Friday, May 19, 2023

పసుపురంగు బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన జఠర, ఉదర వ్యాధుల, కామెర్ల రోగం తగ్గుతాయి.

పసుపురంగు బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన జఠర, ఉదర వ్యాధుల, కామెర్ల రోగం తగ్గుతాయి.


కుంకుమ నీటితో, దానిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన
వైవాహిక చింతలు తొలగిపోతాయి.
ఇంటిపై మాంత్రిక శక్తులు ఏమీ పనిచేయవు.

సంతాన గోపాలస్వామికి దీపారాధన చేస్తే అనుగ్రహంతో సంతానం కలుగుతుంది.

వత్తులను పన్నీటిలో అద్ది నేతితో దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది.

💐కొబ్బరి నూనెతో దైవారాధన.💐

కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

రావిచెట్టు క్రింద ఉండే నాగ దేవతల విగ్రహాలకు
పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వథనారా యణస్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా, సంతోషంగా ఉంటుంది.

కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ,
శుక్రవారం నాడు కానీ, కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజచేసి పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11 మంది ముతైదువులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది.

మహాలక్ష్మీదేవికి కొబ్బరినూనెతో 40 రోజులు ఆరాధిస్తే వారికి రావలసిన అప్పులు వసూలు అవుతాయి.

ఎవరైతే ప్రతిరోజూ మహాలక్ష్మికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి కొబ్బరి, పంచదారన నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వారింట్లో శుభకార్యాలు జరుగుతాయి.

పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారివారి పితృదేవతలకు స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి.

ఎవరైతే ప్రతి శనివారం నాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాలకట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి
జీవిత పర్యంతం ఆర్థిక సమస్యలు రావు.

హరిద్వార్‌లో సాయంసంధ్యలో గంగాదీపాన్ని కొబ్బరినూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి, కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా
గంగాస్నానం చేసిన ఫలితం కలుగుతుంది.

ఎవరైతే కాశీలో విశ్వేశ్వరస్వామివారికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరినూనెతో దీపారాధన చేస్తారో వారికి... వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి.

దీపారాధనలు కొన్ని ప్రదేశాలలో వెలిగించడం వల్ల విశే షమైన ఫలితాలు ఇస్తాయి

మనము ఇంట్లో చేసే నిత్య దీపారాధన ను "వ్యష్టి " దీపారాధన అంటారు. అంటే ఇంటికి వెలుగునిచ్చి,
ఆ ఇంటిల్లిపాదికి ఐశ్వర్యసంపద కలిగించేది.

దేవాలయాలలో చేసే దీపారధనకు దేవతల అనుగ్రహం కలుగుతుంది...విశేష ఫలితాలు లభిస్తాయి.

తులసి కోట వద్ద చేసే దీపారాధనని " బృందావన" దీపారాధన అంటారు.

దేవుడికి ప్రత్యేకించి చూపించే దీపారాధనను "అర్చనా" దీపాలు అంటారు.

నిత్య పూజలలో ఉపయోగించే చిరుదీపాలను నిరంజన దీపాలంటారు.

గర్భగుడిలో వెలిగించే దీపాన్ని "నందా" దీపము అని అంటారు.

లక్ష్మిదేవి ఉన్న గర్భగుడిలో గుడిలో వెలిగించే దీపాన్ని "లక్ష్మి దీపం" అంటారు.

దేవాలయ ప్రంగణములొనున్న బలిపీఠం పై వెలిగించే దీపాన్ని ఆ దేవాలయ దృష్టి నివారణగా "బలిదీపం" అని అంటారు.

ఆ సమీపాన ఉన్న ఎత్తూయిన స్థంబం పై వెలిగించిన దీపాన్ని "ఆకాశదీపం" అంటారు.

అలాగ పంచాయతన దేవాలయాలలో దేవతలు..శివుడు,విష్ణువు,అంబిక,గణపతి,ఆదిత్యుడు
(సూర్యుడు) లున్న ఒక్కొక్క దేవత దగ్గర వెలిగించే దీపారధనకు వివిధ పేర్లు ఉన్నాయి.
శైవరూపంలో నందిరూపంగా, నాగరూపంలో మేళవించిన దీపాలు కనిపిస్తాయి.
విష్ణువు వద్ద దీపకృతులు :శంఖు,చక్ర,గద,పద్మ"రూపాలు కనిపిస్తాయి.
ఏక ముఖం- మధ్యమం, ద్విముఖం - కుటుంబ ఐక్యత, త్రిముఖం-ఉత్తమ సంతాన సౌభాగ్యం, చతుర్ముఖం -పశుసంపద మరియు ధన సంపద, పంచముఖం సిరిసంపదుల వృద్ధి ఫలితములు ఉండును.

అలాగే మట్టి, వెండి పంచలోహాదుల ప్రమిదలు దీపారాధనకు వాడటం శ్రేష్టం.
వెండి కుందులు అగ్రస్థానం . పంచ లోహపు కుందులు ద్వితియ స్థనం.
దీపారాధన చేసేటప్పుడు తప్పనసరిగా ప్రమిదల క్రింద చిన్న పళ్ళెము పెట్టడం శ్రేష్టం.
మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే, ఆ ప్రమిద క్రింద
మరో ప్రమిద పెట్టాలి.
ఇంట్లో నిత్య దీపారాధన సంధ్యా సమయాలలో తప్పనసరిగ చెయ్యాలి.
నిత్యం శుభఫలితాలను ఇస్తు, దుష్ట శక్తులు నశిస్తాయి.
ఆ ఇంటా అందరు క్షేమముగా ఉంటారు

💐జన్మ తేదీల రీత్యా.... వెలిగించవలసిన వత్తులు.💐

1. మార్చి 21 నుండి ఏప్రిల్‌ 20 వరకు - (5) పంచవత్తులు
2. ఏప్రిల్‌ 21 నుండి మే 20 వరకు - (7) సప్తవత్తులు
3. మే 21 నుండి జూన్‌ 20 వరకు - (6) షణ్ము వత్తులు
4. జూన్‌ 21 ఉండి జూలై 20 వరకు - (5) పంచముఖి వత్తులు
5. జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు - (3) త్రివత్తులు
6 ఆగస్టు 21 నుండి సెప్టెంబరు 20 వరకు - (6) షణ్ముఖ
7. సెప్టెంబరు 21 నుండి అక్టోబర్‌ 20 వరకు - (7) సప్త వత్తులు
8. అక్టోబర్‌ 21 నుండి నవంబర్‌ 20 వరకు - (2) ద్వి వత్తులు
9. నవంబర్‌ 21 నుండి డిసెంబర్‌ 20 వరకు - (5) పంచమ వత్తులు
10. డిసెంబర్‌ 21 నుండి జనవరి 20 వరకు - (6) షణ్ముక వత్తులు
11. జనవరి 21 నుండి ఫ్రిబవరి 20 వరకు - (5) షణ్ముక వత్తులు
12. ఫిబ్రవరి 21 నుండి మార్చి 20 వరకు - (2) ద్వి వత్తులు

అదృష్ట సంఖ్యల రీత్యా వెలిగించవలసిన వత్తులు.💐

పిల్లాడి రుద్రయ్య

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS