Saturday, May 20, 2023

సమాశ్రయణం అంటే వైష్ణవ దీక్ష అని అంటారు.

 సమాశ్రయణం


💠 సమాశ్రయణం అంటే వైష్ణవ దీక్ష అని అంటారు.
 దీన్నే పంచ సంస్కారం అని కూడా అంటారు. ఒక అరటి పండును తీసుకుంటే, తినే ముందు దాని తొక్క తీసివేసి తినే యోగ్యమైన సంస్కారం దానికి ఏర్పరిచి అప్పుడు తింటాం. ఏ పక్రియ ద్వారా అయితే ఒక వస్తువుకు దాని లక్ష్యాన్ని చేరే స్థితి ఏర్పడుతుందో దాన్నే సంస్కారం అని అంటారు.
అయితే మనిషికి జరగాల్సినవి 5 రకాల సంస్కారాలు ఉంటాయి అని పాంచరాత్ర ఆగమాలు తెలుపుతున్నాయి. 
అవి ...
మనం ధరించే బొట్టుని పుండ్ర సంస్కారమని, రెండు బుజములకు భగవంతుడి గుర్తులుగా చెప్పబడే శంఖ-చక్రాదులను ధరించడాన్ని తాపసంస్కారమని, 
మనకు లభించే కొత్త పేరుని నామ సంస్కారమని, 
గురువు ద్వారా మూడు మంత్రములు అందును దాన్ని మంత్ర సంస్కారమని, 
జీవనాన్ని  క్రమబద్దం చేసుకోవడాన్ని యాగ సంస్కారమని ఇలా ఈ ఐదింటిని కలిపి పంచ సంస్కారాలు అని అంటారు. 

👉 1.  పుండ్ర సంస్కారం :
ఆగమ పద్దతుల ద్వారా జ్ఞానానికి గుర్తుగా బొట్టును సరియైన విధంగా ధరిస్తాం. మామూలుగా లోకంలో కొన్ని రంగులు కొన్ని విషయాలని సూచిస్తాయి. ఎరుపు ప్రేమని, పసుపు మంగళాన్ని, తెలుపు ప్రశాంతతని సూచిస్తాయి. మనిషి తన లోని ప్రపంచం నుండి జ్ఞానం ద్వారా బయటి ప్రపంచాన్ని చూస్తాడు. కన్ను జ్ఞానానికి గుర్తు, ఆ రెండు కన్నుల మద్య స్థానాన్ని జ్ఞాన కేంద్రం అని అంటారు. మొదట ఆధారంగా ఒక గీత దానిపై 'U' ఆకారంలో తెల్లగా ఉన్న గుర్తును ధరిస్తాం ప్రశాంతతకు సూచకంగా. దానిపై ప్రేమకు చిహ్నంగా లేత ఎరుపు రంగు లో ఉన్న చిహ్నాన్ని ధరిస్తాం. ఆ ప్రేమ మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకు పోవాలి అందుకు అది పైకి చూపుతున్నట్టుగా ఉండాలి. తెలుపు సత్వానికి కూడా సూచకం. బ్రహ్మ రజో గుణ సంపన్నుడు, శివుడు తమో గుణ సంపన్నుడు, విష్ణువు సత్వ గుణ సంపన్నుడు. మనం సత్వానే కోరుకుంటాం. అందుకు సంభందించిన విష్ణువునే ఆరాదిస్తాం. విష్ణు సంభందిత రూపాలనే స్వీకరిస్తాం. అందుకు మనల్ని వైష్ణవులుగా భావించుకుంటాం. మిగతా వారిని ద్వేశించం. అన్నింటిలోనూ విష్ణు రూపాన్నే చూస్తాం. విష్ణువుని శిరసాధరిస్తాం. 'U' ఆకార గుర్తు ఆయన పాదాలకు చిహ్నం. సత్వాన్ని పెంచుకొనే ప్రక్రియలో భాగం ఇది. ప్రేమతో మంచి మార్గాన్ని చూపేది తల్లి, ఆ తల్లి రూపంలో భగవంతుడి లోంచి ప్రేమను, దయను పైకి వెలువరించేది శ్రీ కాబట్టి, ఆ శ్రీ ద్వారా మనం భగవంతుడిని చేరుతాం. అందుకు గుర్తు లేత ఎరుపు రంగు లో ఉన్న చిహ్నం. ఆ ప్రేమ మంగళ కరంగా ఉండాలి కనుక పసుపు కల్గి ఉంటుంది, దాన్నే 'శ్రీ చూర్ణం' అంటారు.

👉 2  తాప సంస్కారం
ఎన్నో జన్మలుగా మనం కర్మలు చేస్తూ వస్తున్నాం, అందువల్ల మనను అంటిపెట్టుకొని ఉన్న పాపాలను తొలగించుకోవాడానికి, ఉపనిషత్తులలో చెప్పినట్లుగా భగవంతుడి గుర్తులుగా చెప్పబడిన శంఖ-చక్రాలని మన భుజమున అద్దిన నిప్పులో వేసిన దూది ఎట్లా బస్మం అవుతుందో అట్లా బస్మం అవుతాయి. దీన్నే తాప సంస్కారం అని అంటారు.

👉 3 నామ సంస్కారం
ఇక నుండి ఎట్లాంటి తప్పులని చెయ్యక, చేసే ప్రతి పని ఇది నేను చేస్తున్నాను, నేను తింటున్నాను అని భావించక ఇది భగవంతుడి కోసం అని చేస్తాం. ఆ భావన కోసం మంత్రాలను అనుసంధానం చేస్తాం. ఆ భావన తో అన్ని పనులు చేస్తాం. అందుకే యముడు తన దూతలని వైష్ణవుల జోలికి వెల్లవద్దని తన దూతలకు చెప్పాడు, ఇది మహాభారతంలో అజామయుడి సన్నివేశంలో ఉంది. మరి వైష్ణవులకు గుర్తు ఎమిటి అన్న ప్రశ్నలకు యముడు 3 పై పైకి కనిపించే గుర్తులు, 3 లోన కనిపించే గుర్తులు చెప్పాడు. అవి వైష్ణవులు ధరించే బొట్టు, భుజాన శంఖ చక్రముల ముద్ర మరియు మెడలో తులసి మాల. లోన మరో మూడు గుర్తులు. అవి కష్టం కలిగినా, సుఖం కలిగినా భగవంతుడిని మరచి పోనివారు, ఎవ్వరిని ద్వేశించనివారు, ఎవ్వరికి కష్టం లేక సుఖం కల్గినా తమకే కలిగిందని భావించువారిని వైష్ణవులుగా గుర్తించవచ్చునని
రామానుజాచార్యులవారి ఉపకార కృతజ్ఞతగా వారి నామాన్ని మనం శిరసా ధరిస్తాం. 
అందుకే రామానుజ దాస లేక రామానుజ దాసి అని మన పేరు చివరన దరిస్తాం.

👉 4  మంత్ర సంస్కారం
ఈ జ్ఞాన జన్మకి గురువు తండ్రి అయితే, మత్రం తల్లి. పరంపరగా వచ్చే గురువులనే మనం స్వీకరిస్తాం. వారి ద్వారానే మనం మంత్రాన్ని పొందుతాం. ఆ మంత్రార్థాలతో మనం జీవనం కొనసాగిస్తాం.

👉 5.యాగ సంస్కారం
ఎప్పుడైతే మనం ఈ శరీరం భగవంతుడు ఉండే స్థలమని భావిస్తున్నామో, ఆ శరీరంతో చేసే ప్రతి పని యాగం అవుతుంది. దీన్నే పూజ అని కూడా అంటారు. పూజ అంటే కేవలం భగవంతుడి ముందర కూర్చొని చేసేది కాదు అని గుర్తించాలి. 

💠'సం' అంటే ఒక గురువు ద్వారా లేక మంచిగా అని అర్థం, 'ఆశ్రయణం' అంటే అశ్రయించడం అని అర్థం. మంచి మార్గాన అడుగు పెట్టడాన్నే సమాశ్రయణం అని అంటారు.

©Santosh Kumar

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS