Sunday, May 7, 2023

శరభుడి జయంతి పరమశివుడి మరో అవతారం శరభుడు. ఇది సాధారణంగా చాలామందికి తెలీదు. ఇది శివుడి భీకర శక్తివంతమైన రూపం.

 శరభుడి జయంతి


పరమశివుడి మరో అవతారం శరభుడు. ఇది సాధారణంగా చాలామందికి తెలీదు. ఇది శివుడి భీకర శక్తివంతమైన రూపం.

👉చాలా మందికి సాధారణంగా తెలీని పరమశివుని మరో అవతారం శరభుడు. ఇది విశ్వాన్ని రక్షించడానికి శివుడు ధరించిన చాలా శక్తివంతమైన రూపంగా భావిస్తారు. ఆయన శరభేశ్వరుడిగా అవతారం ధరించి విష్ణుమూర్తి యొక్క కోపరూపమైన , సగం మానవుడు సగం సింహరూపమైన నరసింహ అవతారాన్ని నియంత్రించాడు.

👉విష్ణుమూర్తి నరసింహ అవతారాన్ని తనకి ఎంతో ఇష్టమైన భక్తుడు ప్రహ్లాదుడుని రాక్షసుడైన , తండ్రి అయిన హిరణ్యకశిపుడి నుంచి రక్షించడానికి నృసింహ అవతారం ఎత్తాడు. అతన్ని చంపిన నరసింహుడిలో ఆగ్రహ జ్వాలలు ఇంకా తగ్గలేదు.

👉అదేపనిగా గాండ్రిస్తూ , ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించాడు. దీని వల్ల జరిగే అనర్థాలను ముందే గ్రహించి , ఇతర దేవతలు , అధిదేవతలు మహాదేవుడి సాయం కోరగా , ఆయన శరభుడి అవతారం ధరించి కోపంలో ఉన్న నరసింహుడిని శాంతింపచేసి , మామూలు విష్ణురూపంలోకి మార్చాలని నిర్ణయించాడు.

👉శరభుడిగా శివుడి రూపలక్షణాలు
శివుడి అవతారమైన శరభుడు మానవుడు , జంతువు మరియు పక్షి కలగలసిన అతిపెద్ద పరిమాణంలో ఒళ్ళంతా పొక్కులు కల రూపం. అనేక చేతులు , పంజాలు మరియు కాళ్ళు ఉండి దాదాపు పెద్ద డ్రాగన్ పక్షిలాగా ఉంటాడు. అట్టలు కట్టిన జుట్టు ఆ రూపంలో చాలా కోపాన్ని సూచిస్తుంది. తలపై ఒక పెద్ద జుట్టుతో నిండిన భాగం డోమ్ లాగా కన్పిస్తుంది.

👉శరీరానికి వెనకవైపు విచ్చుకుని ఉండే పెద్ద రెక్కలు మరియు పొడవైన తోక వీపుపై ఉంటాయి. నోటిలో చాలా సూదిగా ఉండే దంతాలు , పటిష్టమైన పంజాలు ఆ రూప ముఖ్య ఆయుధాలు. ఉరుములాంటి గొంతు ప్రతిద్వనులు సృష్టిస్తూ అస్సలు వినలేము.

👉మూడు కళ్ళు నిప్పు కణితులవలె మండుతూ ఉంటాయి. పళ్ళు మరియు పెదవులు స్పష్టంగా ఏర్పడి , కన్పిస్తాయి కూడా. మొత్తంగా అన్ని సమయాల్లో భరించలేని ఒక బుసకొట్టే శబ్దం వినిపిస్తూనే ఉంటుంది.

*పరమశివుని శరభావతారం కథ*

👉మొదటగా శివుడు వీరభద్ర రూపం ధరించి నరసింహుడిని శాంతించమని కోరాడు. కానీ నరసింహుడు మాట వినిపించుకోలేదు. అందుకని ఆకారంలో , శక్తిలో నరసింహుడిని మించిన శరభావతారాన్ని శివుడు ఎత్తాల్సి వచ్చింది.

👉శరభుడు తన పొడవైన తోకతో నరసింహుడిని ఎత్తి పడేయబోయాడు. నరసింహుడికి విషయం అర్థమై శరభుడిని క్షమించమని ప్రార్థించాడు. ఇది పరమశివుడికి నరసింహుడు విష్ణుమూర్తిగా మారిపోయాడని అర్థమై అతన్ని ఇక బాధించలేదు.
శివుడి ఈ అవతారానికి గౌరవంగా నరసింహుడు తన సింహపు చర్మాన్ని వలసి శరభేశ్వరమూర్తికి కానుకగా సమర్పించాడు.

👉అలా పరమశివుడి శరభుడి అవతారం విష్ణుమూర్తి అవతారమైన నరసింహుడిని మామూలుగా మార్చింది. ఈ శివుడి అవతారాన్ని శరభేశ్వరుడిగా కొలుస్తారు.

*👉శివాలయాల్లో గర్భగుడికి ముందు రెండు శరభేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్టించడం చూడవచ్చు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS