Thursday, July 12, 2018

దత్తాత్రేయుని 24 మంది గురువులు.


దత్తాత్రేయుని 24 మంది గురువులు.
యాదవ వంశానికి మూలపురుషుడైన యదువు అనే రాజు దత్తాత్రేయుని చూచి స్వామీ మీరెలా సదానంద, చిదానంద స్వరూపులై ఉండ గలుగుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు దత్తాత్రేయుల వారు ఇలా సెలవిచ్చారు.
యదు రాజా ! నేను సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నింటి నుండీ జ్ఞానం సంపాదించాను. చెప్తాను విను. 
ప్రకృతిలో నాకు 24 మంది గురువులున్నారు. కొన్నింటినుండి ఎలా ఉండాలో తెలుసుకున్నాను, కొన్నింటినుండి ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. అని
1. భూమి నుండి –
క్షమా, పరోపకారత్వం నేర్చుకున్నాను.
2. వాయువు నుండి-
నిస్సంగత్వం, నిర్లేపత్వం.
3. ఆకాశము నుండి-
సర్వవ్యాపక తత్త్వం.
4. జలము నుండి –
నిర్మలత్వం, మాధుర్యం స్నిగ్ధత్వం,
5. అగ్ని నుండి –
తేజస్సు, ఈశ్వర తత్త్వం.
6. సూర్యుని నుండి-
జలగ్రాహి, జలత్యాగియు,లోకబాంధవుడు, సర్వలోకాలకు అతడొక్కడే అని తెలుసుకున్నాను.
7. చంద్రుని నుండి –
వృద్ధి క్షయాలన్నవి దేహానికే కాని, ఆత్మకు కావు అని తెలుసుకున్నాను.
8. పావురాల జంట నుండి –
కామక్రోధాలకు వశమైనచో ఆత్మానురాగం కోల్పోతారని తెలుసుకున్నాను.
9. అజగరము నుండి(కొండ చిలువ) –
దైవికంగా లభించిన దానికి తృప్తి చెంది, లభించని దానికై వెంపర్లాడక ఉండాలని కొండచిలువ నుండి నేర్చుకున్నాను.
10. సముద్రం నుండి-
తనలో ఉన్న మనోభావాలను బైటకు పొక్కనీయకూడదని నేర్చుకున్నాను.
11. మిడత నుండి –
సుఖమని భ్రమించి మోహమనే జ్వాలాగ్నికి బలి అయి, మృత్యువుకి చేరువవుతుందని తెలుసుకున్నాను.
12. తేనెటీగ –
యోగి ఎవరినీ నొప్పించకుండా భిక్ష సంపాదించుకొన్నట్లు, తేనెటీగ కూడా ఏ పువ్వు కూడా బాధపడకుండా, గాయపడకుండా తేనెను సంగ్రహిస్తుంది. ప్రతీ పుష్పాన్ని వదలకుండా తేనెను సేకరించినట్లే ఏ గ్రంథాన్ని, ఏ ఒక్క విషయాన్ని వదలకుండా శాస్త్రాధ్యయనం చేయాలనేది తెలుసు కున్నాను. తాను కష్టపడి కూడబెట్టిన తేనెను (తేనెపట్టును) పరాయి వారికి వదిలేస్తుంది. కానీ యోగులు రేపటి అవసరాల కోసం సంపాదించరు.
13. గజం(ఏనుగు)నుండి –
ఏనుగు తనకున్న స్త్రీలౌల్యం వల్ల ఎంత బలమైనదైనప్పటికీ, ఇతరులకు వశపడుతుంది.
14. మధుహారి –
ఇతరులు కూడబెట్టిన వస్తువును, న్యాయాన్యాయాలు ఆలోచించకుండా అపహరించేవాడు నీచుడు అనబడతాడు.
15. లేడి నుండి-
అమాయకత్వంతో వేటగాని వలలో పడుతుంది. అమాయకత్వం కూడదని తెలుసుకున్నాను.
16. చేప నుండి –
జిహ్వ చాపల్యంతో ఇంద్రియనిగ్రహం కోల్పోయి ఎరకు చిక్కి బాధపడుతుంది. జిహ్వ ఎంత చేటు చేస్తుందో తెలుసుకున్నాను.
17. పింగళ(ఒక వేశ్య) నుండి –
భౌతిక వాంఛలకు, ధనాశకు లొంగి కాలాన్ని, సాధనాన్ని (మనశ్శరీరాలు) దుర్వినియోగం చేసుకోకూడదని తెలుసుకున్నాను.
18. కురరము(లకుముకి పిట్ట) నుండి –
ఇతరులకు, తనకు మధ్య తేడాలు గ్రహించక వారితో పోటీపడటం మంచిది కాదు అని గ్రహించడం.
19. బాలుడి నుండి –
పాపపుణ్యాలు ఎరుగక యోగితో సమానుడిలా ఉండాలని తెలుసుకున్నాను..
20. కన్యక నుండి-
ఎటువంటి పరిస్థితులున్నప్పటికీ, కుటుంబ గౌరవాన్ని కాపాడటం.
21. శరకారుడు (విలుకాడు) నుండి –
ఏకాగ్రత.
22. సర్పము నుండి –
జీవితం అశాశ్వతమని గ్రహించినదానివలె తనకంటూ స్థిరనివాసం ఏర్పరుచుకోదు.
23. సాలెపురుగు –
ఎన్నిసార్లు లయమయినా, మరల మరల సృష్టిస్తుంది. ప్రయత్నం వల్ల కార్యసిద్ధి.
24. పురుగు నుండి –
భ్రమరకీటకన్యాయం వలె మనస్సంతా భగవంతుని మీదే లగ్నంచేసి చివరకు భగవంతునిలో లీనం అవ్వాలి అనేది తెలుసుకున్నాడు.
ఆ విధంగా ప్రకృతిలోని ప్రతీ అణువు తనకు గురువేననీ, తన మనస్సు కూడా తనకు గురువేనని తెలియచెప్పారు.
ఆ విధంగా తానే స్వయంగా దేవతలు, రాజులు, మహర్షులకి ఎందరికో గురువైనప్పటికీ, అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతీ అణువు నుండి నేర్చుకుంటూ శిష్యుడు కూడా అయ్యాడు.
24.ఏకాదశుల పేర్లు మరియు ఫలాలు..
1. చైత్ర శుక్ల ఏకాదశి –
‘కామదా’ - కోర్కెలు తీరుస్తుంది.
2. చైత్ర బహుళ ఏకాదశి - '
వరూధిని' - సహస్రగోదాన ఫలం లభిస్తుంది.
3. వైశాఖ శుద్ధ ఏకాదశి - '
మోహిని' - దరిద్రుడు ధనవంతుడగును.
4. వైశాఖ బహుళ ఏకాదశి -
'అపర' - రాజ్యప్రాప్తి.
5. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి - '
నిర్జల' - ఆహారసమృద్ధి.
6. జ్యేష్ఠ బహుళ ఏకాదశి - '
యోగినీ' - పాపాలను హరిస్తుంది.
7. ఆషాఢ శుద్ధ ఏకాదశి - '
దేవశయనీ' - సంపద-ప్రాప్తి (విష్ణువు యోగనిద్రకు శయనించే రోజు).
8. ఆషాఢ బహుళ ఏకాదశి - '
కామిక' - కోరిన కోర్కెలు ఫలిస్తాయి.
9. శ్రావణ శుక్ల ఏకాదశి - '
పుత్రదా' - సత్సంతాన ప్రాప్తి.
10. శ్రావణ బహుళ ఏకాదశి -
'అజ' - రాజ్య, పత్నీ, పుత్ర ప్రాప్తి మరియు అపన్నివారణం.
11. భాద్రపద శుద్ధ ఏకాదశి –
పరివర్తన' - యోగసిద్ధి (యోగనిద్రలో విష్ణువు ప్రక్కకు పొర్లును కనుక పరివర్తన).
12. భాద్రపద బహుళ ఏకాదశి -
'ఇందిరా' - సంపదలు, రాజ్యము ప్రాప్తించును.
13. ఆశ్వయుజ శుక్ల ఏకాదశి -
'పాపాంకుశ' - పుణ్యప్రదం.
14. ఆశ్వయుజ బహుళ ఏకాదశి -
'రమా' - స్వర్గప్రాప్తి.
15. కార్తిక శుక్ల ఏకాదశి - '
ప్రభోదిని' - జ్ఞానసిద్ధి (యోగనిద్ర నొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు).
16. కార్తిక కృష్ణ ఏకాదశి - '
ఉత్పత్తి' - దుష్టసంహారము (మురాసురుని సంహరించిన కన్య విష్ణు శరీరము నుండి జనించిన రోజు).
17. మార్గశిర శుక్ల ఏకాదశి -
'మోక్షదా' - మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).
18. మార్గశిర కృష్ణ ఏకాదశి - '
విమలా' (సఫలా) - అజ్ఞాననివృత్తి.
19. పుష్య శుక్ల ఏకాదశి - '
పుత్రదా' - పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).
20. మాఘ కృష్ణ ఏకాదశి -
'కల్యాణీ' (షట్తిలా) - ఈతిబాధ నివారణం.
21. మాఘ శుక్ల ఏకాదశి -
'కామదా' (జయా) - శాప విముక్తి.
22. మాఘ కృష్ణ ఏకాదశి -
'విజయా' - సకల కార్య విజయం (ఇది భీష్మ ఏకాదశి).
23. ఫాల్గుణ శుక్ల ఏకాదశి -
'అమలకీ' - ఆరోగ్యప్రదం.
24. ఫాల్గుణ కృష్ణ ఏకాదశి - '
సౌమ్యా' - పాపవిముక్తి.
ఓం నమో భగవతే వాసుదేవాయ..స్వస్తి..!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
                         శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS