Thursday, July 12, 2018

దుర్గమ్మకు మంగళవారం నేతి దీపం వెలిగించి , దుర్గాష్టకంతో స్తుతిస్తే....


దుర్గమ్మకు మంగళవారం నేతి దీపం వెలిగించి , దుర్గాష్టకంతో స్తుతిస్తే....
మంగళవారం పూట దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
మంగళవారం రాహుకాలంలో దుర్గమ్మ తల్లికి దీపమెలిగించే మహిళలు నిష్ఠతో అమ్మవారిని దుర్గాష్టకంతో స్తుతిస్తే ఈతి బాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి.
మంగళవారం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా తలస్నానమాచరించి.. ఇంటిని, పూజామందిరమును శుభ్రం చేసుకుని పువ్వులు, ముగ్గులతో అలంకరించుకోవాలి.

మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 వరకు ఆలయాల్లో జరిగే రాహుకాల పూజను ముగించుకోవాలి.
అనంతరం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గృహంలో దీపమెలిగించి.. పాయసం నైవేద్యంగా సమర్పించుకోవాలి.
దీపమెలిగించే సమయంలో దుర్గా స్తోత్రాన్ని 9 తొమ్మిదిసార్లు పఠిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS