అష్టమి అనగా 8 వ తిథి. శుక్ల పక్షమున గాని, కృష్ణ పక్షమున గాని, బుధవారము నాడు అష్టమి సంభవించినచో ఆ అష్టమిని “బుధాష్టమి” అని అంటారు.
ఈ బుధాష్టమి నాడు పరమ శివుని పూజకు, అమ్మ పార్వతి దేవి పూజకు మిక్కిలి శ్ఱేష్టము. ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసము ఉండి, శివారాధన, పార్వతి దేవి ఆరాధన చేస్తారో, అట్టి వారు మరణానంతరం నరకమునకు పోరట. ఈ బుధాష్టమి వ్రతము సలుపు వారు స్వచ్చమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితంలో సకాల అభివృద్ధి పొందుతారు. ఈ బుదాష్టమి వ్రతమును గుజరాత్ యందును, మహారాష్ట్ర యందును ఎక్కువగా ఆచరిస్తారు.
బుధాష్టమి వ్రత విధానము:
~~
ఈ దినమున అనగా బుదాష్టమి నాడు భక్తులు నవగ్రహాలలో ఒకడైన బుదుడిని ఆరాదించి, ఆయన అనుగ్రహమును పొందడానికి శుభ దినం.
ఈ వ్రతమునకై బుధ విగ్రహము కానీ, బంగారు, వెండి కాసులో చిత్రీకరీంచిన బుధరూప కాసు ను కానీ ఉపయోగించెదరు.
ఈ బుధుడి ముందు నీటితో నింపిన కలశమును పెట్టి కొబ్బరి బోండామును ప్రతిష్టించెదరు. పిదప భయ భక్తులచే వివిధ పూజలను చేసి, ఆ నైవేద్య ప్రసాదమును అందరికీ పంచి ఇస్తారు.
ఈ వ్రతము ప్రారంబించినవారు వరుసగా 8 మార్లు ఆచరించవలెను.
ఈ విధముగా ఆచరించిన పిదప కడపటి బుధాష్టమి నాడు నీరు పేదలకు భోజనాలు పెట్టి తోచిన వస్త్ర దానం చేయవలెను. వారికి నెలకు సరిపడ బియ్యం, నూనె, పప్పులు దానము చేయవలెను. ఈ విధముగా బుధ అష్టమి వ్రతమును చేసిన వారికి వారి సకల దోషములు తోలగి పుణ్యం లభించి నరక లోకమునకు పోక కైవల్య ప్రాప్తి పొందుతారు. కొందరు ఈ దినమున శివ పార్వతులకు పూజలు కూడా నిర్వహిస్తారు.
ఈ బుధాష్టమి విశిష్టత:
~
ఈ బుధాష్టమి యొక్క విశిష్టత బ్రహ్మాండ పురాణము నందు వివరింప బడివున్నది. ఈ వ్రతం చేసిన వారికి ప్రస్తుత, పూర్వజన్మ పాపముల నుండి విముక్తి లభించును. శివ, పార్వతి ఆరాధన ఈ బుధాష్టమి నాడు చేసిన అంతటి ఫలితం లభించును. ఈ వ్రతమాచరించిన వారికి బుధగ్రహ దోషములు నివారింపబడి బుధగ్రహ బాధలనుండి విముక్తి లభించును.
శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం
~~~
బుధో బుధార్చితః సౌమ్యః సౌమ్యచిత్తః శుభప్రదః
దృఢవ్రతో దృఢబలః శ్రుతిజాలప్రబోధకః ౧
సత్యవాసః సత్యవచాః శ్రేయసాంపతిరవ్యయః
సోమజః సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః ౨
వేదవిద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞానభాస్వరః
విద్యావిచక్షణ విభుర్ విద్వత్ప్రీతికరో బుధః ౩
విశ్వానుకూలసంచారీ విశేషవినయాన్వితః
వివిధాగమసారజ్ఞో వీర్యవాన్ విగతజ్వరః ౪
త్రివర్గఫలదోఽనంతః త్రిదశాధిపపూజితః
బుద్ధిమాన్ బహుశాస్త్రజ్ఞో బలీ బంధవిమోచకః ౫
వక్రాతివక్రగమనో వాసవో వసుధాధిపః
ప్రసాదవదనో వంద్యో వరేణ్యో వాగ్విలక్షణః ౬
సత్యవాన్ సత్యసంకల్పః సత్యబంధుః సదాదరః
సర్వరోగప్రశమనః సర్వమృత్యునివారకః ౭
వాణిజ్యనిపుణో వశ్యో వాతాంగీ వాతరోగహృత్
స్థూలః స్థైర్యగుణాధ్యక్షః స్థూలసూక్ష్మాదికారణః ౮
అప్రకాశః ప్రకాశాత్మా ఘనో గగనభూషణః
విధిస్తుత్యో విశాలాక్షో విద్వజ్జనమనోహరః ౯
చారుశీలః స్వప్రకాశః చపలశ్చ జితేంద్రియః
ఉదఙ్ముఖో మఖాసక్తో మగధాధిపతిర్హరః ౧౦
సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకరః సుఖీ
సింహాధిరూఢః సర్వజ్ఞః శిఖివర్ణః శివంకరః ౧౧
పీతాంబరో పీతవపుః పీతచ్ఛత్రధ్వజాంకితః
ఖడ్గచర్మధరః కార్యకర్తా కలుషహారకః ౧౨
ఆత్రేయగోత్రజోఽత్యంతవినయో విశ్వపావనః
చాంపేయపుష్పసంకాశః చారణః చారుభూషణః ౧౩
☀️ ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్ ☀️
🌻 శుభమస్తు 🌻
🌹 లోకా సమస్తా సుఖినోభవన్తు 🌹
No comments:
Post a Comment