నవగ్రహాలకు అంతరిక్ష అధిదేవతలు.
ఏ గ్రహామైన ఆ మహాశక్తి దుర్గమ్మ కనుసన్నల్లో సంచరించాల్సిందే.
ఒక్కో గ్రహం ఒక్కో అంతరిక్ష అధి దేవత ఆధీనంలో ఉంటుందని చెబుతుంది తంత్ర శాస్త్రం.
ఆ అంతరిక్ష అధి దేవత ఆరాధన (జపం,హోమ, మంత్ర, యంత్ర,తంత్ర) పరిహారాల ద్వారా ఆయా గ్రహ దోషాలను మనం సులువుగా నివృత్తి చేసుకోవచ్చు.
1.రవి గ్రహానికి అంతరిక్ష అధి దేవత శ్రీమాతంగి దేవి.దశమహా విద్యలో ఈ దేవి తొమ్మిదవ విధ్య గా వెలుగొందుతోంది.
2.చంద్ర గ్రహానికి అంతరిక్ష అధి దేవత శ్రీ భువనేశ్వరి దేవి దశమహావిద్యల్లో ఈవిడ నాల్గవ విద్య.
3. కుజ గ్రహానికి అంతరిక్ష అధి దేవత
శ్రీ బగలాముఖి.ఈమే దశమహావిద్యల్లో 8వ మహావిద్య.
4.బుధ గ్రహానికి అంతరిక్ష అధి దేవత శ్రీషోడశీ దేవి. దశమహావిద్యల్లో ఈమె మూడో విద్య.
5.గురు గ్రహానికి అంతరిక్ష అధి దేవత తారా దేవి. ఈమె దశమహా విద్యల్లో 8వ మహా విద్య.
6.శుక్ర గ్రహానికి అంతరిక్ష అధి దేవత కమలాదేవి. ఈమె దశమహావిద్యల్లో పదవ విద్య.
7.శని గ్రహానికి అంతరిక్ష అధి దేవత కాళికాదేవి .దశమహావిద్యల్లో మొదటి విద్య.
8.రాహు గ్రహానికి అంతరిక్ష అధి దేవత శ్రీ చిన్నమస్తదేవి.ఈమె దశమహావిద్యల్లో ఆరవ విద్య.
9. కేతు గ్రహానికి అంతరిక్ష అధి దేవత శ్రీ ధూమవతి .ఈమె దశమహావిద్యల్లో ఏడో విద్య.
No comments:
Post a Comment