Tuesday, November 10, 2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పుష్పగిరి ఆలయ సముదాయాల లోని శ్రీవైద్యనాదేశ్వర ఆలయ ప్రాంగణం లోని శ్రీత్రికూటేశ్వరస్వామి వారి దర్శనం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

కడప జిల్లా

పుష్పగిరి ఆలయ సముదాయాల లోని

శ్రీవైద్యనాదేశ్వర ఆలయ ప్రాంగణం లోని

శ్రీత్రికూటేశ్వరస్వామి వారి 

దర్శనం శివసంకల్పంలో ఈరోజు...


   

   *రాయలసీమ లోని త్రికూట ఆలయం - 

అనేక విశేషాల సమాహారం 

పుష్పగిరి త్రికూటేశ్వర ఆలయం


  *సాధారణంగా ఆలయాలలో ఒక ప్రధాన గర్భాలయం వాటికి అనుబంధంగా ఉపాలయాలు ఉంటాయి. అలాకాకుండా ఒకే ఆలయంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రధాన గర్భాలయాలు ఉంటే వాటిని ద్వికూట, త్రికూట మొ. ఆలయాలుగా సంబోధిస్తారు.   

*ఒకే ఆలయంలో మూడు గర్భాలయాలు ఉంటే ఆ ఆలయాన్ని త్రికూట ఆలయం అంటారు. 

 *చాళుక్యుల, హోయసలుల, కాకతీయుల శిల్పకళా రీతిలో ఈ త్రికూట ఆలయాలు అధికంగా కనిపిస్తాయి.


 *వరంగల్ లోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడి, కొండపర్తి ఆలయం  మొదలగు గుడులు త్రికూట ఆలయాలు. 

 *తెలంగాణలో త్రికూట ఆలయాలు చాలా ఉన్నాయి.

  *రాయలసీమలో త్రికూట ఆలయాలు అత్యంత అరుదు.


అటువంటి త్రికూట ఆలయం, కడప జిల్లా పుష్పగిరిలోని శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న త్రికూటేశ్వర ఆలయం. ఇక్కడి త్రికూట ఆలయంలో మూడు (3) గర్భాలయాలలో స్వామి ఉమామహేశ్వరుడు , త్రికూటేశ్వరుడు  మొ.పేర్లతో పూజలు అందుకుంటున్నాడు. ఈ మూడు గర్భాలయలు వేరే వేరే వ్యక్తులు కట్టించడం విశేషం. మూడు ఆలయాలలో రెండు ఆలయాలు ఇద్దరు భిన్న రాజవంశాలకు చెందిన రాణులు కట్టించడం ఇంకా విశేషం. 

 "పరమేశ్వరుడు లింగాకారంలో కాక పార్వతీ సమేతుడై ‘ఉమామహేశ్వర స్వామిగా’  విగ్రహ రూపంలోపూజలుఅందుకోవడం  ఇక్కడ ఇంకో విశేషం"


  *ఓరుగల్లురాజ్య సామంతుడు, వారి తరపున కొంతకాలం ములికినాటి సీమను ఏలిన కాయస్థ రాజు గండపెండెర గంగయ్య సాహిణి భార్య అయిన కమలాదేవి త్రికూటేశ్వర ఆలయంలో తన పేరిట   శాలివాహక శకం 1176లో (క్రీ.శ 1255) కమలేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినది. అల్లుగి రాజు కుమార్తె  హచలాంబ తనపేరుమీద త్రికూటేశ్వర ఆలయంలోని  హచలేశ్వర ఆలయమును నిర్మించినది. పల్లవ రాజు ఖందేరాయ పల్లవేశ్వర ఆలయాన్ని నిర్మించారు.


  *ఆలయ మంటపంలో కొలువై ఉన్న సప్తమాత్రికలు ఈ ఆలయ మరో ప్రత్యేకత. 

  *ఆలయ ప్రాంగణంలో  ఉన్న స్తంభాలపై వివిధ భాషలలో ఉన్న శాసనాలు 800 సంవత్సరాలకు పైగా ఉన్న ఆలయ చరిత్ర తెలియజేస్తాయి. 

  **పుష్పగిరి కడప పట్టణం నుండి కేవలం 20 కిమీల దూరంలో ఉంది...


శివసంకల్పం లో ఈరోజు మనకోసం..

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS