Thursday, July 12, 2018

మహత్తరమైన మహేశ్వర పుష్పపూజా

మహత్తరమైన మహేశ్వర పుష్పపూజా
వేయి మారేడు దళాలకంటే..ఒక తామరపువ్వు ఉత్తమం.
వేయి తామరపువ్వుల కంటే ఒక ..️పొగడపువ్వు ఉత్తమం.
వేయి పొగడపువ్వుల కంటే ఒక.ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.
వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒకములక పూవు ఉత్తమం.
వేయి ములక పూవుల కంటే ఒక..తుమ్మిపూవు ఉత్తమం.
వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపూవు ఉత్తమం.
వేయి దర్భపూల కంటే..ఒక జమ్మిపూవు శ్రేష్ఠం.
వేయి జమ్మి పువ్వుల కంటే ఒక..నల్లకలువ ఉత్తమం..
అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు.
శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది..ఓం నమః శివాయ..స్వస్తి..!!
లోకా సమస్తా సుఖినోావంతు..!!
                            శ్రీ మాత్రే నమఃపూజకు..శ్రేష్ఠమైనవి.పువ్వులు
పరమేశ్వరుని పూజకు..
జిల్లేడు..
గన్నేరు..
మారేడు..
తమ్మి..
ఉత్తరేణు ఆకులు..
జమ్మి ఆకులు..
జమ్మిపూలు..
నల్ల కలువలూ..
మంచివి.
     దాసాని, మంకెన, నదంతి, మొగలి, మాలతి, కుంకుమ మద్ది   ఈ పూలు పూజకు పనికిరావు.
తొడిమ లేని పూవులు పూజకు పనికిరావు..
తమ్మి పువ్వుకు పట్టింపు లేదు.
     మారేడు నందు శ్రీమహాలక్ష్మీ..
నల్ల కలువనందు పార్వతీ..
తెల్ల కలువ నందు కుమార స్వామి..
కమలము నందు పరమేశ్వరుడూ కొలువై ఉంటారు. అలాగే చదువుల తల్లి సరస్వతీ దేవి తెల్ల జిల్లేడులో..
బ్రహ్మ కొండవాగులో..
కరవీర పుష్పంలో గణపతీ..
శివమల్లిలో మహావిష్ణువు..
సుగంధ పుష్పాలలో గౌరీదేవి ఉంటారు.
     అలాగే శ్రీమహావిష్ణువును అక్షింతలతోను..
మహాగణపతిని తులసితోనూ..
తమాల వృక్ష పువ్వులతో సరస్వతీ దేవినీ..
మల్లెపూలతో భైరవుడినీ..
తమ్మిపూలతో మహాలక్ష్మినీ..
మెగిలి పూలతో శివుడినీ..
మారేడు దళాలతో సూర్భగవానుడినీ..
ఎట్టి పరిస్థితులలోనూ పూజింపరాదు.
ఓం నమః శివాయ..స్వస్తి..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
                          శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS