Thursday, July 12, 2018

ఈ రాశులు కలిసిన జంటల మధ్య విడతీయలేని నిజమైన ప్రేమ ఉంటుందట

ఈ రాశులు కలిసిన జంటల మధ్య విడతీయలేని నిజమైన ప్రేమ ఉంటుందట.
        :-
హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్ళికి ముందు జాతకాలు చూసి, ఒకరి రాశితో మరొకరి రాశి మ్యాచ్ అయితేనే పెళ్ళిళ్ళు చేస్తారు. వారి జాతక రీత్యా అన్ని బాగున్నాయో లేదో ఒకటికి రెండు సార్లు పరికించి చూస్తారు.
కుల గోత్రాలు, కట్న కానుకలు, ఇతరత్రా అన్నింటిలోనూ ఇరు కుటుంబాల వారికీ సమ్మతి అయినా… జాతకాలు కలవడం లేదని ఆగిపోయిన పెళ్లిళ్లు ఎన్నో.
అయితే కొన్ని రాశులు జంటలు చాలా బాగుంటాయని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇంతకూ ఆయా రాశులు అవేమిటో చూద్దాం..
తులారాశి - సింహరాశి..
ఈ రెండు రాశులవారు అగ్ని తత్వం కలిగి ఉంటారు. ఇద్దరికీ కోపం ఎక్కువ. చాలా వరకు ఇద్దరి అలవాట్లూ, అభిరుచులు ఒకేలా ఉంటాయి. సమాజంలో పేరు పొందటం అందరినీ ఆకర్షించుకోవడం ఈ రెండు రాశుల వారికి ఎంతో ఇష్టమట. వీరిద్దరూ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు.
మిథునరాశి – తులారాశి..
ఈ రెండు రాశులవారికి శారీరక ఆకర్షణ ఉంటుంది. అందుకే ఒకరినొకరు వదిలి ఉండలేరట. ఎప్పుడు కలిసే ఉంటారట.
మేషరాశి - కుంభరాశి..
ఈ రెండు రాశులవారు ఎప్పుడూ ఒకరికొకరు బోర్ కొట్టరట. ఒకరితో ఒకరు ఆనందంగా ఉంటారని జ్యోతిష్య పండితులు అంటున్నారు. అందుకే వీరి కలియిక ఎంతో సంపూర్ణంగా ఉంటుందట.
మేషరాశి – కర్కాటకరాశి..
మేష రాశి వారి నడవడిక, వ్యక్తిత్వాన్ని కర్కాటక రాశివారు ఎంతగానో ఇష్టపడతారట. అందువల్ల ఒకరినొకరు వదిలి ఉండలేరట.
మేషరాశి - మీనరాశి..
మీనరాశి వారు పూర్తిగా మేషరాశి వారిపై ఆధారపడే తత్వం ఉన్నవారు. అందుకే ఈ జంట పరిపూర్ణంగా ఉంటుంది.
కర్కాటక - మీనరాశి..
ఈ రాశుల వారు శాంతంగా ఉంటారు. గొడవలు జరిగినా కూర్చుని పరిష్కరించుకుంటారు. అందుకే వీరిద్దరూ ఎప్పుడు ఆనందంగా ఉంటారు.
వృషభం - కర్కాటం..
వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. ఎంతో తెలివైన జంటగా వ్యవహరిస్తారు. వీరి జంట పరిపూర్ణమని నిపుణుల మాట..స్వస్తి..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
                        శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS