*జపం - తీసుకోవాల్సిన జాగ్రత్తలు:-*
👉 జపం చేయడానికి ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలి .. జపానికి గానీ ధ్యానానికి గాని కూర్చునే ముందు గదిని ఉప్పు నీటితో గది అంతా చల్లాలి . ఎందుకు అలా అంటే మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని నశించును .
👉 జపానికి కూర్చునే ముందు తప్పకుండా ఉచితాసనం ఏర్పాటు చేయాలి . లేదా కనీసం దర్భచాప ఉండాలి.
👉 సాధన చేసే వారు తూర్పు ముఖంగా కానీ , ఉత్తర ముఖంగా గానీ లేదా ఏ ఏ దేవత ఉపాసన జపం చేస్తున్నారో ఆయ దేవత జపాలకు ఏ దిక్కున కూర్చుని చేయాలో తెలుసుకుని జపం చేయండి.
👉 జపానికి గానీ ధ్యానం చేయడానికి గానీ బ్రాహ్మీముహూర్తంలో , ఉదయ సాయం సంధ్యలో క్రమం తప్పకుండా చేయాలి .
👉 జపానికి కూర్చునే ముందు ఒక పంచ పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకొని అనుకున్న జపం అంటే 108 , 1008 , అంత కంటే ఎక్కువ సంఖ్యలో జపం పూర్తై అయితే , ఈ నీళ్ళలో కుడిచేయి ఉంగరపు వేలిని 5 నిమిషాల పాటు అలాగే ఉంచి, అప్పుడు ఆ నిటిని సేవించాలి . ఈ పంచపాత్రను ఖాళీ నేలమీద ఉంచకూడదు . కనీసం ఒక తెల్ల బట్టపై ఉంచాలి .
👉 మానసిక జపం చాలా మంచిది !! తొందరగా మంత్ర సిద్ధి అవుతుంది .
👉 జపోచ్చారణలో ( జపం ఉచ్చరించే ) మంత్రం యొక్క బీజాక్షరములు లోపించకూడదు . అలా లోపించిన మంత్రం జప సిద్ది కలగదు .
👉 జప సాధనకి గానీ ధ్యానానికి గాని యోగ విద్య సాధన చేసే వారు తప్పకుండా క్రమం తప్పకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి . జంతు బలులు , చిన్న చీమను కాపాడి అమ్మవారికి ప్రీతి కరం అనే సాకుతో కోళ్ళను , మేకను బలులు ఇవ్వకూడదు ..
👉 మధ్యం సేవించడం , మాంసం తినడం , ఇష్టం వచ్చినట్టు తినడం , పాన్ పరాకులు , గుట్కా , కైనీ , తంబాకు , గంజాయీ లాంటి మత్తు పదార్థాలు ఏ మాత్రం తీసుకోకూడదు .
👉 ప్రతీ రోజూ ధ్యానం , వ్యాయామం , సూర్య నమస్కారం , ప్రాణాయామం , మంత్రంతో ప్రాణాయామం క్రమం తప్పకుండా ఒకే సమయంలో ఒకే చోట చేయడం అలవాటు చేసుకోవాలి ..
👉 మానసిక జపానికి కాల నియమం లేదు . సాధకులకు అనుకూలతను బట్టి సర్వకాల సర్వావస్థల యందు మానసిక జపం చేయవచ్చు .
👉 ఫర స్ర్తీలను వశం చేసుకోవడానికి , ఎదుటి వారిని హించలకు గురి చేసి ధనాన్ని సంపాదించడానికి , విపరీతమైన కామంతో , మంత్ర తంత్రాలతో లోకకల్యాణం కోసం కాకుండా దౌర్జన్యం కోసం , స్వార్ధ ప్రయోజనాల కోసం , ఎదుటివారిని లొంగ తీసుకోవడం కోసం జపం గానీ ధ్యానం గానీ ఏ మాత్రం చేయకూడదు అలా చేస్తే ఆయా దేవతల ఆగ్రహం తప్పకుండా ఉంటుంది , వారి కుటుంబం నాశనం అవుతుంది. ఇతరుల పాపపు కర్మలు , కర్మవాసనలు , కర్మఫలాన్ని మనం అనుభవించే అవకాశం ఉంది .
👉 జపం చేసే మాలను మంచి నీటిలో కడిగి , కాచని పాలలో శుబ్రపరిచి , తర్వాత గంథమున్న నీటీలో గానీ , గంగా నీటిలో గానీ జపమాలను శుద్ధి చేసుకోవాలి రోజూ .
👉 జపానికి ఉపయోగించే మాలను కంఠమాలగా ఉపయోగించరాదు . జప మాలను కింద ( నేల మీద ) ఉంచరాదు .
👉 జప మాల ఎడమ చేతీకి గానీ , పాదాలకు గానీ తగలకూడదు .
👉 జపమాల త్రిప్పేటప్పుడు అది బొడ్డు కిందకు జారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి .
👉 జపం చేసే సమయంలో జప మాలను ఎవరూ చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి .
👉 మాలలోని పూసలను తిప్పడానికి కుడిచేతి బొటన వేలును , మధ్య వేలును ఉపయోగించాలి . చూపుడు వేలు ఉపయోగించకూడదు .
👉 మేరు పూసను దాటి జపించరాదు .
👉 జపమాల యందు పూసల సంఖ్య 108 గానీ , 54 గానీ , 27 గానీ ఉండాలి .
👉 జప మాలలు బంగారం తో గాని , వెండితో గానీ , కనీసం రాగితో అయినా ఉండాలి . అంటే పూసలకు లోహం తో లింకు ఉండాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి .
👉 ఏ ఏ దేవతలను ఉపాసన చేస్తున్నారో , ఆయా దేవతలకు ఆయా జప మాలలు ఉంటాయి అని గమనించండి . ఉదాహరణకు విష్ణువు కీ తులసి మాల , శివుడికి రుద్రిక్ష మాల ... వగైరా ..
👉 మీరు ఏ దేవతను ఉపాసన చేస్తున్నారో ఆయా దేవతలకు ప్రీతికరమైన ఆహారం ముందుగా ఆ దేవతలకు నైవేద్యం సమర్పించి ఆ తర్వాత భుజించడం మంచిది . ప్రీతి కరం కానీ ఆహారం తీసుకోకూడదు .
👉 ఏదైనా దేవత ఉపాసన దీక్షగా సాధన చేసే వారు ఆ దీక్షా సమయంలో క్షౌరము చేసుకోరాదు .
👉 ఏక భుక్తం పాటించాలి అంటే ఒకటే పూట భోజనం చేయాలి . ఫలాహారం ఎంతో మంచిది . ఉప్పూ , కారం , ఆయిల్ వంటి గాటైన పదార్థాలు తీసుకోకూడదు .
👉 మానసిక శారీరక బ్రహ్మచర్యం పాటించాలి . పర స్త్రీ తో అక్రమ సంబంధం ఉండకూడదు . ఏ స్ర్తీని కామ భావంతో వక్ర దృష్టితో చూడకూడదు .
👉 దీక్షా సమయంలో , సాధన కొనసాగుతున్న కాలంలో తప్పకుండా సాధకుడు యమ , నియమాలు , అంటే సత్యం పలకడం , దేహమును పరి శుభ్రత కలిగి ఉంచడం , అందరి పట్ల ప్రేమను కలిగి ఉంచడం , ఆనందం , ముఖ్యంగా ఉపాసన చేస్తున్న దేవత పై మీ అహంకారాన్ని , మీ అవలక్షణాలను ఆ దేవతకు బలి ఇచ్చి పూర్తి స్థాయిలో మిమ్మల్ని మీరు ఆ దేవతకు అంకితం అవుతే తప్ప ఆ దేవత యొక్క సాక్షాత్కారం లభించదు ..
👉 ఓ చిన్న చిమను కాపాడి ఓ కోడిని బలి ఇవ్వడం , గురువారం ఆలయం లో పది మందికి అన్నదానం చేసి రియల్ ఎస్టేట్ లో భూ కబ్జా చేయడం , మీ మీ అభిప్రాయాలకు అందరూ నిలబడి ఉండాలని , మి నమ్మకాలను అభిప్రాయాలను ఎదుటి వారిపై బలవంతంగా రుద్దడం , దౌర్జన్యం చేయడం , లంచకొండి తనం , ఎదుటి వారి వ్యక్తిగత విషయాల్లో చొరవ చేసి వారిని బ్లాక్మెయిల్ చేయడం లాంటి లక్షణాలు గలిగిన సాధకులకు ఎలాంటి దేవత అయిన అనుగ్రహం కలుగదు .. కనిసం కలలో కూడా ఆ దేవత కనిపించదు . పైగా ఆ దేవత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది .
👉 సాధనా కాలంలో ఆ సాధకుడు రక్త దానం చేయకూడదు .. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది .
👉 పనీ పాటా లేకుండా .. బాధ్యత లేకుండా .. నా వల్ల కాదు .. నాకు చేతకాదు .. నేను సోంబేరిని .. అంటూ మీ మీ బాధ్యతలను వదిలి దూరంగా నేను జపం చేస్తూ ఉంటా అమ్మా అంతే నీదే .. నువ్వే నాకు దిక్కు ... తొందరగా నీ దర్శనం ఇవ్వు తల్లీ అంటూ ఎంత మొత్తుకున్నా ఆవిడ నీ కనుచూపు మేరలో కూడా ఉండదు .. నువ్వు నిర్వహించే బాధ్యత ను వదిలి .. భార్య పిల్లలను , నీ తల్లి తండ్రులను చూసుకోకుండా , నీ ఉద్యోగం యొక్క బాధ్యత ను కూడా సరిగా నిర్వహించకుండా అంతా నీదే భారం .. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనే సాకుతో చేసే ఎటువంటి సాధన గానీ ధ్యానం గానీ సిద్దించవు ..
👉 మనసా వాచా కర్మణా చిత్త శుద్ధి లేకుండా చేసే ఏ కర్మ నిన్ను మోక్ష మార్గాన్ని చూపవు మనసులో ఓ మాట బయటకు ఓ మాట ఇలాంటి లక్షణాలు కలిగిన సాధకులు యోగ బ్రస్టత్వం పొంది పిశాచ పీడలతో వారి ఉనికిని కోల్పోతారు .
👉 *నోట్:-* ఇలాంటివి ఎన్నో ఉన్నాయి .. .. మళ్లీ పోస్ట్ చేస్తాను .
No comments:
Post a Comment