖిల = విశ్వం అంతా ; శాస్త్ర = శాస్త్రములు ; సూధాజలధి = సుధా + జలధి = పాలు + సముద్రం , పాల సముద్రం ; మహిత = గొప్పవి , పూజ్యమైన ; ఉపనిషత్ = ఉపనిషత్తులు ; కథితార్థ = కథిత + అర్థ = వివరించుట + అర్థం = అర్థం వివరించుట ; హృదయే = హృదయం లో ; కలయే = నిలిపుకొనుట ; విమలమ్ = మచ్ఛ లేని ; చరణం = పాదములు ; భవ = ఉద్ధరించుట ; శంకర = శంకర భగవత్పాదులు ; దేశిక = వేదాంత గురువు ; శరణం = సంరక్షించుట ;
తాత్పర్యం ;
విశ్వం అంతా నిండి ఉన్న వేదాంతముల యొక్క పాలసముద్రం అంత జ్ఞానం కలిగిన వారు ; పూజ్యమైనవి , గొప్పవి ఐన ఉపనిషత్తుల అర్థం వివరించ కలిగిన జ్ఞానం కలిగిన వారు ; మీ మచ్చ లేని పాదములను నా హృ- దయములో నిలుపుకున్నాను .
ఓ వేదాంత గురువైన శంకరా , నన్ను సంరక్షించి , ఉద్ధరించుము .
2 . శ్లోకం
తెలుగు లిప్యాంతీకరణ ;
కరుణావరుణాలయ పాలయ మామ్
భవసాగరదు:ఖవిదూనహృదమ్
రచయాఖిలదర్శనతత్వవిదం
భవ శంకర దేశిక మే శరణం ||
అర్థములు ;
కరుణా = దయ ; వరుణాలయ = వరుణా + లయ = వరుణ దేవుడు ( జలం ) + నివసించుట = జలం నివసించే ప్రదేశం = సముద్రం , చెరువు , నది ( ఈ శ్లోకం లో మహా సముద్రం) ; పాలయ = రక్షించు; మామ్ = నన్ను ; భవసాగర = భవ + సాగర = సృష్టి + సముద్రం = సృష్టి యొక్క సముద్రం ; దు:ఖ = బాధలు ; విదూన = వేదించుట ; హృదమ్ = మనసు ; రచయ = సత్యములు ; అఖిల = మొత్తం ; దర్శన = తెలుసుకొనుట , అర్థం చేసుకొనుట ; తత్వవిదం = తత్వములు
తాత్పర్యం ;
ఓ దయాసముద్రుడా ( కరుణవరుణాలయ) , సృష్టి యొక్క సముద్రములోని భాధల వల్ల నా మనస్సు పడుతున్న వేదనల నుండి నన్ను రక్షింపుము . అన్ని( మొత్తం ) తత్త్వముల లోని సత్యములను బోధింపుము .
ఓ వేదాంత గురువైన శంకరా , నన్ను సంరక్షించి , ఉద్ధరించుము .
3 శ్లోకం
తెలుగు లిప్యాంతీకరణ ;
భవతా జనతా సుహితా భవితా
నిజబోధవిచారణ చారుమతే
కలయేశ్వరజీవవివేకవిదం
భవ శంకర దేశిక మే శరణం ||
అర్థములు ;
భవతా జనతా ( ప్రజలు ) సుహితా ( సంతోషము ) భవితా = మీవల్ల ప్రజలు సంతోషం గా ఉన్నారు ; నిజబోధ = పుట్టుకతో వచ్చిన జ్ఞానం ; విచారణ = వివరించుట ; చారుమతే = నైపుణ్యం కలిగినవారు ;
కలయ = అవగాహన చేసుకొనుట ; ఈశ్వర = భగవంతుడు ; జీవ = ఆత్మ ; వివేక = వివేకం ; విదం = తెలుసుకొనుట ;
తాత్పర్యం ;
మీరు ప్రజలను సంతోష పెట్టారు . మీరు పుట్టుకతో జ్ఞానం కలిగి , ఆ జ్ఞానాని వివరించగలిగే కలిగిన గొప్ప మానసిక సామర్ధ్యం కలిగినవారు . నాకు భగవంతుని గురించి , ఆత్మ గురుంచి తెలుసుకునే వివేకం ప్రసాదించండి .
ఓ వేదాంత గురువైన శంకరా , నన్ను సంరక్షించి , ఉద్ధరించుము .
4 శ్లోకం
తెలుగు లిప్యాంతీకరణ ;
భవ ఏవ భవానితి మే నితరామ్
సమజాయతి చేతసి కౌతికిత
మమ వారాయ మోహ మహాజలధిమ్
భవ శంకర దేశిక మే శరణం ||
అర్థములు ;
భవ ఏవ భవానితి ( భగవంతుడు ) మే నితరామ్ (నిశ్చయముగా) = నిశ్చయముగా నీవు భగవంతుడవు అని తెలుసుకొనుట ; సమజాయత = తగిన ఉత్సుకత , ఆనందం ; చేతసి = మనస్సు ; కౌతికిత = ఉవ్విళ్లూరుట ; మమ = నన్ను ; వారయ = రక్షించుట ; మోహ = బంధములు ; మహాజలధిమ్ = మహా + జలధి = మహా + సముద్రం = మహా సముద్రం ;
తాత్పర్యం ;
నిశ్చయముగా నీవు భగవంతుడువని తెలుసుకొని , నా మనస్సు ఆనందముతో ఉవ్విళ్లూరుతున్నది ; నన్ను మాయ మోహ భంధముల కలిగిన మహా సముద్రము నుండి రక్షించండి .
ఓ వేదాంత గురువైన శంకరా , నన్ను సంరక్షించి , ఉద్ధరించుము .
5 . శ్లోకం
తెలుగు లిప్యాంతీకరణ ;
సుకృతే’ధికృతే బహుధా భవతొ
భవితా సమదర్శనలాలసతా
అతిదీనంమిమమ్ పరిపాలయ మామ్
భవ శంకర దేశిక మే శరణం ||
అర్థములు ;
సుకృతే = పుణ్యమైన , ధర్మమైన ; అధికృతే = చేసి , జరిపించి ; బహుధా = ఎక్కువ , చాలా ; సమదర్శన = అన్నివైపుల సమానముగా ; లాలసత = కోరిక ; అతిదీనం = ఎక్కువ దీనమైన ; ఇమమ్ = ఈ ; పరిపాలయ = రక్షించు ; మాం = నన్ను ;
తాత్పర్యం ;
అన్ని పుణ్య కార్యములు అన్ని వైపులా సమానముగా ఎక్కువగా జరిపించి నిన్ను తెలుకోవాలనే కోరిక కలిగింది . అతి దీనమైన నన్ను రక్షించు .
ఓ వేదాంత గురువైన శంకరా , నన్ను సంరక్షించి , ఉద్ధరించుము .
6 .శ్లోకం
తెలుగు లిప్యాంతీకరణ ;
జగతీమవితుమ్ కలితాకృతాయో
విచరన్తి మహామహసచ్చలత:
అహిమంశురివాత్ర విభాసి గురో
భవ శంకర దేశిక మే శరణం ||
అర్థములు ;
జగతి = ప్రపంచం ; అవిత = రక్షించుట ; కలిత = రూపము ; కృతయా= దాల్చి ; విచరన్తి = సంచరించు ; మహామహ = వెలుగు ; సచ్చలత: =అనుసరించేవాడు ; అహిమాంశురి = సూర్యుడు ; వాత్ర = కాంతి ప్రసరణ ; విభాసి = సర్వశక్తి గల ; గురు = గురువు ;
తాత్పర్యం ;
ఓ గురువ , మీరు ప్రపంచమును రక్షించుటకు వివిధ రూపములను దాల్చి సంచరిస్తు వెలుగు పంచుతున్నారు . మీరు సూర్యుని లాగా కాంతి ప్రసరిస్తున్నారు . మీరే సర్వశక్తిగల గురువు .
ఓ వేదాంత గురువైన శంకరా , నన్ను సంరక్షించి , ఉద్ధరించుము .
7 . శ్లోకం
తెలుగు లిప్యాంతీకరణ ;
గురుపుంగవ పుంగవకేతన తే
సమతామయతాం నహి కో’పి సుధీ:
శరణాగతవత్సల తత్వనిధే
భవ శంకర దేశిక మే శరణం ||
అర్థములు ;
గురుపుంగవ = అతి గొప్ప గురువు ; పుంగవకేతు = పుంగవ + కేతు = ఋషభం ( ఎద్దు ) + జండా = ఋషభం గుర్తు కలిగిన జండా ; సమతామాయతాం = సమానముగా ఉండుట ; నహి = లేదు ; కోపి = ఎవరు ; సుధీ: = తెలివైన వ్యక్తి ; శరనాగతవత్సల = శరణాగత + వత్సల = శరణాగతులు + దయ = శరణాగతులపై దయచూపుట ; తత్వనిధి = తత్వ+ నిధి = తత్వం యొక్క నిధి ;
తాత్పర్యం ;
ఓ గురువా , మీరు అతి గొప్ప గురువు , ఋషభం ఉన్న జండా కలిగిన వారు , మీతో సమానమైన తెలివిగల వ్యక్తి ఎవరు లేరు , మీరు శ రణార్థులపై ఎక్కువ దయ చూపిస్తారు , మీరే తత్వము యొక్క నిధి .
ఓ వేదాంత గురువైన శంకరా , నన్ను సంరక్షించి , ఉద్ధరించుము .
8 . శ్లోకం
తెలుగు లిప్యాంతీకరణ ;
విదితా న మయా విశదైకకలా
న త కించన కాంచనమస్తి గురో
ధృతమేవ విధేహి కృపామ్ సహజామ్
భవ శంకర దేశిక మే శరణం ||
అర్థములు ;
విదితా = అర్థమగుట ; న = లేదు , కాదు , వద్దు ; మయా = నాకు ; విశద = శాఖ ; యేక = ఒకటి ; కలా = జ్ఞానం ; న = లేదు ; చ = కూడా ; కించన = కొద్దిగా ; కాంచన = ఐశ్వర్యం ; మస్తి =కలిగి ఉండుట ; గురో = ఓ గురువా ; దృత( తొందరగా ) మేవ = నా మీద తొందరగా ; విధేహి = చూపించు ; కృపామ్ = దయ ; సహజం = సహజమైన ;
తాత్పర్యం ;
నాకు జ్ఞానం యొక్క ఏ ఒక్క శాఖ అర్థం అవడం లేదు . నాకు కొద్దిగా కూడా ఐశ్వర్యం ( ఆశ ) లేదు . ఓ గురువా , నా మీద నీ సహజమైన దయ తొందరగా కురుపించు ( చూపించు ) .
ఓ వేదాంత గురువైన శంకరా , నన్ను సంరక్షించి , ఉద్ధరించుము
.
No comments:
Post a Comment