Tuesday, November 10, 2020

కాలభైరవుడుక్షేత్రపాలకుడిగా భైరవ 7 క్షేత్రాలు:కాల భైరవ ఆరాధన

 కాలభైరవుడుక్షేత్రపాలకుడిగా భైరవ 7 క్షేత్రాలు:కాల భైరవ ఆరాధన 


1).    శ్రీకాళహస్తి:-     చిత్తూరు జిల్లాలో తిరుపతి నుండి 30 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాళహస్తి నందు క్షేత్రపాలకుడిగా బట్టల భైరవుడుని  దర్శించవచ్చును.   2) అయినవిల్లి:-   తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో, అయినవిల్లి క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు ఉన్నారు.   మొదట క్షేత్రపాలకుడిగా కేశవస్వామి ఉండేవారు.   సిద్ది గణపతి ఆలయానికి ఈశాన్య భాగంలో, తూర్పుముఖముగా కాలభైరవుని ఆలయం ఉన్నది.   ఆలయ విమానం పై అష్ట భైరవులు ఉన్నాయి.   3).      పిఠాపురం:- తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట నుండి 15 కిలోమీటర్ల దూరంలో, పిఠాపురం నందు పాదగయ క్షేత్రము నందు కుక్కుటేశ్వర ఆలయం ముందు, ఈశాన్య భాగంలో క్షేత్రపాలకుడిగా శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఉన్నది.     4).  కొలనుభారతి:-  కర్నూలు జిల్లాలో కొత్తపల్లి మండల క్షేత్రం నుండి ఆటో ద్వారా,  కొలనుభారతి ఆలయంలో క్షేత్రపాలకుడిగా కాల భైరవస్వామి ఆలయం ఉన్నది.   ఇక్కడి దగ్గరలో గల గూడెంలోని చెంచులకు ఈ భైరవుడు ఆరాధ్యదైవం.    5).   సత్రశాల:-   గుంటూరు జిల్లాలో రెంటచింతల మండలంలో సత్రశాల క్షేత్రానికి,  మాచర్ల నుండి బస్సులు కలవు.   జెట్టిపాలెం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.   ప్రధాన ఆలయమునకు ఈశాన్యములో క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి ఆలయం ఉన్నది.   6).  ముక్తేశ్వరం:-   అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో, ముక్తేశ్వరం నందు ముక్తికాంతా సమేత క్షణముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో, ఈశాన్య భాగంలో క్షేత్ర పాలకుడిగా కాల భైరవస్వామి ఆలయం ఉన్నది.   7).   జుత్తిగ:-   పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం నుండి 30 కిలోమీటర్ల దూరంలో, జుత్తిగ ఆలయంలో శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వరాలయం నందు క్షేత్రపాలకుడైన, కాలభైరవ స్వామి ఆలయము నకు ఒక ప్రత్యేకత ఉన్నది.   ఆలయం దర్శించిన తర్వాత ఇంటికి వెళ్లే ముందు ఈ స్వామిని దర్శించుకొని అనుమతి తీసుకోవాలనేది ఈ క్షేత్రంలో నియమం.  

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS