Tuesday, August 25, 2020

చివటం అమ్మ (అచ్చమ్మ)


చివటం అమ్మ (అచ్చమ్మ)


అసలు పేరు అచ్చమ్మ. ఈమె దిగంబర యోగిని, సాధు అమ్మగా ప్రసిద్ధి చెందింది. ఈమె తణుకు సమీపాన గల చివటం గ్రామములో సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించింది. ఈమె భర్త దుర్మార్గుడు.

 అతడు బాధ్యతారాహిత్యంతో తిరుగుతుండే వాడు. ఆయన ఎన్ని బాధలు పెట్టినా సహనంతో వివిధ పనులు చేసి తన భర్త బిడ్డలకు వండి పెట్టే సాధ్వి. ఆమెకు భక్తి మెండు. ఆమె రామనామాన్ని స్మరిస్తూ ఉండేవారు. ఖాళీ దొరికితే ధ్యానానికి కూర్చునేవారు. ఒకనాడు ఆమె తన కొడుకుని తల్లికి అప్పగించి ఇల్లు విడిచి వెళ్ళీపోయింది.

 కొన్నాళ్లు ఆమె చిన్నాయి గూడెం లో ఉన్నారు. ఆ తర్వాత మన్నెం జగన్నాధపురం వెళ్లి ఆ ప్రాంతంలో 12 సంవత్సరాలు మౌనంగా కఠిన దీక్షలు చేసారట. ఈ కాలంలో ఎన్నో మహిమలు ప్రదర్శించేవారని స్థానికుల నమ్మకం. రాజమండ్రి స్త్రీల మఠంలో కొంతకాలముండి, చివటం చేరారు. చివటం లో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడక తన్మయస్థితిలో బట్టలుకూడా జారిపోతున్నా తెలియని స్తితిలో వుండేవారు. 

ఒకరోజు జారిపోతున్న తనచీరను తీసి ఒకబాలునిపై వేసి అప్పటినుండి దిగంబరంగా ఉండిపోయారు. అమ్మ చివటం సమీపములో జమ్మిచెట్టు క్రింద ధ్యానం చేసుకుంటుండేవారు. ఎవరయినా అడిగితే కాయలు కాయని చెట్టుక్రింద కూర్చోవాలి అనేవారు.

ఈమె ఎక్కువకాలం శ్మశానములో గడిపేవారు. అప్పుడప్పుడూ మూడు ఇళ్లకు మాత్రమే బిక్షకువెళ్ళేవారు. బిక్షచేతిలో ఉంచుకుని పరుగులు తీసేవారు. తనగురించి, శరీరసృహే లేకుండా చిదానందస్థితిలో ఉండే ఆమెకు గ్రామం లోనివారే మంచిచెడ్దలు చూసేవారు. శేషమ్మగారని ఒకావిడ బలవంతంగా తీసుకెళ్ళి స్నానము చేయిం చేవారు. చివటములో అలా 12 సంవత్సరాలు ధ్యానం లో గడిపారు.

మహాత్ములు కూడా ఆమె దర్శనం కోసం వచ్చేవారు. అయితే వచ్చినవారి పాదాలను తాకి నమస్కరించే వారు అమ్మ. ఎదిగేకొద్దీ ఎలా ఒదగాలో సాధకులకు చేసి చూపించారు అమ్మ. సాధూరాం బాబాజీ శిష్యులయిన హఠయోగి అప్పారావుగారికి కూడా అమ్మ అలానమస్కరించబోగా ఆయన బాధపడి, అమ్మా నువ్వు పండిపోయావు నేనింకా పండవలసిన వాడిని అని అన్నారు.

 ధ్యానం ఎలాచెయ్యాలి అని అడిగిన భక్తులతో, మొదట ఓమ్ కారం చెయ్యాలి, ఆతర్వాత రామరామ అనుకుంటూ మౌనంగా కూర్చోవాలి. ధ్యానం లోంచి లేచేటప్పుడు కూడా, ఓంకారం చేయాలి. చీపురుపెట్టి తుడిస్తే వాకిట్లో ఎంత శుభ్రంగా ఉంటుందో, అలాగే ఓంకారము చేసినప్పుడు కూడా మనసులో మాలిన్యము తొలగిపోతుంది అని చెప్పారు.

 ఆధ్యాత్మికోపన్యాసాలు వినడం కూర అంతవినాలి, ధ్యానం అన్నమంత చేయాలి అనేవారు. ధ్యానం బంగారుముద్ద వంటిది, దానికి మించినదిలేదు
 అనిచెప్పేవారు. అందుకొరకు ఎటువంటి నిబంధనలు అక్కరలేదనేవారు. కాలు కడుక్కోక పోయినా పరవా లేదే, రామరామా అనుకోండే అనేవారు. నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి ఎంత తాపయత్ర పడతామో అంతకన్నా ఎక్కువ ఆత్రుత పడాలి దైవంకోసం అనేవారు అమ్మ.

 రామాలయంలో నివసిస్తూ స్వయంగా వంటచేసి అందరికీ తల్లిలా తినిపిస్తుండేవారు ఆ మహాత్మురాలు. తన సమాధిని ముందుగానే సూచించారు అమ్మ. మహాసమాధికి వారం రోజులముందు తన పంటిని పీకించి సూరమ్మ అనే భక్తురాలికిచ్చి దాచుకోమన్నారు.

రామాలయములో నివసిస్తూ స్వయంగా వంట చేసి అందరికీ తల్లిలా తిని పిస్తుండేవారు ఆ మహాత్మురాలు. తన సమాధిని ముందుగానే సూచించారు అమ్మ. మహాసమాధికి వారం రోజుల ముందు తన పంటిని పీకించి సూరమ్మ అనే భక్తురాలికిచ్చి దాచుకోమన్నారు.

 1981 జూన్ 8 వతేదీ అర్ధరాత్రి కావస్తుండగా తన భక్తులను కూచోబెట్టుకుని .. ఎవరైనా ఏదన్నా అంటే మనం పది మాటలు అన కూడదు. ఎప్పుడూ దృఢంగా వుండాలి, గుమ్మములోనికి వచ్చిన వారికి ఒక ముద్దచేతిలో పెట్టి నీరు ఇవ్వాలి అని చెప్పారు. తరువాత గీత చదివించుకుని విన్నారు. తరువాత కొబ్బరికాయ కొట్టించి హారతి ఇప్పించుకుని ప్రశాంతంగా పరలోక  ప్రాప్తి పొందారు.

సమాధి అయిన వెంటనే వచ్చిన వాడపల్లి బాబుగారు శిరస్శు చూసి అమ్మ కపాలభాగం చిట్లి రక్తం గడ్డకట్టి ఉన్నదని,  అమ్మ బ్రహ్మరంధ్రంగుండా శరీరాన్ని విడిచారని చెప్పారు. ఇక్కడికి ఎందుకొచ్చామే పిడకలెరు కోవటానికా? రామరామ అను కోండే అని తన చుటుపక్కల వారికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరణ ద్వారా చూపిన ఆసద్గురువు పాద పద్మాలకు మనసారా నమస్కరించు కుందాము.

🕉🌞🌍🌙🌟🚩

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS