Wednesday, July 18, 2018

ఆషాడ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం చంద్ర గ్రహణం పైన అపోహలు వద్దు

ఆషాడ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం
చంద్ర గ్రహణం పైన అపోహలు వద్దు
ఆషాడ  శుద్ధ పౌర్ణమి అనగా జూలై 27 , 2018, శుక్ర వారమున గల చంద్ర గ్రహణము... కేతు   గ్రస్తోదితము, ఖగ్రాస  ఉత్తరాషాడ  / శ్రవణ  నక్షత్ర యుక్త  చంద్ర గ్రహణము. అనగా సంపూర్ణ చంద్ర గ్రహణం కలదు. ఈ గ్రహణము మన దేశములో కనిపిస్తుంది. కావున ఇట్టి చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుంది.
⭕ *గ్రహణ సమయ వివరాలు :-*
గ్రహణ స్పర్శ కాలము — రాత్రి 11. 54 ని॥లకు
గ్రహణ మధ్య కాలము — రాత్రి 01 : 52 ని ॥లు
గ్రహణ మోక్ష కాలము — రాత్రి 03 : 49 ని॥లకు
అంటే చంద్ర గ్రహణము రాత్రి 11 గం. 54 ని॥లకు ప్రారంభమయ్యి , రాత్రి 03 : 49 ని॥లకు ముగుస్తుంది.
ఇట్టి చంద్ర గ్రహణ పుణ్య కాలము మొత్తం 4  గంటల పాటు  కలదు.
  ఏయే దేశాల్లో ఈ గ్రహణం ఉంది ? : మన దేశంతోబాటు, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ చంద్ర గ్రహణం కన్పిస్తుంది.
ఈ చంద్ర గ్రహణం గురించి సోషల్   మీడియాలో అనేక వదంతులు వినిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి అధమ ఫలము అని కొన్ని రాశులవారికి మధ్యమ ఫలం అని చూస్తున్నాము. నిజానికి ఇవన్నీ అపోహలే. ఈ ప్రపంచంలో అవే రాశుల్లో   జన్మి౦చిన హిందువులు కొన్ని కోట్ల మంది ఉన్నారు.   ఏదైనా అశుభం  అయితే అన్ని కోట్ల మందికి ఒకేవిధంగా  అరిష్టం ఉంటుందా ఆలోచించాలి ? జాతకంలో తమ దశ విదశల గ్రహల స్థితి ని బట్టి మాత్రమే జాతక ఫలితాలు ఉంటాయి కానీ ఇలా గ్రహణం   కారణంగా ఎలాంటి కీడు జరుగదు. అలాగే రాశి ఫలాలు కూడా !
కావున  అన్ని రాశుల వారు ఎలాంటి భయానికి గురికావొద్దు అని హిందూ ధర్మచక్రం సూచిస్తుంది.
గ్రహణం సమయంలో అన్ని రాశులవారు   తమకు ఉపదేశం ఉన్న మంత్ర జపం చేయడం ఉపదేశం లేని వారు శివ పంచాక్షరి, అష్టాక్షరి జపం చేసుకోవడం విశేషం. తద్వారా   దైవ అనుగ్రహం లభిస్తుంది.
అనవసర   అపోహలతో సమయము డబ్బు వృధా చేసుకోరాదు.
మీకు ఇక్కడ ఒక అనుమానం రావొచ్చు.
ఇలా ఫలానా రాశివారికి ఫలానా దానం చేయాలి అని మన పెద్దలు పంచాంగంలో రాసారు కదా అని ?
నిజమే ! సిద్ధాంతులు ఎప్పుడూ అసత్యము రాయరు. కానీ నేటి కాలంలో అల్ప మేధస్సుతో జనాల బలహీనతలను సొమ్ము చేసుకునే వారు ఎక్కువయ్యారు కనుక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.  పంచాంగంలో చెప్పిన ప్రకారం ఏ రాశి వారికీ బాలేదో ఆ రాశివారు గ్రహణ సూచిత సమయంలో ఎక్కువ జపం చేసుకున్నా సరిపోతుంది.
⭕  *గర్భిణీలు భయపడవద్దు*
గ్రహణం అనగానే అధికంగా కంగారు పడేది గర్భిణీలు వారి తల్లి తండ్రులు. గ్రహణ సమయంలో ఎటూ కదల రాదు అని,   ఒకే దిశలో పడుకొని ఉండాలి అని, కదిలితే గ్రహణ మొర్రితో పిల్లలు పుడతారు అనే  వదంతులు చాలా ఉన్నాయి.                             నిజమే !   గ్రహణం లోని అతినీలలోహిత కిరణాల ( UVR ) ద్వారా సున్నితమైన శిశువు పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది అని మన మహర్షులు చెప్పారు.  ఆ దుష్ప్రభావం అత్యధికంగా *సూర్య   గ్రహణం*లోనే ఉంటుంది   కానీ చంద్ర గ్రహణం వలన అంతటి  హాని కలుగదు కావున గర్భిణీలు ఎలాంటి భయమునకు లోను కాకుండా Normal గానే ఉండవచ్చు.
*అయితే గ్రహణ సమయంలో కిరణాలు పడకుండా జాగ్రత్త వహిస్తే సరి.
⭕  *గ్రహణానికి ముందు ఏమీ తినరాదా* ?
గ్రహణానికి ముందు తింటే దోషం అని అరిష్టం అని చెబుతుంటారు. మన మహర్షులు చెప్పిన పరిశోధనాత్మక విషయమే అది. సూర్య గ్రహణం వలన సంభవించే *Ultra Violated Rays* నిజంగానే  అంతటి శక్తివంతమైనవి. సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో కొన్ని సెకన్లు కనుక సూర్యుడిని చూస్తే మరు  సెకన్ లో కంటి చూపు పోతుంది,  వారి పరిశోధన శక్తికి మనం గర్వపడాలి. 
అయితే  ఆ సూత్రాలన్నీ  మన మహర్షులు చెప్పిన కాలానికి సంబంధించినవే .( గ్రహణం విషయంలో )   *అతి నీల లోహిత కిరణాలు* (UVR ) వెనుకటి నివాసాలు అయిన గుడిసెలు పెంకుటిళ్ళ లోకి సులభంగా చేరేవి, ఆ కాలంలో విద్యుత్తు లేదు కనుక  వెలుతురు   ఇంట్లోకి రావడం కోసం ఇంటి  చూరు కి అద్దాలు పెట్టేవారు. అలాగే ఇంటి నాభిస్తానంలో గచ్చు   ఏర్పాటు చేసేవారు.   తద్వారా సూర్యకిరణాలు డైరెక్ట్ గా ఇంట్లోకి ప్రవేశించేవి.   కనుక వారు వండిన పదార్థాల గురించి కానీ లేదా నిలువ ఉంచిన పదార్థాల గురించి  గానీ జాగ్రత్త పడేవారు. 
నేడు కరెంటు ఉండి , RCC తో కట్టుకుంటున్న ఇల్లు వచ్చినప్పటికీ అదే ఆచారం నేటికీ అలాగే కొనసాగుతుంది.   
పంచాంగంలో  గ్రహణము రోజున కొన్ని గంటల ముందు ఎలాంటి పదార్థాలు  తినరాదు అని చెబుతారు. అక్కడే రోగులు, చిన్న పిల్లలు, వృద్ధులు మినహా  అని కూడా చెబుతారు.
 *ఇక్కడే మీరు కొద్దిగా లోతుగా ఆలోచించాలి. గ్రహణ వేద వలన ఆహారానికి ఏదైనా దుష్ప్రభావం కలిగితే త్వరగా ఎఫెక్ట్ అయ్యేది కేవలం రోగులకి, చిన్న పిల్లలకి వృద్ధులకి మాత్రమే* !, కానీ పంచాంగ కర్తలు మన పెద్దవారు పై  వారికి మాత్రమే Exemption ఇవ్వడంలో అర్ధం ఏంటి ?
గ్రహణం సమయం ఉపాసనకి చాలా విశేషం. గ్రహణ సమయానికి   ముందు సుష్టు గా  భోజనం చేస్తే శరీరం మత్తు గా ఉండిపహిందూ ధర్మచక్రం:
ోతుంది. ఈ సమయం మళ్ళీ గ్రహణం సంభవించే వరకు రాదు కనుక ఆహార  నియమాలను పాటించి గ్రహణ సమయంలో దైవ సన్నిధిలో జపం పారాయణం చేయాలి అనే ఉద్దేశ్యం ఉంది. కాదంటారా ?
⭕ పై ఆర్టికల్  ద్వారా  ప్రజలను చైతన్యం  చేస్తూ నిజా నిజాలు చెప్పే ప్రయత్నం చేశాను కానీ, నాకు మన శాస్త్రాల పైన గానీ  ఋషుల మాట పైన గౌరవం లేక కాదు.
సదా సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటూ....శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రం.శ్రీ మహాగణాధిపతయేనమః
          శ్రీ సదాశివాది
           సప్త గురుభ్యోనమః
ది--27-07-2018 శుక్రవారం విలంబనామసంవత్సర ఆషాఢపూర్ణిమరోజున కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము
     రాత్రి-  గం-11-52  నిముషములనుండి 03-48 నిముషములవరకు
నిత్య భోజనములు  మధ్యాహ్నం 02-40  లోపులొ ముగించుకోవాలి
బాలురకు,వృద్ధులకు అనారోగ్యవంతులకు రాత్రి 08-50  వరకు స్వీకరించవచ్చును
మకరరాశిలొ గ్రహణం కావున
మకరరాశివారు చూడరాదు
అలాగె,ఉత్తరాషాడా,శ్రవణా నక్షత్రములవారికి,బహుదోషం
మేష,సింహ,వృచ్చిక,మీన రాసులవారికి ---  శుభం
వృషభ,కర్కాటక,కన్య,ధనుస్సు రాసులవారికి--  మధ్యమఫలం
మిధున,తుల,మకర,కుంభ రాసులవారికి---  అధమఫలితం
ఆరోజు మధ్యాహ్న సమయానికి,దేవాలయాలు మూసివేసి
మరుసటిరోజు యధావిధిగా సంప్రోక్షణాదులు చేయవలెను 
శుక్రవారం గ్రహణంరోజున ఆబ్దీకం వచ్చినయడల మధ్యాహ్నం 11-50 నిమషములలోపు పూర్తిచెయ్యవలెను
         

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS