Tuesday, November 10, 2020

కాలభైరవ 10 ప్రధాన క్షేత్రాలు. కాల భైరవ ఆరాధన

 కాలభైరవ 10 ప్రధాన క్షేత్రాలు. కాల భైరవ ఆరాధన ,


1).    ఇసన్నపల్లి:-   నిజామాబాద్ జిల్లాలో 55 కి:మీ దూరంలో ఇసన్నపల్లిలో కాలభైరవుడు ఉన్నాడు.   దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవ క్షేత్రం.   గ్రహపీడలు తొలగించే క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది.   పడమర దిశగా నిర్మించబడిన ఆలయ ప్రవేశ ద్వారం, దక్షిణాభిముఖంగా ఉంటుంది.    గర్భాలయంలో 7 అడుగుల ఎత్తు గల విగ్రహం వాహనం శునకం ఉంటుంది.   త్రిశూలం, నాగాస్త్రలను ధరించి  నేలపైన నాగాస్త్రంతో దర్శనమిస్తారు.       2).    రామగిరి:-   తిరుపతి నుండి 70 కి:మీ దూరంలో చెన్నై పోవుమార్గంలో నాగులాపురం 7 కిలోమీటర్ల దూరంలో రామగిరిలో కాలభైరవ ఆలయం, మరియు వాలేశ్వరాలయం పక్కపక్కనే ఉన్నాయి.   కాలభైరవ స్వామి 5 అడుగుల ఎత్తులో ఉన్నది.   ప్రాచీన ఆలయం.     3).     భైరవసెల:-   శ్రీశైలం నుండి 13 కి:మీ దూరంలో భైరవసెల ఉన్నది. శ్రీశైలం నుండి దోర్నాల వెళ్ళు దారిలో 10 కిలోమీటర్లు ప్రయాణించి,( దోర్నాల 39 కిలోమీటర్లు అను మైలురాయి వద్ద ఆగి) అడవి మార్గంలో 3 కిలోమీటర్ల కొండను దిగి, ఈ క్షేత్రాన్ని చేరవచ్చును.   భైరవ గుహలోని భైరవుడు ఎర్ర ఇసుక రాతితో మలచబడిన భయంకర దిగంబర మూర్తి.  చతుర్భుజుడుగా అలంకార మూర్తిగా స్వామి ఉంటారు.     4).   అడవివరం:- విశాఖపట్నం సింహాచలం నుండి సోంఠ్యాం పోవుమార్గంలో 5 కి:మీ దూరం వద్ద దిగి, ఒక కిలోమీటర్ దూరం నడిస్తే ఈ క్షేత్రం చేరవచ్చును.   ఆలయం చుట్టూ గోడలు ఏమీ లేకుండా పైకి మెట్లు నిర్మించబడి, చుట్టూ మండపంతో ఓపెన్ ఏరియాలో భైరవ దర్శనమిస్తాడు.  దీనినే బైరవకోన అని పిలుస్తారు.    5).    భైరవ కొండ:- ఒంగోలు జిల్లాలో కనిగిరి పొదిలి మీదుగా 150 కి:మీ దూరంలో భైరవకోన క్షేత్రముగా, కొత్తపల్లి జంక్షన్లో దిగి ఆటోలో చేసుకొనవచ్చును.   త్రిముఖ దుర్గ అమ్మవారుకి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి.    6).   కాళేశ్వరం:- కరీంనగర్ నుండి 130 కి:మీ దూరంలో ఉన్న కాళేశ్వరంలో అనేక ఉపాలయాలలో భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు వేరు వేరు మందిరములలో పూజలందుకుంటున్నారు.    7).  మోపూరు:-   కడప జిల్లాలో గల పులివెందుల నుండి 16 కి:మీ దూరం, మోపూరు కడప నుండి 70 కి:మీ లింగ రూపములో భైరవుడు.   భైరవేశ్వర లింగం సుమారు 14 అడుగుల చుట్టుకొలత కలిగి, 11 అడుగుల ఎత్తులో ఉంటుంది.  భక్తులు క్రింది అంతస్తులో స్వామి మోకాళ్లుగా చెప్పబడే 3 అడుగుల ఎత్తులో లింగానికి విభూతి, కుంకుమలతో అలంకరించి పూజిస్తారు.     8).   పాకర్లవారిపాలెం:- కర్నూలు జిల్లాలో మైదుకూరు నుండి 36 కి:మీ దూరంలో, నల్లమల అడవులలో పాకర్లవారిపాలెంలో ప్రాచీన ఆలయములలో, అష్ట భైరవులులో ఒకరు అసితాంగ భైరవుడు లింగరూపంలో పూజలు అందుకుంటూ ఉంటాడు.     9).   మున్నంగి:-  గుంటూరు జిల్లాలో తెనాలి నుండి ఈమని మీదుగా 20 కి:మీ దూరంలో ఉన్న మున్నంగి లో భైరవుడు ఉన్నాడు. 10).    భైరవపాడు:-    గుంటూరు జిల్లాలో మాచర్ల నుండి 4 కి:మీ దూరంలో భైరవపాడు నందు భైరవుడు ఉన్నాడు.   ఆటో సౌకర్యం ఉన్నది.    

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS