Monday, May 22, 2023

పుణ్యఫలం - ధనయోగాలు - అదృష్టం - దైవానుగ్రహం..........!!

 పుణ్యఫలం - ధనయోగాలు - అదృష్టం - దైవానుగ్రహం..........!!



మనిషికి ధనం 3 రూపాలలో వస్తుంది....


1. యోగంద్వారా. 2. ప్రాప్తము ద్వారా 3.  శ్రమ ద్వారా.


1. యోగము కూడా 3 రకాలుగా మారుతూంది.


1. ధనవంతునిగా పుట్టడం

2. మధ్యవయసులో ఏదో ఒక   వ్యాపారములోనో ధన వంతులు కావటం

3. తన సంతానము ద్వారా వృద్దాప్యంలో సంపన్నుడు అవటం.


అదృష్టం కూడా అంతే....


1. తాను పుట్టినప్పుడు తల్లిదండ్రులకు కలసివచ్చి ధనవంతులు అవటం.

2. తన జీవిత భాగస్వామి అడుగుపెట్టిన సమయము ద్వారా సంపన్నులు అవటం.

3. తన సంతానము ద్వారా ధన వంతులు అవటం

లంటివన్నీ యోగం అంటారు


2. ప్రాప్తము.

1. తనకు ఎవరో వ్రాసిన వీలునామా మూలకంగా ధనం రావటం.

2. నిధి, నిక్షేపాలు, దొరకటం.

3. ఏ లాటరీ ద్వారానో లేదా జూద వ్యసనం ద్వారానో ధనం రావటం.


ఈ ప్రాప్త్య ధనాన్ని అనుభవించే యోగ్యతా చాలా తక్కువ.


3. శ్రమ ద్వారా ధనము రావటం. ఇది కలియుగములో అసాథ్యం మారే ఇతర విధములుగా ధనము రాదు.


ధనానికి ముగ్గురు శత్రువులు......

1.అహంకారం.

2.వ్యసనం.

3.వాంఛ.

ఈ మూడు లేకుంటే ధనం నిలుస్తుంది.

సామాన్యముగా ప్రాప్తము ద్వారా వచ్చే ధనము వారు ఉన్నంత వరకు ఉంటుంది తరువాత పోతుంది.


మనము చాలా మంది విషయంలో వింటూవుంటాము, చూస్తూవుంటాము, పెద్దలు ఇచ్చిన ఆస్థిని కరిగించి వేసిన కారణంగా పిల్లలు రోడ్డు మీద ఉన్నారని కారణం ఇదే.


సాధారణముగా గురువులు కానీ మారెవరైనా కానీ ప్రాప్తని మార్చలేరు. కానీ యోగాన్ని మార్చవచ్చు.


ప్రతిజీవికి ఎక్కడో ధన యోగం ఉంటుంది. దాన్ని ముందుకు తీసుకు రావచ్చు. మంత్రము ద్వారా కానీ తంత్రము ద్వారాకాని పొందవచ్చు. ఇది మార్చాలంటే జాతకం లేదా ధ్యానము ద్వారా చేయ వచ్చు. ప్రయత్నం, సాధన, భయభక్తులు  దైవానుగ్రహం అవసరం. అంటే కొంత శక్తి ని ధారపోసి చూడాలి.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS