Tuesday, May 16, 2023

కర్పూరంతో మహాలక్ష్మి యోగం

 కర్పూరంతో మహాలక్ష్మి యోగం



డబ్బు అనేది ప్రతి ఒక్కరికి నిత్యవసర వస్తువు. ఒక విధంగా చెప్పాలంటే డబ్బు ఆధారంగానే ఈ ప్రపంచం నడుస్తుంది అని చెప్పాలి. అటువంటి డబ్బు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం ఆ డబ్బు అనేది స్థిర నివాసం ఏర్పరచుకోవాలి. ఇటువంటి డబ్బు స్థిరంగా ఉండాలన్నా ఆదాయం పెరగాలన్నా కర్పూరంతో పరిహారం పాటిస్తే మహాలక్ష్మి గృహంలోస్థిరంగా ఉంటుంది. కర్పూరం నవగ్రహాలలో శుక్ర గ్రహానికి ప్రతీక.శుక్రుడికి అతి దేవత లక్ష్మీదేవి. ప్రతిరోజు రాత్రి కొన్ని కర్పూరం బిళ్ళలు ఒక రాగి పళ్ళెం కానీ వెండి పళ్లెంలో కానీ వేసి వాటిపైన రెండు లవంగాలు వేసి కర్పూరం వెలిగించండి. ఈ కర్పూర హారతిని అన్ని గదులలో చూపించండి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ధనపరమైన  చిక్కులు తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి గృహంలో  స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అంతేకాకుండా వ్యవహార చిక్కులు ఏర్పడుతున్నాయి పనులు ముందుకు వెళ్లడం లేదు అనుకుని బాధపడేవారు కర్పూరం నూనె అని మార్కెట్లో లభిస్తుంది ఇది తీసుకోండి. ఈ నూనెను ఉదయం మీరు స్నానం చేసే సమయంలో నీళ్ల బకెట్లో రెండు  చుక్కలు వేయండి. ఈ నీళ్లతో స్నానం చేస్తూ ఉంటే మీలో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. అన్ని పనులు సక్రమంగా నెరవేరుతాయి. 

గృహంలో వాస్తు దోషాలు ఉన్నప్పుడు, అవి సరి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేయండి. చిన్న గిన్నెలో కొద్దిగా కర్పూరం వేసి మీ ఇంట్లో ఉత్తర దిక్కున ఉంచండి వాస్తు దోషాల ప్రభావం తగ్గి గృహానికి అనుకూల శక్తి ఏర్పడుతుంది. రాత్రి సమయంలో కర్పూరం  కొద్దిగా ఆవు నెయ్యిలో ఉంచి ఉదయాన్నే ఆ కర్పూరంతో దేవుడికి హారతి ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన ఇంట్లో ఏర్పడే నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి తొలగిపోతుంది. ధనం వృద్ధి చెందుతుంది ధనపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి. మీరు ఏదైనా ముఖ్యమైన పని ఉండి బయటకు వెళ్తున్నప్పుడు కొద్దిగా కర్పూరం తీసుకొని మీ ఇష్ట దైవానికి హారతి ఇచ్చి తర్వాత బయటికి వెళ్ళండి మీరు వెళ్లిన పని విజయవంతం అవుతుంది.


No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS