Tuesday, November 10, 2020

శ్రీ మహాకాళి విద్యాపీఠం-- పొన్నెకల్లు-- గుంటూరు జిల్లా: తమిళనాడు రాష్ట్రంలో ధరాస్వరం అనే చోట, దేవాలయంలో ఉన్న ఉచ్ఛిష్ఠ గణపతిని ఇక్కడ చూడవచ్చు

 శ్రీ మహాకాళి విద్యాపీఠం-- పొన్నెకల్లు-- గుంటూరు జిల్లా: 

   శ్రీమహాకాళీవిద్యపీఠం పొన్నెకల్లు శ్రీశక్తినాదేశ్వరస్వామి 7780635230


       పొన్నెకల్లు గ్రామం గుంటూరుకి సుమారు 12 కి.మీ దూరంలో ఉంది.   తాడికొండ, అమరావతి 4 రోడ్ల కూడలి నుండి 2 కి.మీ దూరంలో ఈ పీఠం ఉంది. పొన్నెకల్లు గ్రామంలో గ్రామ సచివాలయం ఎదురు మట్టి రోడ్డులో,  నడుచుకుంటూ వెళితే శ్రీ మహాకాళి విద్యాపీఠం కనిపిస్తుంది.   ప్రక్కనే గోశాల, అందులో కపిలగోవులు కూడా ఉన్నాయి.   (వెళ్లిన భక్తులు గో-సేవ కూడా చేసుకోవచ్చు.).   గోశాల పక్కనే శ్రీ మహాకాళీ విద్యాపీఠాన్ని దర్శించవచ్చు.   ఈ పీఠాన్ని నిర్వహిస్తున్న వారు శ్రీశక్తి నాదేశ్వర స్వామి వారు.   ఈ శక్తిపీఠంలోకి ప్రవేశించగానే ఎదురుగా అమ్మవారి దర్శనం అవుతుంది. ఆ అమ్మవారిని చూడగానే "ప్రత్యంగిరాదేవి" గా అర్థమవుతుంది.   సింహం తల కలిగిన తల్లి.   ప్రత్యంగిరా ఉపాసన చేసేవారు చాలామంది ఉన్నారు.   ఆ ప్రక్కనే భైరవి మాతని,  ఎదురుగా శ్రీచక్రమేరువుని చూడవచ్చు.   భైరవి మాతపైన క్షేత్రపాలకుడైన భైరవుడు దర్శనమిస్తాడు.   క్షేత్రపాలకుడు అనుమతిలేకుండా ఎవ్వరూ కూడా క్షేత్ర దర్శనం చేయలేరు.   ఆ ప్రక్కనే మధుమతి దేవి,  కుబేరుడు, లక్ష్మీదేవికి ధనాన్ని ప్రసాదిస్తున్న ఈశ్వరుడు,  శ్రీ శక్తి నాదేశ్వర స్వామి వారి చిత్రపటాలు చూడవచ్చు.   ఈ క్షేత్రంలో ముఖ్యంగా దర్శించవలసినది,  అమ్మవారి ఎదురుగా ఉన్న ఈశ్వర స్వరూపాన్ని.   పక్కనే వీరభద్రుడు, ఖడ్గం ఉంటాయి.   ఇక్కడ ఈశ్వరుని "మహాకాలుడిగా" పూజిస్తారు.  ఆ ప్రక్కనే "వటుక భైరవడు" ఉంటాడు.   గురు గ్రహదోషాలకి వటుక భైరవుని దర్శించాలి.   ఆ వెనుక "శ్రీ మేధా దక్షిణామూర్తి"ని దర్శించుకోవచ్చు.   గురు గ్రహానికి సంబంధించిన దక్షిణామూర్తి పూజలు చేసిన, గురువారం దర్శించిన,  (ఓం నమో భగవతే దక్షిణామూర్తయే! మహ్యం, మేధాం, ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా!!..) గురు అనుగ్రహం కలుగుతుంది.   ప్రక్కనే ఉచ్ఛిష్ఠ గణపతి ఉంటాడు.   ఈ గణపతి ఎక్కడా ఉండడు!! కేవలం తమిళనాడు రాష్ట్రంలో ధరాస్వరం అనే చోట, దేవాలయంలో ఉచ్ఛిష్ఠ గణపతిని చూడవచ్చు.   ఆ తర్వాత ఇక్కడే చూడగలం!!  ఉచ్ఛిష్ఠ గణపతి తొడ మీద, అమ్మవారు కూర్చొని ఉంటుంది, (ధరాస్వరంలో చాలా పెద్ద విగ్రహం..) అక్కడ ఎలా ఉంటుందో! అదే మాదిరిగా (చిన్న విగ్రహంగా..) ఇక్కడ కూడా ఉంది. ఉచ్ఛిష్ఠ గణపతి అనగానే!  జ్యోతిష్కులకి  కె.పి. కృష్ణమూర్తిగారు గుర్తుకొస్తారు.   కె.పి. సిద్ధాంతం, కృష్ణమూర్తి పద్ధతి అని వాడుక.   ఆయన ఉచ్ఛిష్ఠ గణపతి ఉపాసన చేసే,  కె.పి.సిస్టం కనుక్కొని, జ్యోతిష్కానికి మంచిదారి చూపించారని చెప్తారు.  ఉచ్ఛిఫ్ఠ గణపతి ఉపాసన చేసేవారు చాలామంది ఉన్నారు.   వారందరికీ ఉచ్ఛిష్ఠ గణపతి కల్పతరువు, కామధేనువుగా చెప్పవచ్చు.  

        మధ్యలో శ్రీ మహాకాళి అమ్మవారు పూలమాలతో, నిమ్మకాయల దండతో దర్శనమిస్తుంది.   ఈ తల్లి దర్శనం వల్ల సకల పాపాలు పోతాయి.   అమ్మవారి పాదఘట్టం క్రింద శివుని ముఖారవిందాన్ని చూడవచ్చు. ఆలయ మధ్యలో హోమగుండం ఉంది.  పౌర్ణమి, అమావాస్య రోజులలో హోమం నిర్వహిస్తారు.  (ఈ అమ్మవారు నాలుగు వైపులా ఉన్న దేవతలు, ప్రత్యంగిరా, భైరవుడు, భైరవి, దక్షిణామూర్తి.. ఈ సాంప్రదాయం తంత్ర పీఠంలో ఉంటుంది..)

       శ్రీ శక్తి నాదేశ్వర స్వామి వారు పొన్నెకల్లు గ్రామంలోనే ఉంటారు.   వీరిని ఎక్కువ మంది ప్రజలు దర్శిస్తారు.  వీరు నర ఘోషకి,  జడుపు జ్వరానికి, ఇతి బాధలకి ఎక్కువగా తాయత్తులు ఇస్తారు.  స్వామివారు మంత్రోపాసన చేస్తారు, ఎవరైనా దర్శించుకోవచ్చు.  ముందుగా ఫోన్ చేసి అనుమతి తీసుకొని రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఇబ్బంది పడతారు.  ఎందుకంటే స్వామివారు ఎక్కువగా అనుష్ఠానంలో ఉంటారు.   వారిని కలిసే అవకాశం తక్కువ కాబట్టి అనుమతితోనే రావాలి.   (ఈ క్షేత్రంలో భూగృహం ఉంది.. ఇక్కడ కూడా శ్రీశక్తి నాదేశ్వర స్వామి వారు అనుష్ఠానం చేసే అమ్మవారి ఉంది..) ముఖ్యంగా కామ్యసిద్ధి భైరవి ఉండటంవల్ల,  తమ కోరికలు నెరవేరతాయని, అపమృత్యు దోషాలు తొలగుతాయని గురువుగారి ద్వారా తెలుస్తోంది.   శ్రీ శక్తి నాదేశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో నడుస్తున్న,  ఈ మహాకాళి పీఠాన్ని తప్పక దర్శించి, అమ్మవారి కృప కటాక్షాలతో పాటు, అమ్మ దయకు పాత్రులు కాగలరు...

            శ్రీ మాత్రే నమః🙏🙏

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS