Tuesday, November 10, 2020

కాలభైరవ ముఖ్య 10 ఉపాలయాలు:కాల భైరవ ఆరాధన

 కాలభైరవ ముఖ్య  10  ఉపాలయాలు 

                       :కాల భైరవ ఆరాధన     1).   రాజమండ్రి:- రాజమండ్రిలో కోటిలింగాల ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయము నందు వెనుక వైపు ఈశాన్యములో, దక్షిణ ముఖముగా కాలభైరవ స్వామి చతుర్భుజుడై సుందరముగా దర్శనమిస్తాడు.   గోదావరి నది ఒడ్డున స్వర్ణాకర్షణ భైరవ స్వామి, ఈ మధ్యనే ఈ ఆలయం ప్రతిష్టించబడినది.    2).   మూలపేట:-    నెల్లూరులో మూలపేట మూలస్థానేశ్వర ఆలయమునందు, అనేక ఉపాలయాలలో  ఒకటైన కాలభైరవ స్వామి ఆలయం ఒకటి.      3).  చేబ్రోలు:-  గుంటూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో, ఉన్న చేబ్రోలు 101 దేవాలయాలు, 101 బావులు ఉన్నట్లుగా కీర్తిగాంచిన చేబ్రోలులో వీరభద్ర స్వామి ఆలయం పక్కనే, ఆరుబయట కాలభైరవ స్వామి విగ్రహం, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, నేటికి నిలిచి దర్శనమిస్తుంది.    4).    సామర్లకోట:-   తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ 11 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 48 కిలోమీటర్ల దూరంలో, కుమార రామ భీమేశ్వరాలయం ఈశాన్య భాగంలో, కాల భైరవ స్వామి ఆలయం తూర్పుముఖముగా నిలువెత్తుగా ఉంటుంది.   5).   పెదకళ్లేపల్లి:-   కృష్ణాజిల్లాలో మచిలీపట్నం నుండి మోపిదేవి మీదగా 35 కిలోమీటర్ల దూరంలో,  దుర్గా నాగేశ్వరస్వామి ప్రధాన ఆలయం, అనేక ఉపాలయాలలో కాల భైరవస్వామి ఆలయం అత్యంత సుందరం.    6).   మురముళ్ళ:-   కాకినాడ నుండి 30 కిలోమీటర్ల దూరం, రాజమండ్రి నుండి 85 కిలో మీటర్ల దూరం,  వీరేశ్వర స్వామి ఆలయంలో,  వీరభద్ర స్వామి వారు లింగరూపంలో ఉంటారు.   ప్రతిదినం కళ్యాణోత్సవం జరగటం చాలా విశేషం.   వివాహం కానివారు స్వామి కళ్యాణం చేయిస్తే, వెంటనే వివాహం జరుగుతుంది.   ప్రధానాలయం యొక్క ముఖమండపంలో దక్షిణ గోడకు 5 అడుగుల ఎత్తుగల కాలభైరవ మూర్తికి,  అభిషేకమునకు ముందు తర్వాత కూడా ఈ స్వామిని దర్శిస్తారు.     7).     ద్రాక్షారామం:- రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో,  ద్రాక్షారామం క్షేత్రము నందు ప్రధాన భీమేశ్వరాలయమునకు ఈశాన్య దిశలో,  దక్షిణ ముఖంగా కాలభైరవ స్వామి 8 అడుగుల ఎత్తు కలిగి ఉంటాడు.  చతుర్భుజాలతో ఎడమవైపున శునకం ఉంటుంది.   ఆలయ విమానం మూడు వైపులా భైరవలు ఉన్నారు.   ఆలయమునకు ముందు భాగంలో, ఆరుబయట అష్ట భైరవులులకు సంకేతముగా, 8 శివలింగాలు ఉన్నాయి.     8).    హటకేశ్వరం:-   కర్నూలు జిల్లాలో శ్రీశైలం నుండి 5 కిలోమీటర్ల దూరంలో, హటకేశ్వరం క్షేత్రాల్లో హటకేశ్వరాలయం ఎదురుగా, జువ్వి- ఉసిరిక కలిసిఉన్న పెద్ద వృక్షం క్రింద, కామితార్థ ప్రదుడైన కపాల భైరవ విగ్రహం ఉన్నది.    9).  పొన్నూరు:-    గుంటూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న, పొన్నూరు పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైనా భావనారాయణ స్వామి ఆలయం నందు, వైష్ణవ క్షేత్రంలో కాల భైరవస్వామి ఆలయం ఉన్నది.     10).   అహోబిలం:-   కర్నూలు జిల్లాలో నంద్యాల నుండి 60 కిలోమీటర్లు దూరంలో,  అహోబిలం వైష్ణవ క్షేత్రం,  స్వామివారి గర్భాలయానికి ఎదురుగా మరొక గుహలో శివలింగం ఉన్నది.   ఆలయం మహా మండపంలో భైరవ శిల్పం, స్థానిక భంగిమలో రౌద్ర వదనముతో ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు కోరకు ఈ క్రింద వీడియో ని యూట్యూబ్ లింక్ ద్వారా చూసి తెలుసుకోండి. 

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS