Tuesday, August 25, 2020

నమస్కారాలు ఇలా చేయండి

_*🙏🏻నమస్కారాలు ఇలా చేయండి🙏🏻*_

(1) తల్లి కి మరియు తల్లి తో సమానమైన వారికి... అలాగే అమ్మ వారులకు " *ఉదరం పై రెండు చేతులు* జోడించి నమస్కారం పెట్టాలి....

(2) తండ్రికి, పాలకులకు అలాగే యోగులకు  *హృదయం పై* రెండు చేతులు జోడించి నమస్కారం చేయవలెను......

(3) గురువులకు బ్రహ్మర్షులకు వేద పండిత ఘనాపాఠీలకు, పీఠాదిపతులకు " *నోటి దగ్గర అంటే మాట బయటికి వచ్చే రెండు బ్రొటన వేళ్ళు కలిసి ఉండే విధంగా* " రెండు చేతులు ఉంచి నమస్కారం చేయవలెను....

(4) ప్రణవ పఠనం,బ్రహ్మ దేవుడు బ్రహ్మర్షులు, నదులు సముద్రం దగ్గర.. *భృకుటి పై రెండు చేతులు జోడించి* నమస్కారం చేయవలెను..

(5) గణపతి తో పాటు దేవతలు, సూర్యాది నవగ్రహాలకు, ఇంద్రాది అష్ట దిక్పాలకుల కు 
 *శిరస్సు పై రెండు చేతులు తగులుతున్నట్టుగా ఉంచి " శిరస్సు వంచి* నమస్కరం చేయవలెను.....

(6) హరి హరులకు
 *12 అంగుళాల ఎత్తులో రెండు చేతులు జోడించి శిరస్సు వంచి* నమస్కరం చేయాలి......

ఇవి *షష్ట్య నమస్కారాలు* .... అని తెలియజేస్తుంది శాస్త్రం....

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS