Tuesday, November 10, 2020

కనకమహాలక్ష్మి మందిరం-- సిద్ధార్థ నగర్--6వ లైన్-- నవభారత్ నగర్-- గుంటూరు..

 కనకమహాలక్ష్మి మందిరం-- సిద్ధార్థ నగర్--6వ లైన్-- నవభారత్ నగర్-- గుంటూరు..


    కనకమహాలక్ష్మి మందిరం అంటే విశాఖపట్నం కనకమహాలక్ష్మి దేవాలయం గుర్తుకొస్తుంది.   అదే పేరుతో ఉన్న ఆలయాన్ని తప్పక దర్శించండి.   ఈ మందిరాన్ని 2013 విజయ నామ సంవత్సరంలో, ఆలయ వ్యవస్థాపకులైన శ్రీ ఘంటసాల విజయ్ కుమార్ స్వామి వారు స్థాపించారు.   యాదృచ్ఛిక ఏంటంటే!! విజయ నామ సంవత్సరం.. విజయ్ కుమార్ స్వామి.. విజయేశ్వర స్వామివారిని ప్రతిష్ట చేయటం, అద్భుతమైన విషయం.   అన్ని విషయాలే!! శృంగేరీ పీఠాధిపతి అయిన జగద్గురు శంకరాచార్య స్వామివారు, ఈనాటి నుండి ఈ మందిరం విజయవంతంగా ఉంటుందని ఆశీస్సులు అందించారు.   ఇంకో విషయం ఏంటంటే!  ఈ మందిర శంకుస్థాపన చేసిన 108వ రోజు (3 నెలల, 10 రోజులు) ప్రతిష్ట చేయడం జరిగింది.  ఈ మందిరానికి రెండు ద్వారాలు ఉంటాయి.  ఒకటి ఆలయంలోకి వెళ్లడానికి,  మరొకటి బయటకు రావడానికి (kovida నిబంధనలకు అనుగుణంగా, దేవస్థానంవారు ఏర్పాట్లు చేశారు..) ఈ దేవాలయాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న ఘంటసాల విజయ్ కుమార్ స్వామి వారిని అభినందించాలి.   తనదైన శైలిలో వారు ఒక్కరే,  ఈ నవరాత్రులలో,  పర్వదినాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.   ఈ మందిరానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది.    ఆలయంలోకి వెళ్లే మార్గంలో పైన ఒక ప్రక్క సరస్వతి,  మరోపక్క వినాయకుడు,  కొంచెం క్రింద నాగపడగ,  ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు దర్శనమిస్తారు.   ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా "కనకమహాలక్ష్మీ దేవి" అద్భుతంగా దర్శనమిస్తోంది. కనకమహాలక్ష్మీ దేవి దర్శనం వల్ల శీఘ్ర ఫలితాలు వస్తాయి.   అమ్మవారి కళ్ళు కరుణ రసాత్మకంగా ఉంటాయి.   క్రింద స్ఫటిక శివలింగం, శ్రీచక్రం కూడా ఉంటుంది.  (స్పటిక లింగం.. విజయేశ్వర స్వామివారు.. స్పటిక లింగాన్ని,  శ్రీ చక్రాన్ని శృంగేరి జగద్గురు శంకరాచార్యులు వారు ఇచ్చారు..) ప్రతి పౌర్ణమికి శ్రీచక్రార్చన,  చండీ పారాయణ జరుగుతుంది.   అమ్మవారి ప్రక్కనే షిరిడి సాయినాధుని, మరొక ప్రక్క వల్లి దేవసేన సుబ్రమణ్య స్వామిని,  శివుడిని, మకర తోరణం,  సుబ్రమణ్య స్వామి వాహనం నెమలిని దర్శించుకోవచ్చు.   సుబ్రహ్మణ్యస్వామి ప్రక్కనే అయ్యప్ప స్వామి, గణపతి, చండి అమ్మవారిని దర్శించుకోవచ్చు. (నవరాత్రులలో భాగంగా కలశస్థాపన చేసి,  చండీ పారాయణం జరుగుతుంది.) అయ్యప్పస్వామి పక్కనే,  నవగ్రహాలని,  ముందు శివుడిని దర్శించుకోవచ్చు.   నవగ్రహాల అనుగ్రహం ఉంటే సకల ఇతిబాధలు నెరవేరతాయి.   మరొక పక్క దక్షిణాముఖ ఆంజనేయ స్వామిని (అరుదుగా కనిపిస్తారు..) దర్శించుకోవచ్చు.   కుజగ్రహానికి అధిష్టాన దేవతగా దక్షిణాముఖ ఆంజనేయస్వామి.   శత్రువు, ఋణ, రోగ బాధలు తీరాలంటే దక్షిణాముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి.   ఆంజనేయస్వామి పక్కనే సరస్వతీ దేవిని (ఓం ఐం సరస్వత్యై నమః) దర్శించుకోవచ్చు.   మరొక ప్రక్క లక్ష్మీ గణపతి దర్శనమిస్తుంది.   ఏదైనా పని జరగాలంటే లక్ష్మీ గణపతిని దర్శించి, నమస్కరించుకోవాలి.  (గృహప్రవేశాలు మరేదైనా కార్యక్రమాలలో లక్ష్మీ గణపతి హవనం చేస్తారు..) మరొక ప్రక్క కలియుగ వెంకటేశ్వరస్వామి దర్శించవచ్చు.   ఆ ప్రక్కనే వేదవ్యాసుడు, అన్నవరం సత్యనారాయణ స్వామి చిత్రపటాలు ఉంటాయి.   చిన్న ఆలయమే అయినా, ఇన్ని దివ్యమూర్తులు గల దేవాలయం మనకు చాలా అరుదుగా కనిపిస్తుంది.   ఈ నవరాత్రులలో ఈ మందిరాన్ని దర్శించుకోవటం అదృష్టంగా భావించాలి. కాబట్టి భక్తులు తప్పకుండా ఈ మందిరాన్ని దర్శించి, కనకమహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి..

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS