దక్షిణ ముఖ కాళీమందిరం-- కంకరగుంట-- గుంటూరు:
దక్షిణ ముఖ కాళీమందిరం గుంటూరు స్వామి థియేటర్ రోడ్డులో, కంకరగుంట బ్రిడ్జి దగ్గర ఉంది. చాలా చిన్న మందిరం. ఈ మందిరాన్ని "దక్షిణ మహంకాళి ఆలయం" అని పిలుస్తారు. ఆలయంలో ముందుగా విఘ్నాలు తొలగించే గణనాథుడు, మరొక ప్రక్క సుబ్రహ్మణ్యస్వామి, ఇంకోప్రక్క కాలభైరవుడు దర్శనమిస్తారు. నవదుర్గలతో కూడిన, పులిమీద ఉన్న అమ్మవారి చిత్రపటము ఉంటుంది. గర్భాలయంలో "దక్షిణ ముఖ కాళీదేవి" విగ్రహం అత్యంత సుందరంగా, మనోహరంగా దర్శనమిస్తుంది. అమ్మవారి విగ్రహం క్రింద, మరొక పక్క అమ్మవారి మూర్తులు 2 చిన్న విగ్రహాలు ఉంటాయి. ఆలయ మధ్యలో హోమ గుండం ఉంది. ఆలయం చూడడానికి చాలా చిన్నది. ప్రదక్షిణలు చేయడానికి కూడా చాలా చిన్నమార్గం ఉంది. అయినా మహిమాన్వితమైన ఆలయం. ఇక్కడ పూజారి గారు భక్తిశ్రద్ధలతో, తనదైన శైలిలో పూజా కార్యక్రమాలు చేస్తారు.
ఏదైనా ఒక కోరికని అనుకొని అమ్మను దర్శించి, పూజించిన తర్వాత ఆ కోరిక తీరడం అనేది చాలామంది భక్తులకు నిదర్శనం. అమావాస్య పౌర్ణమి రోజులలో, మరీ ముఖ్యంగా శుక్రవారాల్లో ఎక్కువ మంది భక్తులు వస్తారు. ఈ మందిరాన్ని దర్శించడం అదృష్టంగా భావిస్తూ, గుంటూరు వాస్తవ్యులు తప్పకుండా ఈ మందిరాన్ని దర్శించాలని కోరుకుంటూ...
శ్రీ మాత్రే నమః🙏🙏
No comments:
Post a Comment