శివుడి తాండవరూపాలు
ఇవి, తొమ్మిది రకాలుగా వుంటాయి. శివుడి ప్రతిమలలో అత్యంత అందమైంది నటరాజ రూపము. శివ తాండవము వలన ప్రకృతి శక్తుల కదలిక, శక్తి, మరియు సృష్టి స్థితి లయలకు కారణాలు తెలుస్తాయి.
🌻( 1) నృత్య ఆనంద తాండవమూర్తి - అందరికి పరిచయమైనదే నృత్యమూర్తి ఆనంద తాండవమూర్తి. శివనటరాజ రూపం ఎప్పుడూ స్థానక భంగిములోనే చూపబడుతుంది. ఆసస్మార లేదా వనియులకుడనే రాక్షసుని మీద నాట్యము జరుగుతుంది. ఈ మూర్తి కి సాధారణంగా నాలుగు చేతులుంటాయి.
🌻(2) సాధ్యతాండవం - సాధ్యతాండవంలో అపస్మార రాక్షసుడు వుండడు.
🌻(3) ఉమాతాండవం రూపంలో ఉమ ఎడమ వుంటుంది.
🌻(4) గౌరీ తాండవంలో శివునకు కుడివైపున నంది కేశ్వరుడు వుంటాడు.
🌻(5) కాళికాతాండవం భయంకరంగా వుంటుంది.
🌻(6) త్రిపురతాండవంలో శివునికి 16 చేతులుంటాయి.
🌻(7) సంహార తాండవంలో తీక్షణమైన చూపులుంటాయి.
🌻(8) లలితతాండవంలో శివుడు మృదువుగా వుంటాడు.
🌻(9) ఊర్ద్వతాండవంలో వివిధ ఆయుధాలు ధరించిన 16 చేతులుంటాయి.
🌻శివయ్య ఇతర రూపాలు🌻
🌻(i) దక్షిణామూర్తి :- శివుడు వ్యాఖ్యాతగా ఋషులకు బోధనచేసిన అవకారం ఇది. ఈరూపంలో శివుడు రాతి మీద కూర్చొనివుంటాడు. కుడికాలు కొద్దిగా వంగి ఆపస్మారుని మీద వుంటుంది. ఎడమకాలు అడ్డంగా కుడికాలి తొడమీద వుంటుంది. దక్షిణామూర్తిలో జ్ఞానదక్షిణ, యజ్ఞదక్షిణ, యోగదక్షిణా మూర్తి అనే మూడు రకాలున్నాయి.
🌻(ii) కంకాళమూర్తి
బ్రహ్మ శిరస్సును ఖండించిన తర్వాత శివుడు దేశ ద్రిమ్మరిగా మారిన రూపంఇది. నాలుగు చేతులు, జటామకుటం, సర్పాభరణం, కంకాళదండ ఈ మూర్తి ప్రధాన లక్షణాలు.
🌻(iii) భిక్షాటనమూర్తి
తారకారణ్యంలో నగ్నంగా, దిమ్మరిగా శివుడు సంచరించిన రూపంఇది. నాలుగు చేతుల్లో త్రిశూలం, జింక, ఢమరుకం, పుర్రెను పుంచుకొని కాళ్ళకు చెప్పులతో నడిచివెళ్ళేరూపం ఇది ·
🌻(iv) గంగాధరమూర్తి
భగీరధుని కోరికమీద గంగ స్వర్గలోకం నుండి దిగివచ్చే రూపంఇది. అందువల్ల శివప్రతిమ నిలబడివుంటుంది. బలంగా వస్తున్న గంగా ప్రవాహాన్ని తట్టుకోడానికి కాల్లు భద్రంగా, స్థిరంగా పుంచబడ్డాయి-
🌻(v) అర్ధ నారీశ్వరమూర్తి
అర్ధశరీరం పురుషరూపంలో, మిగతా సగం స్త్రీరూపంలో వుంటుంది. అన్నిరకాల ఆభరణాలుంటాయి. సాధారణంగా ఈ అవతారంలో శివునికి నాలుగు చేతులుంటాయి. కొన్ని సందర్భాలలో రెండులేదా మూడుచేతులు కూడా వుంటాయి. ఉదా:- మహాబలిపురంలోని ధర్మరాజరధం మీద ఈ శిల్పం వుంది.
🌻(vi) హరిహరమూర్తి
వామన పురాణంలో శివకేశవులకు తేడాలేదని బోధింపబడిన వర్ణనకు సరిఅయిన రూపం ఇది. అర్థనారీశ్వరునివలె రెండు భాగాలుగా శరీరం విష్ణు, శివరూపాలలో వుంటాయి. సాధారణంగా ఈ ప్రతిమకు నాలుగు చేతులుంటాయి. ఉదా:- మైసూర్లోని హరిహర ఆలయంలోని శిల్పం.
🌻(vii) కళ్యాణ సుందరమూర్తి
శివపార్వతుల పరిణయ దృశ్యం ఇది. ఈ ప్రతిమలో శివుడు పార్వతి కుడిచేతిని వివాహసూచనగా పట్టుకొని వుంటాడు. ఉదా: చోళ ఆలయాలలో ఈ శిల్పాలు చూడవచ్చు.
🌻(viii) వీణాధరమూర్తి
శివుని అద్భుతమైన స్థానక ప్రతిమఇది. ఒక కాలు కొద్దిగా వంగి అపస్మార రాక్షసుని శిరస్సుమీద వుంటుంది. తనముందు చేతులతో శిపుడు వీణవాయిస్తూవుంటాడు.
🌻(ix) వృషభారూఢమూర్తి
శివుడు వృషభము మీద ఆసీనుడైన రూపం ఇది.
🌻🌻🌷
No comments:
Post a Comment