Thursday, July 12, 2018

శ్రీ వేంకటేశ్వర స్వామి 5000 యేళ్ళ కిందట స్వామివారు స్వయం వ్యక్తమూర్తియై ఏడుకొండలపైకి ఎక్కారట


శ్రీ వేంకటేశ్వర స్వామి మొదటి పేరు?
స్వామి ఎన్ని ఏళ్ళక్రితం కొండపైకి స్వయంవ్యక్తంగా వచ్చారంటే!
5000 యేళ్ళ కిందట స్వామివారు స్వయం వ్యక్తమూర్తియై
   ఏడుకొండలపైకి ఎక్కారట
☘️శ్రీవారి మొదటి పేరు సాలగ్రామ శిలామూర్తి. అప్పట్లో శ్రీవారు
   ఈ పేరుతోనే పూజలందుకునేవారు☘️
తిరుమల వెంకన్న ఏడుకొండలపై సాక్షాత్కారం ఎప్పుడు ఇచ్చారంటే చాలామందికి ఈ విషయం తెలియదు.
☘️5000 యేళ్ళ కిందట స్వామివారు స్వయం వ్యక్తమూర్తియై ఏడుకొండలపైకి ఎక్కారు. ఇది నిజంగా నిజం☘️.
ప్రస్తుతం చాలామందికి స్వామివారి మొదటి పేరు తెలియదంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురాణాల్లో మాత్రమే స్వామివారు ఎన్ని యేళ్ల కిందట ఇక్కడకు వచ్చారన్న విషయం ఉంది.
☘️మరో ప్రధానమైన విషయమేమిటంటే శ్రీవారి మొదటి పేరు సాలగ్రామ శిలామూర్తి. అప్పట్లో శ్రీవారు ఈ పేరుతోనే పూజలందుకునేవారు☘️.

శ్రీనివాసుని మహిమను తెలుసుకున్న భక్తులు అప్పట్లోనే వందలాదిగా ఏడుకొండలకు తరలివచ్చేవారు. అప్పటి నుంచి ఇప్పటివరకు గోవిందుని దర్శించుకునే భక్తులు సంఖ్య లక్షల్లో ఉంటోంది.
☘️శ్రీనివాసునికి ఒక పేరు కాదు, ప్రపంచంలోనే ఏ దేవునికి లేని పేర్లు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి☘️.
అందులో ఆపద మ్రొక్కులవాడు, అడుగడుగు దండాల వాడు, కోరిన వరాల రాయుడు, కలియుగ వైకుంఠుడు, శ్రీమన్నారాయణుడు, వైకుంఠధారి, సర్వాంతర్యామి, నిత్య కళ్యాణ చక్రవర్తి, శేషాచలపతి, ఏడుకొండలవాడు, వేంకటాచలపతి, శ్రీనివాసుడు, శ్రీవారు, ఆనంద నిలయుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో వస్తుంటాయి. వీటిలో కొన్ని మాత్రమే మనకు తెలుసు.

☘️శ్రీవారు సాక్షాత్కారం సమయంలో మహావిష్ణువుతో చెప్పారట. వైకుంఠాన్నయినా విడిచి వుంటాను గానీ భక్తులను ఎంతమాత్రం విడిచి వుండలేనన్న దృఢమైన సంకల్పాన్ని చెప్పారట☘️.
అలా శ్రీనివాసుడు లోకకళ్యాణం కోసం మాత్రమే భువికి దిగివచ్చి నిత్యం కళ్యాణ పరంపరలు గుప్పిస్తున్న నిత్య కళ్యాణ చక్రవర్తిగా విరాజిల్లుతున్నాడు.

☘️నిత్య కళ్యాణం, పచ్చతోరణంలాగా ఎప్పుడూ తిరుమలలో కళ్యాణాలు జరగడం, స్వామి సన్నిధిలో వివాహాలు చేసుకుంటుండడం ఇక్కడి ప్రత్యేకత☘️.
భక్తుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతినిత్యం గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమ్రోగుతూనే ఉన్నాయి.
మనం కూడా అందామా గోవిందాగోవిందా

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS